Nojoto: Largest Storytelling Platform
kk5496787571116
  • 21Stories
  • 13Followers
  • 229Love
    0Views

Kk

  • Popular
  • Latest
  • Video
be807418e4dae9aa85dbd77cce0a524c

Kk

White గెలుపు! ఓటమి! ఏది గొప్పా?

గెలుపు , ఓటమి లు రెండు మనకు రెండు కళ్ళు లాంటివి.మనిషి జీవితంలో గెలుపు ,ఓటములు రెండు ఉంటాయి. అవే మనిషి ఎదగడానికి కారణం అవుతాయి. జీవితంలో ఏది సాధించాలి అన్నా ముందు ఓపికగా ఉండటం చాలా అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. ” ఓటమి ” నీ రాత కాదు ,” గెలుపు ” ఇంకొకరి సొత్తు కాదు. గెలకవకపోవడం ఓటమి కాదు మళ్లీ ప్రయత్నించక పోవడమే ఓటమి .

గెలుపు ” సాధించినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము… గెలుపు అంటే వినడానికి, చూడటానికి , గెలిచినప్పుడు ఆనందించడానికి మాత్రమే బావుంటుంది. గెలిచే వారి ఆలోచన ఎప్పుడు గెలుపు పై నే ఉంటుంది. గెలిస్తే పొగరు నెత్తికెక్కుతుంది. గెలుపు కు బలుపెక్కువ. అణిగి మణిగి అస్సలు ఉండలేదు. గెలిచిన దగ్గర నుంచి ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతునే ఉంటుంది.

గెలిస్తే గెలుపునొకటే చూస్తావ్… ఓడితే ఎందుకు ఒడిపోయావో, ఏం చేస్తే గెలుస్తావో రెండు చూస్తావ్..!! కాబట్టి గెలుచానని ఆరాట పడకు …ఓడానని నిరాశపడకు.గెలుపు కన్నా ఓటమి తో నే ఎక్కువ స్నేహం చేయండి. ఎందుకంటే ఓటమి మనల్ని మార్చి గెలుపు దగ్గరికి పంపిస్తుంది.🍁

©Kk #Thinking  inspirational quotes

#Thinking inspirational quotes

be807418e4dae9aa85dbd77cce0a524c

Kk

White 

*• మార్కండేయుని వృత్తాంతము •*

*వశిష్టుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కావిశ్వనాధుని దర్శనము, విస్వనాధుని వరంవలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి "మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్దగా ఆలకింపుమని యీ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడచుచున్నకొలది తల్లిదండ్రులకు దిగులు యెక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటిని పూర్తి చేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములో సకలశాశ్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పథించి గుణవంతుడని ప్రశంసలనందెను.* 

*అయిననూ మరుద్వతీ మృకండులు నిత్యమును మార్కండాఎయునకు "కుమారా! నీవు పసితనమునందే సకలశాస్త్రములు అభ్యసించి నీ బుద్దికుశలతచే అందరిమన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయెడ,పెద్దలయెడ, బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును గాన, నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధీగును" అని చెప్పుచుండెడివారు. అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండౄల ఆందోళన, భయము ఎక్కువగానున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి, మహాఋషులందరుకును ఆహ్వానము పంపినారు, మునీశ్వరులు, గురువర్యులు మొదలగువారందరు మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిధిసత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరుకూ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, ఆయన మార్కండేయుని వారించినారు, అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావా! మీరిట్ళు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను.అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవుకమ్ము అని దీవించితిరి గదా! అదెటుల అగును. ఇతని ఆయుర్దాయము పదహారెండ్లే గదా? ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుదిచ్చిన వరము ప్రకారము యీతడు ఇంకోక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పెను.*

*అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. 'చిరంజీవివై వర్ధిల్లు' మని దీవించినందున వారి వాక్కులసత్యములగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా? యని వశిష్టుల వారినే ప్రశ్నించిరి, వశిష్టులు కొంతసేపాలోచించి "మునిసత్తములారా! మనమందరమునూ ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదమురండు" అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొనిపోయిరి. మునీశ్వరుల యాగమునకు బ్రహ్మ్హ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ 'చిరంజీవిగా జీవించు నాయనా' అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరబాటునకు విచారము వెల్లబుచ్చి కొతతడవాగి "భయపడకు"మని మార్కండేయుని దగ్గరకు చేరదీసి "పరమేశ్వరుడు యీ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయునుగాక" యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునుల వంక చూచి "ఓ మునులారా! మీరు పోయిరండు ఇతనికి యే ప్రమాదమునూ జరుగనేరదు" అని పలికి వత్సా మర్కండేయా! నీవు కాశీ క్షేత్రమునకు పోయి, విశ్వనాధుని సదా సేవించుచుండుము. నీకే ప్రమాదమూ కలుగదని ధైర్యము చెప్పి పంపి వేసెను.*

*మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, 'కాశీనాధుని సేవించి వచ్చెదను అనుజ్ఞ ' నిమ్మని కోరగా మృకండుడు నాతని భార్యయు కొడుకు యొక్క యెడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండుడు కుటుంబ సహితముగా కాశీకి పోయి .విశ్వేస్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనేయుండసాగెను.*

*క్రమముగా నాతడు పదహారవయేట ప్రవేశించెను. మరణ సమయ మాసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుదున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి, ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహాతేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణములవలె బాధించెను. ఆ బాధ కోర్వలేక భటులుపోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడతని ప్రాణములను తీసుకొనిపోవసిద్దముగా నుండగా, నాతడు భయపడి, శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి, మార్కండేయుని రక్షించెను.*

*యముడు చనిపోవుటచే అష్టదిక్పాలురు బ్రహ్మాదిదేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించిరి, కోపముచల్లార్చుకో మహేశా! యముడు తన కర్తవ్యమును నెర వేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరిగదా!అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందుకు మేమెంతయో ఆనందిచుచున్నాము. కాని, ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటుకదా గాన, మరల యముని బ్రతికించుడని వేడుకొనిరి. అంతట నీశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తులదరికి రావలదు సుమా! అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను.* *పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి, తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి యీ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను.*
*సమాప్తం.*

*మాఘమాస ఫలశ్రుతి గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లనెను. జహ్నుమునీ!ధర్మప్రభోధకములగు మాసములలో మాఘమాసముత్తమోత్తమము. యజ్ఞము మొదలైన పుణ్యకామ్యకర్మలనన్నిటిని చేయుటవలన వచ్చునంతటి పుణ్యము. మాఘమాస వ్రతము నొకదానిని చేసినంతనే వచ్చును. మాఘమాసవ్రతము సర్వపుణ్యక్రియ సారము. శివకేశవులిద్దరికిని ప్రీతిపాత్రమైనది. సూర్యుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతల దయను గూడ కలిగించును. సర్వసుఖముల నిచ్చును. ఈ మాఘమాస వ్రతమును గూర్చి నేను చూచినదానిని, విన్నదానిని, తెలిసినదానిని నీకు అడుగగనే చెప్పితిని. మానవుడు అన్ని ధర్మములను ఆచరింపలేకపోయినను, మాధవ ప్రీతికరమైన మాఘ్మాసవ్రతమును విడువక ఆచరించినచో సర్వ ధర్మములనాచరించుటవలన వచ్చుఫలితమునందును. ఈ పురాణమును శ్రీహరిసన్నిధిలో చెప్పువాడును, భక్తితో వినివారును యిహపరములయందు సర్వసుఖములను పొంది తుదకు శ్రీహరిసాన్నిధ్యమును చేరును. సూతుడు శౌనకాది మహామునులతో నిట్లనెను. మాఘమాసవ్రతము సర్వ పుణ్యముల నిచ్చును. సర్వైశ్వర్యముల నిచ్చును. అన్ని రొగములను పొగొట్టి ఆయుర్దాయమును పెంచును. విష్ణు సాన్నిధ్యమును కలిగించును. ముక్తిని కొరినవారికి ముక్తినిచ్చును, కోరిన కోరికలనిచ్చును. వినయవిధేయతలు కల శిష్యునకును, శ్రద్దకల వానికిని, మంచి నడవడిక కలవానికి, ఆత్మజ్ఞానికి యీ వ్రతమును చేయుడని చెప్పవలెను.*

*శౌనకాది మహామునులకు రోమమహర్షి పుత్రుడు నైమిశారణ్యమున మాఘమాసవ్రత మహిమను వివరించుచు ఈ కథలను చెప్పెను. అతడు చెప్పినవానిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి, కొన్ని దిలీపమహారాజునకు వశిష్ఠ మహర్షి చెప్పినవి, మరికొన్ని గృత్నృమదుడను మహర్షి జహ్నుమునికి చెప్పినవి. మొత్తం మీద  యీ కథలనిటిని కలిసి సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పినవి. సూతుడు అనేక పురాణ కథలనెరిగినవాడగుటచే ఆయా సందర్భములో ఆయావ్యక్తులు ఆయా వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పెనని గ్రహింపవలెను.*

©Kk #Thinking history
be807418e4dae9aa85dbd77cce0a524c

Kk

White కోపం వస్తుందా!

