Nojoto: Largest Storytelling Platform
venkateshvenkat4378
  • 8Stories
  • 39Followers
  • 32Love
    0Views

Venkatesh Venkat

ధనాత్మక పంథా జీవితానికై ప్రత్యేక శైలిలో, ప్రయత్నాన్ని కొనసాగించు శైలిలో రచనలు చేయడం

  • Popular
  • Latest
  • Video
433ec37ebf6b6bc3ddab23b40eb32817

Venkatesh Venkat

 Way to positive life venkatesh Dupati....

Way to positive life venkatesh Dupati.... #nojotophoto

5 Love

433ec37ebf6b6bc3ddab23b40eb32817

Venkatesh Venkat

ఒంటరిగా ఉన్నప్పుడు నేను మీలాగే ఆకాశం వైపు చూసేవాడిని.. గమనించడంలో ఎలాంటి పక్షపాతం కనపరచని నాకు ఒకనాటి దివిలో కారు చీకట్లు కనిపించావు.. మరోనాటి సంధ్యాసమయంలో నీలాకాశం నిర్మలంగా దర్శనమిచ్చింది...మరో ఉదయం మొదలయ్యేటప్పటికీ ఆకసంలో ఆకస్మికంగా ఉరుములు, మెరుపులు ఊపిరిపోసుకున్నాయి... దినంలో ఓ వేళ వినీలాకాశం వాకిలికి వర్షం కల్లాపి చల్లి వెళ్లింది.ముత్యాల ముగ్గులాఆ హరివిల్లు వాన వెలిసిన వాకిలికి రంగవల్లిలా దిద్దబడింది.. తనకే కాదు తనలాంటి మనకు ఆకాశంలాగే అప్పుడప్పుడు అతిథిలు వస్తారు. ఆహ్వానాలు కూడా వస్తాయి. అన్నింటికీ బాధపడకు.. హరివిల్లులాగే ఎప్పుడూ ఆనందం ఉండాలనుకోకు నీలాకాశంలాగే ప్రతీ భావాన్ని అవసరమైన చోట ఆపాదించు.. అనవసరమైనవి అనుకుంటే అక్కడే తొలగించు.. మిత్రమా జీవితం హరివిల్లులో వర్ణాల మాదిరిగా అన్ని భావాలు కలిగి ఉంటదని గుర్తించు way to positive life venkatesh Dupati కవి, రచయిత వెంకటేష్ దూపాటి.. Way to positive life...

కవి, రచయిత వెంకటేష్ దూపాటి.. Way to positive life...

1 Love

433ec37ebf6b6bc3ddab23b40eb32817

Venkatesh Venkat

నువ్వు చీకట్లో ఉన్న వేళ, చీకటి మాత్రమే శ్వాసించెడి అచ్చోట నీ కోసం వెలుగుని త్యాగం చేసి చీకట్లో భయపడకు మిత్రమా!!.. నేనున్నా నీకోసం అంటూ వినపడే ఏకైక పిలుపే స్నేహమంటే.. నువ్వు వెలుగులోకి వచ్చాక ఆ మిత్రుడుని మరిచిపోతావో చూడు అదే నమ్మక ద్రోహమంటే.. మిత్రుడుగా నువ్వు విఫలమైన చోట వెలుగులో ఉన్నా కూడా అది చీకటితో సమానం మిత్రమా!!.. వెంకటేష్ దూపాటి... Way to positive life Way to positive life

Way to positive life

1 Love

433ec37ebf6b6bc3ddab23b40eb32817

Venkatesh Venkat

విశాలమైన వినీలాకాశంలో ఓ మార్పు హఠాత్తుగా ఓ మార్పు సంభవించింది మిత్రులారా! అప్పటి వరకు నీలి ఛాయలో దృశ్యమైన మేఘాలకు కారు చీకట్లతో నలుపు రంగు పులుముకున్నాయి.చుట్టూరా చీకటి ఆవహించిన ప్రపంచం భయపడలేదు మిత్రులారా!!.. ఎందుకంటే దాని పర్యావసానంగా వచ్చే వర్షం పచ్చని పంటపొలాలకు ఊపిరిపోస్తుంది, ప్రపంచ అనుగమానికి ఊతమిస్తుందని ముందే తెలుసు కాబట్టి.. ఇక్కడ ప్రపంచం మరిచిన సంగతి ఒకటుంది.. మిత్రులారా మన జీవితాలలో కూడా ఇదే మాదిరిగా ఎదురయ్యే చీకట్లు రేపటి పురోగతికి సంకేతాలు స్వల్పకాలిక చీకట్లకు సవాళ్లలనే ఉరుములకు అవరోధాలు? ఆటంకాలకే మెరుపులకు భీతిల్లకు మిత్రమా!!.. అవి వచ్చెళ్లె దారులే నీ గమ్యాన్ని చేరడానికి నిచ్చెన లని గుర్తించుమా!!.. Way to positive life venkatesh Dupati Way to positive life... (+VE) NKATESH DUPATI...

Way to positive life... (+VE) NKATESH DUPATI...

