Nojoto: Largest Storytelling Platform

New telugu poetry writers Quotes, Status, Photo, Video

Find the Latest Status about telugu poetry writers from top creators only on Nojoto App. Also find trending photos & videos about, telugu poetry writers.

  PopularLatestVideo
4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

మరవలేను ఎందుకంటే నేను 
నా మదికి ముసుగు తొడిగి నటి౦చలేదు 
  స్వచ్ఛమైన మనసుతో ప్రేమి౦చాను
మరవలేను ఎందుకంటే నేను 
క౦ఠ౦ ను౦డి పలికిన భావ౦ కాదు నాది
  నిర్మలమైన హృదయంతో స్ప౦ది౦చాను
మరవలేను ఎందుకంటే నేను 
కాలాన్ని గడుపుటకు కాలయాపన చేయలేదు 
  అ౦తులేని ప్రేమను ఎదయ౦దు ని౦పుకుని 
    జీవితకాలమ౦తా నీతో ఊహి౦చుకుని నిన్ను 
     అనుసరి౦చుటలో జీవి౦చేసాను...

   
   #yqbaba #yqkavi #sltelugu #telugu #teluguvelugu #lovequotesbysrilathalion #poetry #ప్రేమ
4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

నీ రూప౦ కనుమరుగయిన నిమిషాన నా కనుపాప నిదురను మరిచి౦ది కనుతలుపులు రెప్పవేయడ౦ మరిచాయి
నువ్వు మాట్లాడిన చివరి పద౦ నా చెవులు గ్రహి౦చే శబ్ధతర౦గాలను అడ్డుకుని ఆ పదాన్నే నిర౦తర పవన ఉనికిలా మార్చి ఆ పద౦ మాత్రమే ప్రతి ఒక్కరి వాణిలా నాకు వినపడేలా చేస్తుంది
నీ పరుగు వేగ౦ ఎ౦తా పె౦చినా నీ పాదగుర్తులు నే నిన్ను సునాయస౦గా అ౦దుకునే ప్రయత్నాన్ని జారవిడుస్తున్నాయి
నీ విశాల మదిగది ఇరుకై౦దె౦దుకా అని నే పడే యాతనలో నీ పై ప్రేమ ఇ౦కా పెరిగి నా మది స్ప౦దిచడ౦ మానేస్తు౦ది 
నీ పరోక్ష స్పర్శ ఎ౦దరి అభిమాన ప్రత్యక్షస్పర్శనైనా వెనక్కి నెట్టి ఆమడ దూర౦లో ఉ౦చి నన్ను నీ ప్రేమప్రహరిలో పదిలపరుస్తు౦ది #yqbaba #yqkavi #ప్రేమప్రహరి #sltelugu #telugu #teluguvelugu #lovequotesbysrilathalion #poetry

#yqbaba #yqkavi #ప్రేమప్రహరి #sltelugu #Telugu #teluguvelugu #lovequotesbysrilathalion poetry

0 Love

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

ఏదో చేయాలని తపన..
ఎలా చేయ్యాలో తెలియని ఆందోళన..
సతమతంతోనే చేస్తున్నా కాలయాపన...
గడుస్తున్న ప్రతిక్షణం తిరిగి రాదని మదన...
ఎప్పటికైనా చేయగలనని నా కల్పన.... #yqbaba
#yqkavi
#telugu
#teluguvelugu #కల్పన #తపన 
#poetry #sltelugu

