Nojoto: Largest Storytelling Platform

ఆకాశం ఉరుముతు ఉంటే మేఘాలేమో అనుకున్న ఆనందం ఎల్లలు

ఆకాశం ఉరుముతు ఉంటే మేఘాలేమో అనుకున్న
ఆనందం ఎల్లలు దాటి బయటకు వచ్చి కూర్చున్న
ఆలోచనలెన్నో కలసి నామది తలుపులు తడుతున్నా
ఆమేఘపుటంచునుదాటి జారే చినుకుకై చూస్తున్నా

చూపులతో నిలిచెను కాలం,
తలపులతో నిండెను మౌనం,
కనులెదుట మిగిలెను శూన్యం,
మనసెళ్ళెను ఎటో పయనం.

చిరుగాలి చెప్పిన ఊసులు,
సిరిమల్లెలై పూసిన నవ్వులు,
ఆవెచ్చటి సూర్యుని కాంతులు,
మంచు ముత్యాలను మోసెను ఆకులు.

అలలన్నీ పోటీ పడుతూ
తీరంలో కేరింతలుకొట్టగా,
అది చూస్తూ అచ్చలపతులన్నీ
అచ్చోటనే కూర్చునిపోగా,
ఇకలెమ్మని కెరటాలెన్నో
ఆ కొండలను తడుపుతూ పోయెను.

నా కలలకు కళ్ళెం వేస్తూ,
నా తలపుల తలుపులు మూస్తూ,
జడి వాన తడిపేనమ్మ,
ఇక రమ్మని పిలిచే అమ్మ.

ఆకాశం ఉరుముతు ఉంటే మేఘాలేమో అనుకున్న
ఆనందం ఎల్లలు దాటి బయటకు వచ్చి కూర్చున్న
ఆలోచనలెన్నో కలసి నామది తలుపులు తడుతున్నా
ఆమేఘపుటంచునుదాటి జారే చినుకుకై చూస్తున్నా
 #telugu #telugupoem #kavita #teluguvelugu  #yqkavi

#Amaterasutelugu

amaterasu9739

amaterasu

New Creator