7 Love

433ec37ebf6b6bc3ddab23b40eb32817

Venkatesh Venkat

ప్రతీ దానికి ఈ ప్రపంచం యొక్క భావాలు పరిగణలోకి తీసుకుంటే నువ్వు ఇంచు కూడా ముందుకు వెళ్లలేవు మిత్రమా!!.. అన్ని రకాల కలగూరలు ఉన్న విస్తారాకులో లేని వాటి కోసం మాత్రమే ఈ ప్రపంచం ఆలోచన చేస్తది..ఏదో ఓ వెలితిని వ్యక్తపరుస్తది.. "ఎన్నో మేలిమి గుణగణాలు కలిగిన నీలో కూడా విస్తరాకు మాదిరిగానే లేని వాటిని ఎత్తి చూపుతోంది మిత్రమా!!.. ఈ ప్రపంచం ప్రతీ చోటా  వ్యక్తపరిచే భావాలకై, పలువురి మెప్పుకై నువ్వు ఆవేశపడి పరిగెత్తావో ఆయాసమే కలుగుతుంది..గుర్తుపెట్టుకో ప్రతీ ఒక్కరినీ అనుసరిస్తూ నడవాలని ఎప్పుడూ తలంచకు నువ్వెళ్లే దారిలోనే అవసరమైన చోట సంస్కరిస్తూ వెళ్లు.. "మన ఆలోచనలలో కొన్ని సార్లు లోపాలు ఉంటాయోమో గానీ.. లోపాలు మాత్రమే ఉండవు.. Way to positive life.. Venkatesh Dupati... Way to positive life....

Way to positive life....

5 Love

433ec37ebf6b6bc3ddab23b40eb32817

Venkatesh Venkat

ప్రపంచం తన కన్నా కింద ఉన్న వాళ్లనీ ఇంకా కిందకు తొక్కాలనీ చూస్తదీ..తన కన్నా పైనున్నోళ్లనీ ఎప్పుడు కింద పడతారా అని అవకాశం కోసం ఎదురుచూస్తుంది మిత్రమా!! నువ్వు ఎక్కడ ఉన్నా నీ పై ఆధిపత్యం ఈ ప్రపంచానిదే.. ప్రపంచం గీసిన గీతనే పట్టుకొని ఉంటే అమెరికాకు సముద్రమార్గాన్ని అన్వేషించిన కొలంబస్,క్రీ. శ 1498 లో భారత సముద్ర సరిహద్దుని చేరిన వాస్కోడిగామాల పేర్లు చరిత్రలో ప్రస్తావనకు వచ్చేవి కావేమో మిత్రమా!!.. అవనిని చుట్టాం కదా సంతృప్తితో పయనం ఆపేస్తే ఆ అంతరిక్షం ఊహలాగే మిగిలిపోయేదేమో మిత్రమా!!.. గుర్తుపెట్టుకో మిత్రమా!!..ప్రపంచంలో కలిసిపోయేలా ఎప్పుడూ ఆలోచించకు.. అలసిపోయేలా ఆలోచించు ప్రపంచం అందని తీరాలను సాధించేలా ఆలోచించు... మిత్రమా.. ఇది way to positive life ism.. Way to positive life venkatesh Dupati...

Way to positive life venkatesh Dupati...

5 Love

433ec37ebf6b6bc3ddab23b40eb32817

Venkatesh Venkat

అక్షరం అంటే వుత్పత్తార్థం.. క్షరం లేనిది అనగా నాశనం లేనిది అని అర్థం.. అక్షరం ఓ పుస్తకంలో బంధించబడి ఉన్నా.. దాని లక్షణం మాత్రం  అజ్ఞానమనే  చీకటి నుంచి ఈ ప్రపంచానికి స్వేచ్ఛా వెలుగులను ప్రసాదిస్తుంది.. మిత్రులారా!!..అక్షరజ్ఞానం మానవుడిని మహనీయునిగా రూపుదిద్దుతుంథి.. నిశాచర ఈ జగతికి శాసనకర్త.. వెలుగుల ప్రథాత ఓ అక్షరం... అక్షరమేలే ఈ జగత్.. అక్షరమే ఏలే ఈ జగత్  మిత్రులందరికీ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ శుభాకాంక్షలు..way to positive life venkatesh Dupati...సమాజానికి తిరుగుబాట అక్షరమే ఇస్తుంది.. తిరుగుబాటు కూడా అక్షరమే నేర్పుతుంది.. జీవతమనే సాయుధ పోరులో అక్షరమే మన  ఆయుధం.. మిత్రులారా..... అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ శుభాకాంక్షలు way to positive life... Venkatesh Dupati....

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ శుభాకాంక్షలు way to positive life... Venkatesh Dupati....

4 Love

433ec37ebf6b6bc3ddab23b40eb32817

Venkatesh Venkat

ప్రపంచం ప్రతీ చోటా నీ ముందు వంద ప్రశ్నలనే ఉంచుతది మిత్రమా!!.. ప్రతీ చోటా ఆగి మాటలతో సమాధానం చెప్పేవారిని వాదించేవారిగా ముద్రిస్తది.. ప్రపంచం విసిరే ప్రతీ ప్రశ్నను సవాళుగా తీసుకునే మౌనంతో ముందుకు అడుగేసేవారిని సాధించేవారిగా ధృవీకరిస్తది.. మౌనం అంటే రెండు పెదాలను కలిపి ఉంచే స్థితి మాత్రమే కాదు మిత్రమా!!.. నీ లక్ష్యానికి నీకు మధ్య దూరాన్ని తగ్గించే ఓ సోపతీ.. వెంకటేష్ దూపాటి way to positive life... ఆత్మవిశ్వాసం తో మన పయనం.. కవి:వెంకటేష్ దూపాటి...

ఆత్మవిశ్వాసం తో మన పయనం.. కవి:వెంకటేష్ దూపాటి... #Quote

4 Love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile