Nojoto: Largest Storytelling Platform

సుకుమారం సొగసులద్దుకోగ, సౌందర్యం సోమ్మసిల్లిపోగ జన

సుకుమారం సొగసులద్దుకోగ, సౌందర్యం సోమ్మసిల్లిపోగ జనించనే అందం ఆడపిల్లగా, గారాలపట్టిగా పెరిగినా, సమస్యల సుడిగుండాలని దాటుతూ సాగినా, చిరినవ్వుల ఊయలలో  ఉగిసలూగినా, చీదరింపుల చిత్కారాలతో చెమ్మగిల్లినా,అతివ అత్మాభిమానం అనన్యమైనది, నిబ్బరానికి నిలువుటద్దం నిర్మలత్వానికి నిలువెత్తురూపం, నెత్తుటి మరకలు నెలనెలా నరకం చూపినా, ఒత్తిళ్ళ పొత్తిళ్ళలో నిత్యం నలిగినా చెదరని చిరునవ్వుతో ఎదురొచ్చే చెలి నీకు చేతులెత్తి మొక్కుతుంది ఈ అవని, అమ్మగా ఆరంభించిన జీవితంలో ఉండవు నీకంటూ ఇష్టాలు ఉండదు నీకంటూ నీ సమయం, అందచందాలకు సెలవని ఆటపాటల జీవితాన్ని ఆలనాపాలనలతో గడిపేస్తావు, పనులపిలుపులతో నిత్యం మేల్కొనే నీ ఉదయానికి సూర్యాస్తమయమైనా స్వస్తి పలుకక శ్రమించే నీ శక్తికి వందనం 🙏

©vineelasubramanyam women power 

#Women