Nojoto: Largest Storytelling Platform

చినుకు చినుకు నిన్ను తాకి తడుపుతుంటె ఎట్టాగే! చీర

చినుకు చినుకు నిన్ను తాకి తడుపుతుంటె ఎట్టాగే!
చీర తడిసి మధువలపు ఒలుకుతుంటె ఎట్టాగే!

జడిసి నువు హత్తుకోగ ఉరుములకే ఉలుకొచ్చెనె
అరుపు మాది చెలి నీదని నసుగుతుంటె ఎట్టాగే!

కౌగిలిలో వణుకుతున్న కిన్నెరసలె కందిపోద 
కవ్వమోలె తెమ్మెరొచ్చి చిలుకుతుంటె ఎట్టాగే!

శృతిమించక బుద్ధిగ నే ఉంటానని భీష్మిస్తే 
చిలుక పలుకు నువ్వలాగ పలుకుతుంటె ఎట్టాగే!

చీర మహిమొ చినదానీ మహిమొ గాని చిచ్చురేపి 
చినపాపల నడిమంతర అలుగుతుంటె ఎట్టాగే!  🤭😁...🌧️🌧️🤷

#గజల్ #వర్షం #ఎట్టాగే #yqbaba #yqkavi #telugu #teluguvelugu

🤭😁...🌧️🌧️🤷 #గజల్ #వర్షం #ఎట్టాగే #yqbaba #yqkavi #Telugu #teluguvelugu