Nojoto: Largest Storytelling Platform

గుండె వేయు తాళాన్నీ చూడ రావు ఎందుకని మనసు కోరు గీ


గుండె వేయు తాళాన్నీ చూడ రావు ఎందుకని
మనసు కోరు గీతాన్నీ పాడ రావు ఎందుకని

మనసంతా గాయాలయి ఒంటరినై మిగిలినాను
విధిని దాటు వేళలలో తోడు రావు ఎందుకని

కలల నగము చేరాలని వడి వడిగా సాగినాను
నవజీవన నిర్మాతను మరపు రావు ఎందుకని

ఎన్నెన్నో వర్ణాలూ ఏ రంగుతొ వేసావో
గుండె గోడ నీబొమ్మను చెరప రావు ఎందుకని

నువు నడిచిన దారులే సరియైనవి అంటావేం
వన్నెలయ్య ప్రేమ పథము ఆడ రావు ఎందుకని #వన్నెలయ్య_గజల్ 59 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్
#వన్నెలయ్య_ప్రేమ #గజల్ #గజల్స్
#vnlmt దారులన్ని*

గుండె వేయు తాళాన్నీ చూడ రావు ఎందుకని
మనసు కోరు గీతాన్నీ పాడ రావు ఎందుకని

మనసంతా గాయాలయి ఒంటరినై మిగిలినాను
విధిని దాటు వేళలలో తోడు రావు ఎందుకని

కలల నగము చేరాలని వడి వడిగా సాగినాను
నవజీవన నిర్మాతను మరపు రావు ఎందుకని

ఎన్నెన్నో వర్ణాలూ ఏ రంగుతొ వేసావో
గుండె గోడ నీబొమ్మను చెరప రావు ఎందుకని

నువు నడిచిన దారులే సరియైనవి అంటావేం
వన్నెలయ్య ప్రేమ పథము ఆడ రావు ఎందుకని #వన్నెలయ్య_గజల్ 59 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్
#వన్నెలయ్య_ప్రేమ #గజల్ #గజల్స్
#vnlmt దారులన్ని*