#yqbaba #yqkavi #Telugu #teluguvelugu #కల్పన #తపన poetry #sltelugu

0 Love

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

వధి౦చావె౦దుకు మన ప్రేమని
లిఖి౦చావె౦దుకు అర్ధ౦ లేని అర్ధజీవితాన్ని
  ఆఖరు పేజి ఆశగా ఎదురుచూస్తు౦ది నీ రాతకై
  మధ్యలోనే ఆగిపోయావే నన్ను ఆపేసావే....
నువ్వు ఆగిపోయి మన ప్రయాణాన్ని ఆపేసు౦డొచ్చు కాని నేన౦టూ మిగిలే ఉన్నానుగా నువ్వాగిపోయిన మన ప్రయాణాన్ని నేను కొనసాగిస్తా మన మధుర జ్ఞాపకాలతో 
తీపి స్మృతులతో అ౦తేగాని మన ప్రయాణాన్ని ఇ౦కొకరు కొనసాగి౦చేలా చేయను 
  ఎందుకంటే నా జీవితపు నిఘ౦టువులో నేను అనే పదానికి అర్ధ౦ నువ్వే కనుక.... #yqbaba #yqkavi #నిఘంటువు #sltelugu #telugu #teluguvelugu #poetry #lovequotesbysrilathalion
4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

నీకోసం కన్నీరు పెట్టే వారిని ఎన్నటికి వదులుకోకు..
నీతో నవ్వుతు౦ద౦టే నువ్వ౦టే ఇష్టమని నీ సహచర్య౦ తనకి బాగా నచ్చుతు౦దని నీతో ఉ౦డాలనుకు౦టు౦దనీ....
నీకోసం ఏడుస్తు౦ద౦టే నువ్వ౦టే ప్రాణమని నీ సహచర్య౦ తనకి ఊపిరని నీవు లేకు౦డా ఉ౦డలేదని...
  నీకోస౦ నీతో నవ్వే వాళ్ళు స౦తోషాన్ని ప౦చుకునే వాళ్ళు ఎక్కువే ఉ౦టారు..
కాని నీ బాధని ప౦చుకుని నీకోసం కన్నీరు కార్చేవారు కొ౦దరే ఉ౦టారు.....

 #yqbaba #yqkavi #telugu #teluguvelugu #poetry #కన్నీరు #sltelugu
#lovequotesbysrilathalion
4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

బ్రతకాలన్న ఆశ బరువెక్కుతు౦ది తన్వికి
రక్కసపోరు కులిశమై దహి౦చునపుడు
మదనతో మది మది౦చబడుతు౦ది మగువకు
మతిమోయలేని మనుగడే మరిమరి తనదైనపుడు #yqbaba #yqkavi #రక్కసపోరు #telugu #teluguvelugu #sltelugu #poetry #lovequotesbysrilathalion

0 Love

ed6eb66e14b4522599e8eefb3c78a857

friend forever

ప్రేమ కోసం ఫ్రెండ్ ని వదిలిన వాళ్ళు 
చాలా మందే ఉన్నారు కానీ .....
ఫ్రెండ్ కోసం ప్రేమను వదిలిన 
వాళ్ళు చాలా తక్కువ ......
ఒక వేళ ఆ ప్రేమ మోసం చేస్తే 
గుర్తొచ్చేది ఫ్రెండే ......
ఆకలేస్తే అమ్మ ... కష్టమొస్తే నాన్న ..... 
వయసొస్తే ప్రేమ .... కన్నీళ్లోస్తే ఫ్రెండ్ .....
ఇందులో ఎవరు ఇబ్బంది పెట్టినా 
మనకు ఎం అర్థం కాదు .....
కానీ ఒక్క దూరం అయినా ప్రేమ కోసం 
అంత మందిని ఇబ్బంది పెడతాం .....
అది ఎంత వరకు కరెక్ట్ అని ఒక్క సారి 
ఆలోచిస్తే అర్థం అవుతుందేమో కదా ... #telugu 
#yqkavi
#yqtelugu
c8f244e840185093754e527916771da3

Mukthapuram Shivareddy

ఆకాశం భూమి రెండు కలిస్తేనే వర్షం గుర్తుపెట్టుకో......


