Nojoto: Largest Storytelling Platform

హరివిల్లుకు రంగులేదు తన బాటకు వేసింది ఆ ద్రాక్షకు

హరివిల్లుకు రంగులేదు తన బాటకు వేసింది
ఆ ద్రాక్షకు తీపిలేదు తన మాటకు రాసింది

ఎన్ని విరుల కోమళాలు తెంపినదో ఏమొ మరీ
కుసుమాలకి నునుపు లేదు తన మేనుకు అద్దింది

బొండు మల్లె తీసుకున్న అప్పంతా తీర్చెనేమొ
చైత్రంలో తెలుపు లేదు తన నవ్వుకు పూసింది

గులాబీల తోటలోన తిరిగివచ్చె నా ముందుకు
రోజాలకు ఎరుపు లేదు తన బుగ్గకు అంటింది

సరదాలను వద్దంటే ఉరిమురిమీ చూస్తున్నది
బాణాలకు పదును లేదు తన చూపుకు నిండింది

వేధనలో నేనుంటే తన చమకులు ఆనందం
నా బ్రతుకున కళ లేదు తన చర్యకు ఒంపింది

వన్నెలయ్య సరసానికి మాటంటే పడదసలూ
దీపాలకు శోభ లేదు తన అలకకు నింపింది #వన్నెలయ్య_గజల్ 66
This gajal credit all by ravi varma akula..Garu.
రవిగారు 161 గజల్ పోస్టు చదవగానే చాల బాగ నచ్చింది.. ఎంత అంటే నాకు కూడా రాయాలనిపించినంత..
వీలు ఉన్నప్పుడు రాయాలని అనుకున్న కాని రవి గారి అనుమతి తీస్కుని వ్రాయాలని అనుకుని నిన్న అడిగాను.. ఓకే చెప్పారు. కానీ నిన్న వ్రాయడం కుదర్లేదు..
అడగగానే అనుమతి ఇచ్చినందుకు థ్యాంక్ యు సో మచ్ రవి గారు.

తప్పకుండా గజల్ చదివి మీ అభిప్రాయం, స్పందన తెలియజేస్తారని కోరుతున్న.. 🙏🙏🙏