"కారణం లేకుండా ఎవరికీ కోపం రాదు. అయితే ఎప్పుడో గాని కోపానికి సరైన కారణం ఉండదు" అన్నాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్, 'సరైన కారణం అనేదే కీలకం. కాబట్టి కోపం ముంచుకొచ్చినప్పుకల్లా ఒక్కక్షణం ఆగి, మన కోపానికి తగిన కారణం ఉందో లేదో చూసుకుంటే చాలు. 

అది కేవలం ఉద్వేగానికి చెందిందా, ధర్మానికి చెందిందా అనేది మనకే తెలిసిపోతుంది. దాన్నిబట్టి ఆగ్రహించాలో. - నిగ్రహించాలో తేల్చుకోవచ్చు.

కోపం, దుఃఖలు, భయం, వంటి అరంటిని ప్రాథమిక భావోద్వేగాలుగా చెబుతుంది మనస్తత్వ శాస్త్రం. వాటికి తక్షణమే స్పందించేది మెదడులోని 'లింబిక్ లోబ్'. అప్పుడు 'ఎడ్రినలిన్'' అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది మనిషిని అసంకల్పిత చర్యలకు ప్రేరేపిస్తుంది. 

ఆ మధ్య ఒక బాలిక తన తల్లిపైకి దూసుకొచ్చిన ఆటోను అమాంతం ఎత్తేసి అమ్మను రక్షించుకొన్ని సంఘటనను సామాజిక మాధ్యమాల్లో చూశాం. అంటే భయమనే భావోద్వేగాన్ని అంతర్గత శక్తిగా ఆవిష్కరించిందామె. నేనెత్తగలనా అన్న ఆలోచనే లేకుండా అంత బరువునూ ఎత్తిపడేసింది. అలా. మనిషిలో కోపాన్నీ ఆయుధంగా, శక్తిగా మార్చుకోవడం సాధ్యమే అంటారు మనస్తత్య నిపుణులు.

అలా కోపాన్ని నిగ్రహించుకోవడంగాని. ఒక ఆయుధంగా మార్చుకోవడం గాని ఎప్పుడు సాధ్యమవుతున్దంటే భావోద్వేగ సంయమనాన్ని (ఎమోషనల్ బ్యారెన్సింగ్) సాధన చేసిన ప్పుడు దానికి మనిషిలోని వివేకం ఆధారం. 

నిగ్రహానికి పునాది భావోద్వేగ వివేకం(ఎమోషనల్ ఇంటెలిజెన్స్). కోపాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించడం కోసం పనిగట్టుకొని దాన్ని పిలవడమే ఫ్రాంక్లిన్ చెప్పిన 'సరైన కారణం.. భయంలో, దుఖంలో, కోపంలో మునిగిపోయినప్పుడు మనిషి దేహంలో వణుకు రావడానికి కారణమయ్యేది ఈ ఎడ్రినలినే, ధర్మాగ్రహం విషయంలో శక్తిగా మారుతుందని అర్ధం. 

🌿కోపం దానినంతట తానే వచ్చినప్పుడు, అదే మనిషిని శాసిస్తుంది. ప్రతీకారానికి ప్రేరేపిస్తుంది. కానీ, కోపాన్ని మనం పిలిచినప్పుడు. అదే ఎడ్రినలిన్ మన చేతిలో ఆయుదం అవుతుంది. కోపం రావడమా, తెచ్చుకోవడమా ఏది మేలంటారు?.🍁

©Kk #Thinking  motivational thoughts on life

#Thinking motivational thoughts on life #Motivational

be807418e4dae9aa85dbd77cce0a524c

Kk

White 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

భరతమాత ద్రాస్య శృంఖలాలను తెంచటనికి, 

భరతమాత బిడ్డలకు స్వేచ్చా వాయువులు అందించడం కోసం శాస్వితంగా తన శ్వాసను విడిచిన వీరుడు పోరాట యోధుడు, 
 గుండెల్లో అనుక్షణం గుబులు పుట్టించి కంటి మీద కునుకు లేకుండా చేసి ఆంగ్లేయుల తుపాకీ గుండు కూడా ఆయన గుండెల మీదకు రావడానికి బయపడేటి వ్యక్తి శ్రీ చంద్ర శేఖర్ ఆజాద్ వీర స్వర్గాన్ని పొందిన రోజున.....

