Nojoto: Largest Storytelling Platform

జాలితో తలుపులే తీయవా ఇకనైన.! గుండెలో ప్రేమనే చూడవా

జాలితో తలుపులే తీయవా ఇకనైన.!
గుండెలో ప్రేమనే చూడవా ఇకనైన.!

వస్తుంది పోతుంది ధనరాశి! మరి ప్రేమ?
నీ భ్రాంతి వదిలేసి చేరవా ఇకనైన.!

నీ మనసు కోరేది విదేశం ఇచ్చునా.!?
అడుగులిక నా వైపు వేయవా ఇకనైనా.!

సమస్తం కాదన్న నీ కొరకు వేచున్న
నిన్నాపే ఆంక్షలను దాటవా ఇకనైన.!

ఆ ఋక్కు పిలిచాక మాధవుడు కదలడా.!?
వన్నెలకు లేఖొకటి రాయవా ఇకనైనా.! #వన్నెలయ్య_గజల్ 253
#వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్
#గజల్
జాలితో తలుపులే తీయవా ఇకనైన.!
గుండెలో ప్రేమనే చూడవా ఇకనైన.!

వస్తుంది పోతుంది ధనరాశి! మరి ప్రేమ?
నీ భ్రాంతి వదిలేసి చేరవా ఇకనైన.!

నీ మనసు కోరేది విదేశం ఇచ్చునా.!?
అడుగులిక నా వైపు వేయవా ఇకనైనా.!

సమస్తం కాదన్న నీ కొరకు వేచున్న
నిన్నాపే ఆంక్షలను దాటవా ఇకనైన.!

ఆ ఋక్కు పిలిచాక మాధవుడు కదలడా.!?
వన్నెలకు లేఖొకటి రాయవా ఇకనైనా.! #వన్నెలయ్య_గజల్ 253
#వన్నెలయ్య_విఫల_ప్రేమ_గజల్
#గజల్