Nojoto: Largest Storytelling Platform
maneeshabasaiahg9179
  • 41Stories
  • 0Followers
  • 93Love
    0Views

Maneesha Basaiahgari

  • Popular
  • Latest
  • Video
1b83869052fecd1fcd8d4da8061e8764

Maneesha Basaiahgari

పువ్వు  విరిసినపుడు..
జల్లు  కురిసినపుడు,

కోయిల కూసినపుడు..
వెన్నెల కాసినపుడు,

కొత్తగుంటుంది నా గుండె చప్పుడు,
వినపడదది ఎల్లప్పుడూ !

నువ్వు చూసినపుడు ..
నవ్వు విసిరినపుడు,

పేరు పిలిచినపుడు ..
నన్నే కోరినపుడు,

వింటున్నా ఆ చప్పుడు...
ఇన్నాళ్ళకు, మళ్ళీ ఇపుడు !! #YQbaba#yqkavi#telugu
1b83869052fecd1fcd8d4da8061e8764

Maneesha Basaiahgari

I sit back and wonder ,
"When was the last time my eyes shed a tear ?"

And I tell myself ,
"Maybe I haven't allowed it out of fear"

"What's there to fear a tear ? "
You might laugh and mock at me !

How can I not fear a tear ,
When I see it as 'An inevitable Tsunami,
that comes only to drown me ! ' #YQbaba#yqkavi#tears
1b83869052fecd1fcd8d4da8061e8764

Maneesha Basaiahgari

Sometimes I am Anne Frank 
Who inspite of everything,
believes that people are good at heart.

And then I become Sylvia Plath
Who drops down to insanity,
feeling darkness leaking from cracks everywhere! #YQbaba#optimist#pessimist
1b83869052fecd1fcd8d4da8061e8764

Maneesha Basaiahgari

It doesn't matter.. 

To some eyes 
You remain stardust

While to some 
Just dust  #YQbaba#unique
1b83869052fecd1fcd8d4da8061e8764

Maneesha Basaiahgari

చీకటిలో నడవలేక ,
వెలుతురేమో కానరాక ..

విధిరాతను గెలువలేక ,
మది బరువును మోయలేక ...

కన్నీటితో ఇంకా ..
ఎన్నాళ్ళీ యుద్ధం ?
కాల్చే అగ్నిలా ,
మార్చు నీ కణకణం ! #cinemagraph#YQbaba#yqkavi#telugu
1b83869052fecd1fcd8d4da8061e8764

Maneesha Basaiahgari

కరిగే కాలానికి సంకెళ్ళేసేదెవరు ?
నీ కల, నిజమవుతుందో ,
చెదిరిపోతుందో...
నిలుచుని చూడక తప్పదుగా !

నడుస్తున్న కాలాన్ని తరిమేదెవరు ?
కన్నీరిచ్చినా ,
కలతని తెచ్చినా ..
వద్దుపొమ్మని నెట్టలేవుగా !

కరిగిపోతున్న నిమిషాల్ని ఆపాలని చూడకు ,
దరిచేరే క్షణాల్ని నాకువద్దని అనకు ...

ఆగమంటే ఆగవుగా ,
విశ్రాంతి లేని ఈ క్షణాలు...
ఆఖరికి ఏమవుతుందో చూపి ,
కొత్త మొదలునిస్తాయి ఈ వసంతాలు !

-Mani Potter

 #YQbaba#yqkavi#telugu
1b83869052fecd1fcd8d4da8061e8764

Maneesha Basaiahgari

ఎందుకనిపిస్తోందో,
నువ్వు నా కోసమే నవ్వినట్టుగా ...
ఎందుకు కనిపిస్తోందో ,
నీ మోము నాకు ఇంత ముద్దుగా !

ఎప్పటినుండో తెలిసినా ,
ఓ కొత్త వ్యక్తిని కలిసినట్టుగా ...
ఇన్నాళ్ళూ లేనిదేదో ,
మన మధ్య ఇప్పుడే విరిసినట్టుగా ! #YQbaba#yqkavi#telugu
1b83869052fecd1fcd8d4da8061e8764

Maneesha Basaiahgari

తప్పు నాదేగా ..
శిక్ష నాకేగా..
నాది కాని దాన్ని , కోరుకుంది నేనేగా..

నరకమిదేగా ..
నీకు దూరంగా..
ఎంత ఏడ్చినా, నువ్వు నా సొంతం కావుగా !


-Mani Potter




 #YQbaba#yqkavi#telugu#loss#love
1b83869052fecd1fcd8d4da8061e8764

Maneesha Basaiahgari

కథ నీదేగా..
కల నీదేగా ..
ఏ దారి నీదారో, తెలిసేది నీకేగా ?

దరి చేరదుగా ..
దయ చూపదుగా ..
కూర్చుని కావాలంటే, ఎప్పటికీ నీదవ్వదుగా ! #YQbaba#yqkavi#goals
1b83869052fecd1fcd8d4da8061e8764

Maneesha Basaiahgari

కొన్ని రాత్రుల్లో ఎందుకు,
వదలనే వదలవు ..
వద్దని వదిలేసి పోయిన నువ్వు ?

కంట నీరు ఎందుకు 
ఆగనే ఆగవు ?
అవి తుడవడానికయినా ,
నువు ఎదురుపడవు !

'మనం' ఉన్నన్నాళ్ళూ ,
బ్రతుకు బరువు‌ తెలుయలేదే ...
నేను మాత్రమే మిగిలాక ,
గుండె బరువుతో కృంగుతోందే !

ఆగమన్నా వీడిపోయిన నువ్వు ,
నా ఆలోచనల్లో ఎందుకు మిగిలావు ?

కనిపించకుండా దాగిపోయిన నువ్వు ,
నా కనుపాపల్లో ఎందుకు ఇంకా మెదులుతున్నావు?
-Mani Potter


     #YQbaba#yqkavi#telugu#loss#love
loader
Home
Explore
Events
Notification
Profile