Nojoto: Largest Storytelling Platform

చిన్న చూపు చూడడమే దునియాలో ఆపవా!? గువ్వ రెక్క స్వే

చిన్న చూపు చూడడమే దునియాలో ఆపవా!?
గువ్వ రెక్క స్వేచ్ఛ లెన్నొ ఆమె బాట కివ్వవా.!?

ఆ కోకిల పాటలన్ని వాసంతపు కాలాలే
కుహు కుహుల ఆమనిగా కూతుర్లని తెలియవా.!

చందమామ ఒక పక్షమే నింగి వైపు చూపేలా.?
ప్రతిరోజు వెన్నెలలా అమ్మయిని చూడవా.!

కళలేవో నేర్పాలని బడులెన్నో తిప్పుతావు
వెలలు లేని కళలరేడు అమ్మ ఒడికి చేర్చవా.!

స్త్రీ అంటూ లేకుంటే అందమేది ఇంటికే
వన్నెలయ్య కవిత ముగ్గు విజయలక్ష్మి వేయవా.! #వన్నెలయ్య_గజల్ 228 #గజల్ #మహిళాదినోత్సవం
చిన్న చూపు చూడడమే దునియాలో ఆపవా!?
గువ్వ రెక్క స్వేచ్ఛ లెన్నొ ఆమె బాట కివ్వవా.!?

ఆ కోకిల పాటలన్ని వాసంతపు కాలాలే
కుహు కుహుల ఆమనిగా కూతుర్లని తెలియవా.!

చందమామ ఒక పక్షమే నింగి వైపు చూపేలా.?
ప్రతిరోజు వెన్నెలలా అమ్మయిని చూడవా.!

కళలేవో నేర్పాలని బడులెన్నో తిప్పుతావు
వెలలు లేని కళలరేడు అమ్మ ఒడికి చేర్చవా.!

స్త్రీ అంటూ లేకుంటే అందమేది ఇంటికే
వన్నెలయ్య కవిత ముగ్గు విజయలక్ష్మి వేయవా.! #వన్నెలయ్య_గజల్ 228 #గజల్ #మహిళాదినోత్సవం