Nojoto: Largest Storytelling Platform

కట్టుకున్న సౌధంతో వాటేసుకు పోవాలా ఆర్జించిన కట్టలత

కట్టుకున్న సౌధంతో వాటేసుకు పోవాలా
ఆర్జించిన కట్టలతో మాటేసుకు పోవాలా

దూరమైన బంధాలే వీడలేని గంధాలై
పెంచుకున్న ప్రేమలతో పెనవేసుకు పోవాలా

దేశ ప్రగతి కాంక్షించక మానవతను చూపించక
చాటు మాటు లంచంతో ముడులేసుకు పోవాలా

ఏ గూటిన చేరదవో ఆ పలుకే నీది కదా
అవగుణాల మిత్రులతో అడుగేసుకు పోవాలా

నీవెవరో? నీదేంటో? విచారించి తెలియకనే
తరిగిపోవు దేహంతో అల్లేసుకు పోవాలా

ఆరు రుచులు మరిచేస్తూ బీరు రుచులు పలవరిస్తు
వన్నెల్లో న్యూ ఇయరని చిందేసుకు పోవాలా #వన్నెలయ్య_గజల్ 20
#గజల్స్ #గజల్ #telugu #telugukavi #yourquote
కట్టుకున్న సౌధంతో వాటేసుకు పోవాలా
ఆర్జించిన కట్టలతో మాటేసుకు పోవాలా

దూరమైన బంధాలే వీడలేని గంధాలై
పెంచుకున్న ప్రేమలతో పెనవేసుకు పోవాలా

దేశ ప్రగతి కాంక్షించక మానవతను చూపించక
చాటు మాటు లంచంతో ముడులేసుకు పోవాలా

ఏ గూటిన చేరదవో ఆ పలుకే నీది కదా
అవగుణాల మిత్రులతో అడుగేసుకు పోవాలా

నీవెవరో? నీదేంటో? విచారించి తెలియకనే
తరిగిపోవు దేహంతో అల్లేసుకు పోవాలా

ఆరు రుచులు మరిచేస్తూ బీరు రుచులు పలవరిస్తు
వన్నెల్లో న్యూ ఇయరని చిందేసుకు పోవాలా #వన్నెలయ్య_గజల్ 20
#గజల్స్ #గజల్ #telugu #telugukavi #yourquote