Nojoto: Largest Storytelling Platform
nojotouser3013612886
  • 1.4KStories
  • 0Followers
  • 0Love
    0Views

అజ్ఞాతవాసి

  • Popular
  • Latest
  • Video
6a774e1c962ad92eb12b02e189b81cf8

అజ్ఞాతవాసి

చిన్న చిన్న మాటలు 
పెద్ద పెద్ద గొడవలు 
వ్యక్తుల మధ్య మాట పట్టింపులు 
కుటుంబాల మధ్య మనస్పర్ధలు  
బంధాలు తెంచుకోవడాలు 
బంధుత్వాలు వదులుకోవడాలు 
ఓకే కుటుంబమని మరిచిపోవడాలు 
వింతగా ప్రవర్తించడాలు #కుటుంబం #yqkavi #తెలుగుకవి

#కుటుంబం #yqkavi #తెలుగుకవి

6a774e1c962ad92eb12b02e189b81cf8

అజ్ఞాతవాసి

మోయలేనన్ని బరువులు 
వదలలేని బాధ్యతలు
తక్కువగా వచ్చే జీతాలు
ఎక్కువగా ఉండే అవసరాలు 
అదుపులో లేని ఖర్చులు 
ఆకాశాన్ని అంటే ధరలు 
నెల ఆఖరులో చేసే అప్పులు 
వాటిని తీర్చలేక తిప్పలు 
ఇవే మధ్య తరగతి జీవితాలు  #మధ్యతరగతి #జీవితాలు #yqkavi #తెలుగుకవి

#మధ్యతరగతి #జీవితాలు #yqkavi #తెలుగుకవి

6a774e1c962ad92eb12b02e189b81cf8

అజ్ఞాతవాసి

జీవితంలో 
నచ్చింది దొరకదు 
మెచ్చింది అందదు 
వచ్చింది నచ్చదు 
అదిరింది నిలవదు  #జీవితం #yqkavi #తెలుగుకవి

#జీవితం #yqkavi #తెలుగుకవి

6a774e1c962ad92eb12b02e189b81cf8

అజ్ఞాతవాసి

ఓహో కాలమా 
కన్నీటి పర్వమా 
ఓటముల రూపమా
బాధించే సమయమా  #కాలం #yqkavi #తెలుగుకవి

#కాలం #yqkavi #తెలుగుకవి

6a774e1c962ad92eb12b02e189b81cf8

అజ్ఞాతవాసి

యోగి వేమనే అలుసైపోయాడు 
నాయకుడు కంటే తక్కువ అయిపోయాడు 
ప్రజా కవి కాస్త పక్కకెళ్ళిపోయాడు 
ఆ స్థానంలోకి నాయకుడు వచ్చి పడ్డాడు 
విగ్రహాల రాజకీయాలలో వేమన కూడా చిక్కిపోయాడు  
వేమన శతకాల కంటే నాయకుడే గొప్పవాడయ్యాడు  #వేమన #తెలుగుకవి #రాజకీయం  #yqkavi

#వేమన #తెలుగుకవి #రాజకీయం #yqkavi

6a774e1c962ad92eb12b02e189b81cf8

అజ్ఞాతవాసి

మరొకసారి బాధను చూపించారు 
ఓటమిని దేశానికి అందించారు 
మ్యాచ్ ను మరువటానికి లేకుండా చేశారు 
పోరాడకుండా చేతులెత్తేశారు 
తెల్లోడికి విజయాన్ని వదిలేశారు 
మమ్మల్ని దుఃఖంలో ముంచేశారు  #cricket #yqkavi #తెలుగుకవి

#Cricket #yqkavi #తెలుగుకవి

6a774e1c962ad92eb12b02e189b81cf8

అజ్ఞాతవాసి

ఆనందానికి కూడా అడ్డంకులు  
చిన్నవాటికి కూడా పెద్ద ఆలోచనలు 
చిరుప్రాయలు పై చిదరింపులు 
చేసిన ప్రయత్నానికి నిందలు 
నవ్వడానికి ఆపసోపాలు 
తిడుతూ అందిస్తున్నారు దీవెనలు  #ఆనందం #yqkavi #తెలుగుకవి

#ఆనందం #yqkavi #తెలుగుకవి

6a774e1c962ad92eb12b02e189b81cf8

అజ్ఞాతవాసి

ఓ వేశ్య గాధ 
ఆకలి బాధ రప్పించింది 
అనుకోకుండా ఈ ఊబిలోన ముంచింది 
ఒళ్ళు అమ్ముకునేలా చేసింది 
ఇదే బ్రతుకుతెరువుగా మార్చింది 
ముసలి ముద్ద వస్తుంటుంది
కుర్రకుంక తిరుగుతుంటుంది 
పడతి అన్నది మరిచిపోతుంది 
వేశ్య అంటే బొమ్మ అయిపోతుంది 
నచ్చినట్టుగా ఆడుతుంటుంది 
విటుడు మెచ్చినట్టుగా చేస్తూ ఉంటుంది 
బాధను అనిచిపెట్టుకుంటుంది  
పడక సుఖాన్ని అందిస్తుంది 
మనసు చంపుకుంటుంది 
విటుడి చేతిలో నలిగిపోతుంది 
క్రూర మృగానికి సాధు జీవిలా దొరికిపోతుంది 
మృగం చేతిలో మరణపు అంచులు చూస్తుంది  #వేశ్య #వేశ్యామనసులోమాట #yqkavi #తెలుగుకవి

#వేశ్య #వేశ్యామనసులోమాట #yqkavi #తెలుగుకవి

6a774e1c962ad92eb12b02e189b81cf8

అజ్ఞాతవాసి

ఎందుకో చులకన 
నిజాలు మాట్లాడిన 
న్యాయం వైపు నిలబడిన 
అన్యాయానికి ఎదురు తిరిగిన 
అధర్మాన్ని ప్రశ్నించిన 
నిజాయితీగా బ్రతికిన 
నలుగురికి మంచి చేసిన 
నవ్వుతూ పలకరించిన  #చులకన #yqkavi #తెలుగుకవి

#చులకన #yqkavi #తెలుగుకవి

6a774e1c962ad92eb12b02e189b81cf8

అజ్ఞాతవాసి

మర బొమ్మలులా మారిపోయాము 
మనసునేమో చంపుకున్నాము 
మానవత్వాన్ని మరిచిపోయాము 
బంధాలను విస్మరించాము 
బంధుత్వాలను తెంచుకున్నాము 
మనం నుండి నేను దాకా వచ్చాము 
ఒంటరిగా మిగిలిపోతున్నాము 
చివరికి కుమిలిపోతు మూలన చేరుతున్నాము 
వృద్ధాశ్రమంలో చివరి రోజులు గడుపుతున్నాము  #వృద్ధాప్యం #yqkavi #తెలుగుకవి

#వృద్ధాప్యం #yqkavi #తెలుగుకవి

loader
Home
Explore
Events
Notification
Profile