Nojoto: Largest Storytelling Platform

మతముల మధ్యా సమతలు మధురం.! ఎగిరే జెండా మడతలు మధురం.

మతముల మధ్యా సమతలు మధురం.!
ఎగిరే జెండా మడతలు మధురం.!

వీడుక నోర్వవు కలిసిన యదలు
అక్కా చెల్లెలి మమతలు మధురం

బాధకు చెమరని నయనం ఉందా?
హితరుల కొరకై కలతలు మధురం.!

మాసిన గాథలు ఎన్నో తెలుసా?
హృదయం మరువని చరితలు మధురం.!

వన్నెల గజళ్ళు పాడగ రాదా?
లయకై వాడే కొలతలు మధురం.! #వన్నెలయ్య_గజల్ 231 #గజల్ 
#వన్నెలయ్య_భవిష్య #వన్నెలయ్య_అకృత
మతముల మధ్యా సమతలు మధురం.!
ఎగిరే జెండా మడతలు మధురం.!

వీడుక నోర్వవు కలిసిన యదలు
అక్కా చెల్లెలి మమతలు మధురం

బాధకు చెమరని నయనం ఉందా?
హితరుల కొరకై కలతలు మధురం.!

మాసిన గాథలు ఎన్నో తెలుసా?
హృదయం మరువని చరితలు మధురం.!

వన్నెల గజళ్ళు పాడగ రాదా?
లయకై వాడే కొలతలు మధురం.! #వన్నెలయ్య_గజల్ 231 #గజల్ 
#వన్నెలయ్య_భవిష్య #వన్నెలయ్య_అకృత