ఇవే మా నివాళి....ఆనాడు ఒక్క బ్రిటిష్ కుక్క కూడా ని ఎదుట నిలబడేందుకు, నేరుగా నీతో తల్పడేందుకు సాహసం చేయలేదే కానీ ఈ దేశంలో ఉండి నీతో పాటు ఉన్న వ్యక్తుల వల్ల నీ మరణం నిర్ణయం కావడం ఈ దేశ దౌర్భాగ్యం...
 ఆ బ్రిటిష్ కుక్కల చేతిలో చనిపోవడం కంటే నీచం మరీది ఉండదు అని తన తుపాకీ తీసుకొని కనత పై పెట్టుకొని అమ్మ భారత  మత నీకు ఈ మాత్రమే సేవ చేయగలిగే నన్ను క్షమించు అని ఆత్మర్పణం చేసిన వీరుడా జోహార్ జోహార్....

భారత్ మాత కి జై...జై హింద్

©Kk #Thinking Azad
be807418e4dae9aa85dbd77cce0a524c

Kk

White ఒక స్కూల్లో  చిన్న పిల్లవాడు భోజనసమయంలో తన మిత్రులతో పాటు తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు. 

ఆ అబ్బాయి తాను తెచ్చుకున్నఅన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా, పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు. 

అతని స్నేహితుల్లో చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గ తినకుండా, క్రింద పైన వేసుకుంటూ తినేవారు.

మరికొందరైతే గొడవపడుతూ కోపంతో ఆహారాన్ని విసిరిపారేస్తుంటారు.

అది చూసి మిగతా పిల్లలు ఈ అబ్బాయిని ఎగతాళి చేసేవారు. " అరే! వీడొక తిండిపోతు రా! ఒక్కమెతుకు కూడా  వదలకుండా తింటాడు" అని ఎగతాళి చేసినా ఈ అబ్బాయి పట్టించుకునేవాడు కాదు.

 ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజూ గమనిస్తూ,
ఒకరోజు తన  మిత్రున్ని ఇలా అడిగాడు.

మిగతావాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నానీకు బాధ అనిపించదా? "  

దానికి ఈ అబ్బాయి ఇలా సమాధానం
ఇచ్చాడు.

" ఏదో వారికి తెలియకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకేం బాధలేదు.

👉అలా తినడం అన్నది నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు చిహ్నం. 

🌿 అమ్మ ఉదయాన్నే లేచి నాకు ఇష్టమైన పదార్థాలను వండి ప్రేమతో బాక్స్ లో పెట్టి పంపిస్తుంది.

 🌿వండటానికి కావలసిన వస్తువులను నాన్న ఎంతో కష్టపడి సాయంత్రానికి తెస్తాడు. 

👉ఇద్దరి ప్రేమతో పాటు వారి కష్టంకూడా 
నా భోజనంలో ఉంది.

అలాంటప్పుడు నేను ఒక్క మెతుకును వృధా చేసినా వారికి అగౌరవ పరచినట్లే!

👉అంతేకాదు ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు.అతన్ని కూడా నేను అవమానపరిచినట్లే కదా! 

🌿అందుకే నేను ఎవరు నవ్వుకున్నా ఒక్క మెతుకును కూడా వృధా చేయను .

అంతేకాదు ఎంతోమందికి రెండుపూటలా కడుపునిండా అన్నం దొరకడం లేదు. నాకు దొరికింది. నా తల్లిదండ్రుల పుణ్యమా అని. 

అమ్మ ఎప్పుడూ చెపుతుంది. 
ఆహారాన్ని వృధా చేయకూడదని "

అని చాలా చక్కగా చెప్పాడు.

🌿నేర్చుకోవాలని మనసు ఉంటే చాలు 
చిన్న పిల్లల నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు.

ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచరించవలసిన అవసరం 
ఎంతైనా ఉంది కదా! 

