నిష్టూరాలే పలికిన గానీ.. మరువను మోసం చేసిన గానీ.. మాయని గుర్తులు లేవా చెలియా వీడుతు అడుగే వేసిన గానీ.. తీయగ ఉందే సఖియా బాధ వీడిన ప్రేమే కోసిన గానీ... గాయం మాన్పే కాలం నచ్చను గతాన్ని యదలో చెరిపిన గానీ.. వన్నెల కన్నులు హృదయం మరువదు చూపులు కత్తులు దూసిన గానీ.. #వన్నెలయ్య_గజల్ 282 #వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్ #గజల్