మొదటిసారి తరగతి గదిలో పరిచయం అయ్యె తొలి ప్రేమ తొలకరి చినుకులు తనువును తడిమిన అనుభూతిని కలిగిస్తుంది అని అనిపించింది. దానికి ప్రేమ అనే పేరు పెట్టలేం అదొక వర్ణించలేని మధురమైన అనుభూతి.... రోజూ చూసే అమ్మాయే కానీ ఒక రోజు కళ్లకే కాంతి తెచ్చేంత కళగా కనిపించింది. బహుశా తన కళ్ళకు పెట్టుకొచ్చే కాటుక వల్లో, లేదా తను వేసుకొచ్చే డ్రెస్ వల్లో, లేదా ఆ పెదవిమీద ఉండే చిరునవ్వు వల్లో తెలియదు కాని మొత్తానికి నాకే తెలియకుండా నా ఆలోచనలు తనగురించి ఆలోచించడం మొదలుపెట్టేసాయి.....!!!! #cinemagraph #ప్రేమ #ప్రేమకావ్యం #ప్రేమతో #ప్రేమతోఒకసారి #love #ఫీలింగ్స్