Nojoto: Largest Storytelling Platform

కళ్ళ ముందే పరిస్థితులు చేజారుతుండగా లోన కొట్టుమిట్

కళ్ళ ముందే పరిస్థితులు చేజారుతుండగా
లోన కొట్టుమిట్టాడుతున్న గుండె సడి ఎవరు కనగలరు
మిగతావాళ్ళంటే నా ప్రేమగాఢతెరుగరు... 
ఎవరికోసమింత యాతనో పడుతున్నానో వారే నిమ్మకు నీరెత్తనట్టుగా ఉంటే ఊపిరి పీల్చేదెలా..? 
నా స్వచ్ఛమైన ప్రేమని దక్కించుకోలేని నిస్సహాయత..
ఆ క్షణంలో నిస్సహాయత కూడా నన్ను చూసి జాలి పడుతుంది అంతటి దీన స్థితి నీ ప్రేమ ఫలం... కాదు కాదు ప్రేమ కాదు నీ ఆకర్షణా ఫలం.. 
   (In caption)

 తెలుసుకోలేకపోయా... కించిత్ సందేహమైనా కలగలేదే నీది ప్రేమా..? ఆకర్షణ అని.. ఐనా ఎందుకు తెలుస్తుందిలే.. 
ప్రేమనదీ ప్రవాహంలో త్రిసంధ్యల నిత్యస్నానమాచరించేవాడిని కదా... ప్రేమపవనాన్నే ఊపిరిగా శ్వాసించేవాడిని అదే దృష్టితో అంతా ప్రేమమయం అనుకున్నా నువ్వే జీవితమని తెలపకనే తెలిపి నీకోసం స్వమతానికి సరిసమానంగా నీ మతాన్ని నాలోకి ఆవహించుకున్నా.. నీ కారణంగా నాకే తెలియక లక్ష్యాన్ని అలక్ష్యపెట్టా.. నీతో సావాసమే అపుడు లక్ష్యం లా తోచింది మరి నీ నవ్వే అమృతంలా దప్పిక తీర్చింది మరి.. నీ చూపే ప్రసాదంలా నా దిశనే మార్చేసింది మరి.. నీ పరిసరమే నా గమనమైంది మరి.. ఇలా నా ఉనికికే కొత్త నిర్వచనం రాసేసుకున్నా.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్కుంటే నాకై నేను ఆలోచించుకున్న క్షణం లేదంటే అతిశయోక్తి కాదేమో..
మరీ ఇంతలా నన్ను నా మదిని నాకు సంబంధించి ప్రతీ అణువణువుని నీ వశం చేస్కున్నావ్
నువ్ నాకు ఆకర్షితమై నన్ను ప్రేమించేలా చేసి జీవితాంతం కోలుకోలేని  విధంగా నను ఊహాలోకపు శాశ్వత విహారిని చేసి సమస్తం నువే అనేలా జీవిస్తున్న క్షణక్షణం నీకోసమె అనిపించావ్ అలానే మారిపోయా కూడా...

నా జీవితంలో నాకిది లేదన్న లోటు లేదు అన్ని ఎక్కువే అలాంటి పరిస్థితుల్లో చేరువయ్యావ్,.. నిర్దాక్షిణ్యంగా పరమతస్థుడివని పరాయిని చేసి వెళ్ళిపోయావ్
ఇపుడు ఎన్నున్నా వ్యర్ధమనిపిస్తుంది 
అంత శూన్యంలా తోస్తుంది