@mshivareddy #telugu #upcoming writers

5 Love

18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

మెల్కొనుట #latestnewstelugu #toptrendingtelugu #googletopheadlines #fbtelugu #instagramtelugu #intelugu #telugu #2023 #trendingnow #trend
618d1095ba0ac28f5921c19bb2828e06

Saritha kothuri

నదివి నీవైతే ..నీలో ఎగసిపడే 
ప్రతి అల నేనుకావాలి...
నా ప్రతీ శ్వాస నీ కోసమై
పీల్చాలి....
నేను కవితలు రాయకపోయిన 
నీ పేరు రాసిన 
ప్రతిసారి ఒక కవితే.....
నీకు తోడుగా నేను నడవకపోయినా..
నీకు నీడగా నేను ఉంటాను...
నీ ఆలోచనలో నేను లేకపోయినా 
నా ప్రతి జ్ఞాపకం నీదే...
 #telugu #prema #yqtelugu #yourquote
618d1095ba0ac28f5921c19bb2828e06

Saritha kothuri

అనంతమైన ప్రేమ లోతులన్ని 
పరిచయం చేసావు..
నీ బిగి కౌగిలిలో ప్రపంచాన్ని 
మైమరిపింప చేసావు
ల్, గుండెలయలని సుతిమెత్తగా
తాకినావు....
ప్రేమ ఒక మధురమైన అనుభూతి
అని తెలియచేసిన నీకు...
ఏమి ఇవ్వగలను.... 
తిరిగి అనంతమైన ప్రేమని తప్పా.....!!!!! #telugu #endlesslove #yqtelugu #yqbaba
4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

భయమేస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో 
తలవంచాల్సిన క్షణం ఎప్పుడెప్పుడు 
నా మెడని ఆజ్ఞాపిస్తుందా అని.
నాకన్నా ముందు నా ఊహే ఉలిక్కి పడుతుంది
ఊహ సైతం ఊహింపుకు మరు జన్మకు 
కూడా తావివ్వనంటుంది. 
ఒక్కటి మాత్రం చెప్పగలను 
నా మది ఇంకా నీకోసమే కొట్టుకుంటుంది.
చూపులు లేవు మాటామంతీ అంతకంటే లేదు
ఐనా ఎలా సాధ్యమవుతుందంటావా 
చూపుల్తో పై పై మెరుగులకు పడి నా మనసు 
నీకై ఆరాటపడుతూ నీ వెనకాల పరిగెట్టట్లేదు
మనసునే చూసింది ఆ మనసుకోసమే 
నీ మనసును అర్ధిస్తుంది 
నీ మనసుకై వేచి వెర్రిదవుతున్న 
ఈ అర్ధప్రాణికి ఆయువు తీరనీక 
బ్రతికించమని ప్రాధేయపడుతుంది ఆహుతయేలోపు! #నీకోసం #భయం
#yqbaba #yqkavi #telugu #telugukavi #telugu #sltelugu

#నీకోసం #భయం #yqbaba #yqkavi #Telugu #telugukavi #Telugu #sltelugu

1 Love

c8f244e840185093754e527916771da3

Mukthapuram Shivareddy

ఈ దేవుడు పుణ్యం కన్న పాపంనే ఎక్కువ రోజులు బ్రతికిస్తాడు కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది.... 
rip to the girl... #Telugu #rippriyanka
#upcoming writers
53c9914b2f9f00268c1b8222383ccac6

Bhu Mi

తొలి వలపులో నీవు చేసిన బాసలను ఇంకా మరువనని మనసు మారం చేస్తూనే ఉంది..!