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటివి చెప్పి
వారిలో ఆలోచనా శక్తిని పెంచవలసిన అవసరం 
ఎంతైనా ఉంది.🍁

©Kk #Sad_Status  motivational thoughts in Telugu

#Sad_Status motivational thoughts in Telugu #Motivational

be807418e4dae9aa85dbd77cce0a524c

Kk

White *మహా శివరాత్రి శుభాకాంక్షలు*
"శివరాత్రి"లో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి.
ఒకటి: "ఉపవాసం"
రెండు: "జాగరణ"
"ఉపవాసం" అంటే .. "మానసిక పరమైన లంఖణం"
"ఉపవాసం" అంటే .. "ధ్యానంలో మనస్సును శూన్యపరచుకోవడం"
"ఉపవాసం" అంటే కడుపుకు ఏమీ పెట్టకపోవడం కాదు
"జాగరణ" అంటే .. "దివ్యచక్షువు యొక్క జాగరణ"
"జాగరణ" అంటే .. "ఆత్మ యొక్క జాగరణ"
"జాగరణ" అంటే .. రాత్రంతా మేల్కొని "శివుడి సినిమాలు" చూడడం కాదు
ప్రొద్దుటినుంచీ "ఉపవాసం" ఉంటేనే .. రాత్రి "జాగరణ" అయ్యేది
ప్రొద్దుటి నుంచీ ధ్యానాభ్యాసంలో అంటే .. శ్వాసానుసంధానంలో ఉంటేనే
రాత్రికి దివ్యచక్షువు యొక్క ఉద్దీపనం అయ్యేది
"ఉపవాసం" లేకుండా "జాగరణ" అన్నది అసంభవం
"ఉపవాసం" యొక్క ధ్యేయమే .. "జాగరణ"
"జాగరణ"కు కావలసింది ముందుగా "ఉపవాసం"
ఇదీ అసలు కథ.
కడుపులో ఏమీ పెట్టకపోవడం వల్ల మనోనాశనం కాజాలదు
రాత్రి అంతా శివుడి యొక్క సినిమాలు చూడ్డం ఆత్మోద్దీపనం కాజాలదు
ఒక్క పగలైనా నిజమైన "ఉపవాసం"లో ఉండి
ఒక్క రాత్రంతా అయినా "నిజమైన జాగరణ"లో ఉంటే
ఆ ఒక్క రోజు చాలు..
ఆ రోజు "మహాశివరాత్రి" అవుతుంది
.. "జన్మకో శివరాత్రి" అంటారు..
ఒక్క రాత్రి "నిజమైన శివరాత్రి" అయితే .. ఇక జన్మంతా "నిజమైన జాగరణే"
జై గురుదేవ్ 👏👏

©Kk #Thinking  bhakti
be807418e4dae9aa85dbd77cce0a524c

Kk

White 🍁కష్టాలు అంటే Problems అంటే స్కూల్లో  నేర్చుకునే పాఠాల్లాగే  జీవితం అనే పాఠశాలలో కూడా  కూడికలు, తీసివేతలు, గుణింతాలు, భాగహారాలు నేర్చుకోవాలి.

🌿 ఎవరిని కలుపుకోవాలో, 
🌿ఎలాటి పరిస్థితులను తీసివేయాలో,
🌿 దొరికిన అవకాశాలను ఎలా రెట్టించాలో, 🌿ఎదురైన ఇబ్బందులను ఎలా తగ్గించుకోవాలో నేర్చుకోవాలి. 

