Nojoto: Largest Storytelling Platform

ఏ గాలికి ఆ పాటను పాడడమే తప్పంటా.! వ్యక్తిత్వం లేకు

ఏ గాలికి ఆ పాటను పాడడమే తప్పంటా.!
వ్యక్తిత్వం లేకుండా ఆడడమే తప్పంటా.!

నీకంటూ పోరు లేద దశకంఠుడి సోదరుడివ.!?
నిదురలోన ఒల్లు మరిచి తూగడమే తప్పంటా.!

మందనేది మందులాగ ఉంటేనే మరియాదా
అతిథి వనీ మరిచిపోయి త్రాగడమే తప్పంటా.!

బంధాలను గెలిచేందుకు కొన్ని కొన్ని భరించాలి
విషయాలను తెగె వరకు లాగడమే తప్పంటా.!

లక్ష్యమేది లేకుండా బ్రతుకెందుకు దారుల్లో
కూడలిలో కదలకుండ కూలడమే తప్పంటా.!

నీతి రీతి నేర్పించిన జాతి మనది వన్నెలయ్య
విధము లేని సమూహాన్ని చేరడమే తప్పంటా‌.! #వన్నెలయ్య_గజల్ 251 #గజల్

#వన్నెలయ్య_గజల్ 251 #గజల్