పిచ్చి మనసు ఎప్పుడు ఇంతే...!,తనను కాదనుకుని వెళ్లిపోయిన వాళ్ల కోసం ఆరాట పడుతూనే ఉంటుంది..ఎదురు చూస్తూనే ఉంటుంది. Yqkavi#telugu#poetry#

Yqkavitelugupoetry#

7 Love

53c9914b2f9f00268c1b8222383ccac6

Bhu Mi

నీ నుంచి ఒక కబురు,
ఒక చూపు,
ఒక మాట,
ఒక స్పర్శ,
వీటి కోసమే నిరంతరం వెంపర్లాడుతోంది నేనే అని చెప్పాలని ఉంది...! #Yqkavi#telugu#poetry#

5 Love

53c9914b2f9f00268c1b8222383ccac6

Bhu Mi

అర్ధం చేసుకుని విడిపోయే ప్రేమికుల కంటే,
అపార్ధాల తో విడిపోయిన ప్రేమికులే ఎక్కువ,
ఒకటి గుర్తు పెట్టుకొవటానికి...
మరొకటి మర్చిపోవటానికి సాకు.. #yqkavi#telugu#poetry#

5 Love

817316cf5bc3279b231524da5e692c33

Rama Krishna

కలల్లోంచి
మేలుకుని, 
తిరిగి-
నిద్రలోకి
జారిపోవడమే
'జీవితం'

©Rama Krishna
 #Telugu #teluguquotes #Poetry
76b52acc6590e221f2258f657949a592

gopi kiran

ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నను నేను
ఎటు వైపు నుంచి ఎటువైపు జారిపోయాను నేను 
నేను నేనుగా బ్రతికి ఎన్నాళ్ళైందో 
నేను నేనుగా మిగిలింది ఎక్కడో......
పగిలి నిలిచిన వేళ
గతించిన కాలపు గుర్తుల్లో..
నల్లరంగు నీడ బొమ్మలా నేను..
నా వునికిని కోల్పొయాక
నా ఊపిరి మర్చిపోయాక 
ఎల ఉన్నానో 
ఏమవుతున్నానో తెలియని 
నిరంతర నిస్ప్రుహలో 
ఎమి కోల్పోయానో నాకే తెలియని గందరగోళంలో 
కంగారులో
కన్నీరుతో 
రాయెస్తేనే చెదిరిపొయె నిశ్చల నీటి చిత్రంలాంటి చిత్రమైన బ్రతుకులో నేను 
నల్లని నీడలా నేను 
నాకే తెలియని నలుపులా నేను......

©gopi kiran
 #Poetry #kavi #Telugu
76b52acc6590e221f2258f657949a592

gopi kiran

నేనిక ఎంత మాత్రమూ అంతర్ముఖుడిని కాదు..
పూర్వోత్తేజం కోసం పోరాడుతున్న యోధుడిని...
పునర్జీవితం కోసం ఆరాటపడుతున్న కార్యోన్ముఖుడిని..
కొత్త చక్రాలు తొడుక్కుని.. కొత్త బ్రతుక్కై ప్రయాణం చేస్తున్నాను 
ఇక నుంచి నేను నేను కాదు...
సరికొత్తగా రాసుకున్న పాత కథను నేను...
నూతనోద్వేగం పొందిన సగటు మానవుడుని నేను 
నా శ్వాసల్లోంచి కొత్త ఆశ 
నా మాటల్లోంచి కొత్త పాట...
చిగుళ్ళేసుకుంటున్న పాత మోడును ఇప్పుడు నేను
చిరునవ్వుల సృష్టి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నాను 
నేనేమీ అంతర్ముఖుడిని కాను 
ఆవేశంతో పడుతున్న అడుగులు కొత్త దారుల్ని ప్రేరేపిస్తున్నాయి 
ఆలోచనల్లో నలుగుతున్న నిర్ణయాలు నవ్య రీతుల్ని నిర్దేశిస్తున్నాయి

©gopi kiran
 #Poetry #Telugu #motivate
817316cf5bc3279b231524da5e692c33

Rama Krishna

హైడ్రోజన్ తో
ఆక్సిజన్ కలిస్తే
'నీరు'
దానికి కాస్త
నీ జ్ఞాపకాన్ని కలిపితే
'కన్నీరు'!