👉విజ్ఞానం పెంచుకోవాలి. నేర్చుకున్న విజ్ఞానం జీవితంలో వర్తింపచేసు కోవాలి.🍁

©Kk #Thinking  best motivational thoughts

#Thinking best motivational thoughts #Motivational

be807418e4dae9aa85dbd77cce0a524c

Kk

White *🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏*
🚩నమః శుభోదయం 🚩🚩


వైఫల్యాలూ వనరుల్లాంటివి. 
వాటిని సానుకూల దృక్పథంతో జీవన పురోభివృద్ధికి వినియోగించాలి. సమస్యలు ఉత్పన్నం కావడానికి దారితీసిన అంశాలే పరిష్కార మార్గాలకూ కొత్తదారులు చూపుతాయి. అవరోధాలు, అపజయాలు, కష్టాలు మనసుపై కొంత ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా మనిషి ఆరోగ్యాన్ని పాడుచెయ్యజూస్తాయి. 
ఒక్కోసారి అదీ మంచికేనని ఆలోచించే స్థాయికి మనిషి ఎదగాలి. శరీరం వ్యాధిగ్రస్తం అయినప్పుడు *తెల్ల రక్తకణాలు పుట్టుకొచ్చి శత్రుకారకాలతో పోరాడతాయి*. అదే రీతిన మనసు బాగా లేనప్పుడు 'తెలివి' రంగంలోకి దూకి మనిషిని అప్రమత్తం చేస్తుంది. ఇదంతా సహజాతి సహజంగా జరిగే ప్రాకృతిక ప్రామాణిక చర్య. 
ఇవన్నీ తెలియాలంటే మనిషి మనసు స్థిమితంగా ఉంచుకుని | సూక్ష్మస్థాయిలో జరుగుతున్నదాన్ని గమనించడం అలవరచుకోవాలి. 
*ఆధ్యాత్మిక సత్యాలు, వైజ్ఞానిక వాస్తవాలు* కేవలం గమనింపు ద్వారానే బయటపడతాయి.

జై గురుదేవ్...👏👏

©Kk #Thinking  bhakti
be807418e4dae9aa85dbd77cce0a524c

Kk

White *జీవితం అంటే ఏమిటి?* 

*జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మూడు ప్రదేశాలు ఉన్నాయి:*  

*- ఆసుపత్రి*
*- జైలు*  
*- శ్మశానవాటిక*  

*ఆరోగ్యం కంటే మెరుగైనది ఏదీ లేదని ఆసుపత్రిలో మీరు అర్థం చేసుకుంటారు.* 

*స్వేచ్ఛ ఎంత విలువైనదో జైల్లో చూస్తారు. మరియు శ్మశానవాటికలో జీవితం ఏమీ లేదని మీరు గ్రహిస్తారు.*

*నేడు మనం నడిచే భూమి రేపు మనది కాదు అని గ్రహిస్తారు.🍁

©Kk #Thinking  motivational thoughts motivational thoughts on life

#Thinking motivational thoughts motivational thoughts on life #Motivational

be807418e4dae9aa85dbd77cce0a524c

Kk

White ప్రతిరోజు టాటా మోటార్స్ లో పనిచేసే పెద్దపెద్ద అధికారులందరూ కలిసి మధ్యాహ్న సమయంలో భోజనాలు చేస్తూ ఉంటే, కొన్ని రోజులనుండి సుమంత్ మోలగోకర్ అనే ఆయన వీళ్ళతో కలవకుండా తన కారు తీసుకుని బయట భోజనం చేయటానికి వెళ్ళటం చూసి, ఆ అధికారులు అతనిని ” ఈయన డీలర్లు ఎవరో పెద్ద ఖరీదైన హోటళ్ళలొ ఇచ్చే పార్టీలు మరిగాడు" అనే అపవాదు వెయ్యటం సాగించారు.

ఒకరోజు కొందరు అధికారులు ఆయనను రహస్యంగా వెంబడించి అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

👉ఆయన కారుతో వెళ్ళి , రోడ్డు వెంబడి ”ధాబా" దగ్గర కారు ఆపి, అక్కడ భోజనం చేస్తున్నాడు. అలా భోజనం చేస్తూ, టాటా మోటార్సు వారి తయారు చేసే ట్రక్ లు వాడే డ్రైవర్లతో సంభాషణ చేస్తూ, టాటా వాహనాలలోని బాగోగుల గురించి వారితో చర్చిస్తూ, ఆ విషయాలు తన నోట్బుక్ లో వ్రాసుకుంటూ, టాటా వాహనాల ఉత్పత్తి నాణ్యతను పెంచే దిశగా ఎంతో విషయసేకరణ చేశాడు.
అలా ఆ డైవర్లు చెప్పిన విషయాలతో టాటా వాహానాల నాణ్యతను పెంచి, వాటిని ప్రపంచంలోనే ఉన్నతికి తీసుకు వచ్చాడు శ్రీ సుమంత్ మోలగోంకర్.

🌿ఆయన చేసిన సేవకు టాటా మోటార్సు ఆయన పేరున " టాటా సుమో " వాహనానికి ఆయన పేరు పెట్టారు. 

👉సు అంటే సుమంత్, మో అంటె మోలగోంకర్.

☘ప్రపంచంలో ఉద్యోగికి ఒక కంపెనీ ఇచ్చిన అత్యున్నత గౌరవం ఇది.🍁

©Kk #Thinking  motivational thoughts

#Thinking motivational thoughts #Motivational

loader
Home
Explore
Events
Notification
Profile