Nojoto: Largest Storytelling Platform

నువ్వు లేకపోతే నక్షత్రాలు ఏమీ తోచక తన బొమ్మలు తామ

నువ్వు లేకపోతే  నక్షత్రాలు ఏమీ తోచక తన బొమ్మలు తామే చిత్రించుకుంటాయి 
చంద్రుడు తన అంతరిక్ష ధారలో నిరాధారంగా సంచరిస్తుంటాడు  
సూర్యోదయం అవుతుంది, కానీ శీతలాన్ని ఆంన్తం పంచుతూనే ఉంటుంది 
నీ సాంత్వనం లేకపోవడం వల్ల ఆకాశం అయోమయంగా చూస్తుంటుంది 

నువ్వు లేకపోతే , మెలోడీ మూగపోతుంది 
జీవితం రంగులద్దుకోని హోలీ అవుతుంది 
జీవితములో హాస్యం అపహాస్యమైపోతుంది 
నువ్వు వినిపించని నీ నవ్వు విలాపంగా మారుతుంది 

నువ్వు  లేకుండా, ప్రపంచం అసమగ్రమైనది అయిపోతుంది 
ప్రతి క్షణం పరిపూర్ణంకాకుండా పోతుంది 
రోజులు దారుణంగా గడిచిపోతాయి , అంతా ఒక నిర్విర్యపు అనుభూతి అవుతుంది 
నువ్వు  లేకుండా, ప్రపంచం పనికిమాలినదైపోతుంది

©gopi kiran
  #Walk
gopikiran7359

gopi kiran

Bronze Star
New Creator
streak icon410

#Walk #Poetry

135 Views