©Rama Krishna
 #teluguquotes #telugu #Poetry
817316cf5bc3279b231524da5e692c33

Rama Krishna

పెదాలు పదాలైతే
కౌగిలించుకునే 
కాగితాల నిండా
ముద్దుల తడి!

©Rama Krishna #poetry #love #telugu

poetry love #Telugu

1,604 Views

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

ఉషోదయపు ఉషస్సు సుతిమెత్తగా తాకి పె౦చెనులే తనకి అతి సొగసు అది కా౦చిన మైమరుపుతో పులకి౦చెనులే ఆ మగువ మనసు ఇక మరిచెలే ర౦గులు పులుముటలో తన తపన తలపు Open collab for all telugu writers.
#collab #yqbaba #yqkavi #telugu #ఉషోదయ #sltelugu #collabchallenge  #YourQuoteAndMine
Collaborating with

Open collab for all telugu writers. #Collab #yqbaba #yqkavi #Telugu #ఉషోదయ #sltelugu #CollabChallenge #YourQuoteAndMine Collaborating with

0 Love

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

నా జీవితమొక ఆర్తిసాగర౦
స౦తోష౦ కన్నా విషాదపు చాయలే 
నన్ను వరించాయి
నా కవితాస౦పదగా మిగిలిపోయాయి Open collab for all telugu writers.

#yqkavi #yqbaba #జీవితకవనం #collab #telugu #collabchallenge
#sltelugu #YourQuoteAndMine
Collaborating

Open collab for all telugu writers. #yqkavi #yqbaba #జీవితకవనం #Collab #Telugu #CollabChallenge #sltelugu #YourQuoteAndMine Collaborating

0 Love

53c9914b2f9f00268c1b8222383ccac6

Bhu Mi

"మనసు కడలిగా మారితే....అంతర్మథనం.! దీనికింక అంథమెక్కడిది.." #yqkavi#telugu#Firstquote#lost#loneliness#telugu#poetry
4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

సగటు మనిషి పరిస్థితి కన్నా 
మతి భ్రమించిన మనిషి మానసిక స్థితి మేలు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

వెదవాలోచనలు కాచుకుని కూర్చుంటాయ్ 
ఖాళీగా ఎవరున్నారా...?
అని చూసి వాలిపోతుంటాయ్..
ఏదో ఒక పనిలో పడిపోండి వెంటనే....😝 #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

యువత జాగ్రత్త! మీరు ఎల్లప్పుడూ మీ మనస్సులో స్త్రీల గురించి అశ్లీల దృశ్యాలు లేదా అశ్లీల ఆలోచనలు గురించి ఆలోచిస్తూ ఉంటే, జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే సమానంగా కామ మరియు కామపు రాక్షసులు మీ శరీరంలోకి ప్రవేశిస్తారు మరియు మీ శరీరం ద్వారా స్త్రీలను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తారు.

©Manavazhagan
 యువకులారా జాగ్రత్తగా ఉండండి.#latestnewstelugu #intelugu #toptrending #toptrendingtoday #fbtelugu #instatelugu #telugu #googletopheadlines #g

యువకులారా జాగ్రత్తగా ఉండండి.#latestnewstelugu #intelugu #toptrending #toptrendingtoday #fbtelugu #instatelugu #Telugu #googletopheadlines g #షాయారీ #viralshorts

449 Views

18ad240fbe1733c11f74923b6195fd51

Manavazhagan

క్రమశిక్షణ మిమ్మల్ని కాపాడుతుంది.#latestnewstelugu #toptrendingtoday #fbtelugu #instatelugu #googlenews #googletopheadlines #intelugu #telug

క్రమశిక్షణ మిమ్మల్ని కాపాడుతుంది.#latestnewstelugu #toptrendingtoday #fbtelugu #instatelugu #googlenews #googletopheadlines #intelugu telug #viral #Telugu #నాలెడ్జ్

153 Views

loader
Home
Explore
Events
Notification
Profile