Nojoto: Largest Storytelling Platform

అడగలేదే అడగలేదే! బోర్డర్ కెళ్ళి నిన్ను యుద్ధం చెయ్

అడగలేదే అడగలేదే!
బోర్డర్ కెళ్ళి నిన్ను యుద్ధం చెయ్యమని.
ఆదేశించలేదే ఆదేశించలేదే!
దేశంకోసం నిను ప్రాణ త్యాగం చెయ్యమని.
అనేదల్లా ఒకటే శుచీ,శుభ్రత పాటించమని.
ఆదేశించేదల్లా ఒకటే ఇంటి నుండి కాలు కదపకని.
నీ ప్రాణాన్ని రక్షించేందుకు తమ తమ ప్రాణాల్ని సైతం లెక్కచేయక 
రాత్రనక పగలనక నిద్రాహారాలకు కరువై 
వైద్య మరియు పోలీసుల బృందం బయట శ్రమిస్తుంటే...
దర్జాగా నీ ఇంట్లలో నిన్ను కాలుమీద కాలేసుక్కూర్చోమంటే 
ఒకరికి ఎపుడూ లేని పనికిమాలిన పని గుర్తొస్తుంది.
ఇంకొకరికి ఎక్కడా లేని ఆవేశం తన్నుకొస్తుంది.
యే శివదర్శనానికి ఎందుకంత తొందర?
ఇపుడే పోదామా? 
ఇంకా చాలా ఉంది జీవితం 
అసలు ఈ భూమి మీదికెందుకొచ్చామో 
ఆ సత్ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే పోదాం.
మనకోసం కాకపోయినా మన వాళ్ళకోసం 
సామాజిక దూరాన్ని పాటిద్దాం 
కొరోనాని నామరూపాల్లేకుండా 
తరిమి తరిమి కొడదాం. #కొరోనావైరస్ #సామాజికదూరం #yqbaba #yqkavi #telugu #teluguvelugu #coronavirus #corona_awareness