Nojoto: Largest Storytelling Platform

పాలిమర్స్ కంపెని కక్కిన కాలుష్యపు విష వాయువులకి- వ

పాలిమర్స్ కంపెని కక్కిన కాలుష్యపు విష వాయువులకి- విశాఖపట్టణంలో విషాదపు ఛాయలు అలుముకున్నాయి, సముద్రపు అలల అల్లరితో ఆహ్లాద భరితమైన ప్రాంతం నేడు విషపూరితమై వికృత పరిస్థితులను ఎదుర్కుంటుంది, ఆయువు అర్ధాంతరంగా ఆగి  కోడిపిల్లల్లాగా కుప్పకూలుతున్న వారిని చూస్తుంటే వెన్నులో వొణుకు పుడుతుంది,  కునుకు నుంచి నేరుగా కాటికి కడతేర్చిందన్న వార్త విన్న కాలి కింద భూమి కంపించసాగింది , ఊపిరి తీసుకుంటే ఉసురు పోయింది, చల్లటి గాలికై తెరిచివున్న ద్వారాలు చావుని స్వాగతించాయి,  పసిపిల్లల పసిడిబవిష్యత్తు నిర్లక్ష్యపు పంజాలో నలిగిపోయింది, సరికొత్త ఆశయాలతో ప్రపంచంలో కొత్త వెలుగులు నింపాలన్న యువత ఆశలు చీకట్లో కలిసిపోయాయి, అన్ని బంధాలున్న వారిని కూడా అనాధలుగా  నిలబెట్టింది, కరోనా కాటుకి  జనం కుప్పలుగా రాలుతున్న వేళ ఆకలి చావులు కాక  ఇలాంటి అర్ధాంతరపు చావులు , వైరస్ వేట ముగియకముందే  విషవాయువులు ఇలా అట మొదలెడితే  మానవాళి మనుగడ  ప్రశ్నార్ధకంగా?? మారుతుంది.. #vizag #LGpolimers