Nojoto: Largest Storytelling Platform

Best Amaterasutelugu Shayari, Status, Quotes, Stories

Find the Best Amaterasutelugu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about tamasha movie in telugu, pradip kumar amat 10, ama katha love shayari, taluqat e ama, nibiro ama timiro hote lyrics,

  • 1 Followers
  • 301 Stories
    PopularLatestVideo

amaterasu

(Scene-1 in the bride's room) పట్టుచీరలో వెండికొమ్మ పసిడి నగలను పెట్టరమ్మ వరుని తలపులో సిగ్గులమ్మ కదలకుండానుండవమ్మ కళలపూత యీ వెన్నెలమ్మ కళ్ళకాటుకదిద్దరమ్మ #teluguvelugu #yqkavi #Amaterasutelugu

read more
కలసి నడచిన తీరమంతా
కళ్ళముందే కదులుతున్నది
జంట పదముల గురుతులన్నీ
గుండెనింకా పట్టి ఉన్నవి

చల్లగాలిలో... చందమామతో
వానజల్లులో.... 
గొడుగు ముసుగులో...
చెప్పుకున్న ఊసులన్నీ
చెవిని ఇంకా వీడకున్నవి
(Full piece in captions) (Scene-1 in the bride's room)
 
పట్టుచీరలో వెండికొమ్మ
పసిడి నగలను పెట్టరమ్మ
వరుని తలపులో సిగ్గులమ్మ
కదలకుండానుండవమ్మ
కళలపూత యీ వెన్నెలమ్మ
కళ్ళకాటుకదిద్దరమ్మ

amaterasu

పరువాల నది తాక
ప్రణయాల గిరులన్ని
ప్రేమ ఇసుక మేటలై
కాల తీరాననున్నాయి!

ఏ ఇసుక గూటిలో
ఏ గుండె దాగుందో
ఏ అలల ధాటికది
ఏనాడు వీగేనో! #amaterasutelugu
#yqkavi
#teluguvelugu

amaterasu

ఒకరిని ఒకరు ఎన్నడుతాకని 
నింగినేలల బంధమే అందం
ఒకరికైనొకరు అవిశ్రమమ్ముగా
వెతికే నిశిప్రభలు మొరొక్క అందం

కడలిని చూడగ తొలి సందియలో
చూడకనేమో మలి సందియలో
ఆనందములో అంతే బాధలో
ఎరుపెక్కిన ఇన బింబమే అందం

చీకటికో చిరుదివ్వే అందం
వెలుతురులో కారడవే అందం
చంద్రునికో ఆ మచ్చే అందం
చల్లని రేయిన చలిమంటొక అందం
లోటుల లోతుల మాటున దాగిన
జీవితమే ఒక చక్కటి అందం #amaterasutelugu
#yqkavi
#teluguvelugu

amaterasu

మేఘమంటి నల్లకాటుక దిద్ది ఉన్న కనులలో
దారితప్పిన మనసు మాటున మాటనిప్పుడు చెప్పనా

నిలకడెరుగని మదిని దోచిన రాజహంస హొయలలో
కట్టుబడిన చిట్టి గుండె గుట్టునిప్పుడు విప్పనా

ముత్యమల్లే మెరిసిపోయే ముచ్చటైన మోమురా
కాంతినేదో దాచిపెట్టిన చలువ చంద్రుడు తన కనులురా

వెన్నెలంటి వన్నెలాడి వెన్న మనసే తనదిరా
నెమ్మదెంతో అనుకునేరు దొరకదెన్నడంతేనురా

చిలిపి చ్యేష్టల కొంటె కొమ్మ సందడంటే తానురా
అల్లరేను ఆడపిల్లకు అందమనిపించిందిరా

కోపమొస్తే కొసరుపెరుగు అందమే తన సొంతమ్మురా
అలుకబూనగ అధరంబుపైగల విసుగు దొంతర ముద్దురా! #yqkavi
#teluguvelugu
#amaterasutelugu

amaterasu

వెలుగుల పండుగ చీకటిలో కోలాహలమే పిల్లలలో లక్ష్మీ దేవికి హారతులు బొజ్జ నిండుగా ఆవడలు దిబ్బు దిబ్బు దీపావళి నాగులచవితి వచ్చె మళ్ళీ #ప్రహేళిక #పద్యసరళి #Amaterasutelugu #బాలసాహిత్యం

read more
వెలుగుల పండుగ చీకటిలో
కోలాహలమే పిల్లలలో
లక్ష్మీ దేవికి హారతులు
బొజ్జ నిండుగా ఆవడలు

దిబ్బు దిబ్బు దీపావళి
నాగులచవితి వచ్చె మళ్ళీ
అంటారంట అందరు పిల్లలు
మొదలాయ్యేనిక టపాసుమోతలు


చిచ్చరపిడుగుకి చిచ్చుబుడ్డిలు
ముద్దుల పాపకు వెన్నముద్దలు
దూరం దూరం పెద్ద ఔట్లు
ఇక రివ్వుననెగిరెను రాకెట్లు

నీలాకాశపు చీకటి రేడు
రాలేదేమని చూడకు నేడు
దీపపు వెలుగులు-పిల్లల మోములు
దాగెను చూడు వెన్నెల వెలుగులు 
వెలుగుల పండుగ చీకటిలో
కోలాహలమే పిల్లలలో
లక్ష్మీ దేవికి హారతులు
బొజ్జ నిండుగా ఆవడలు

దిబ్బు దిబ్బు దీపావళి
నాగులచవితి వచ్చె మళ్ళీ

amaterasu

************************** గెలుపుకు అర్థం ఓటమిలో ఆనందానిది అశృవులో దాచినదెవరో తెలియదుగాని జీవితమంటే తెలిసింది కాలక పసిడికి విలువే రాదని గాయం చేయని సాయం లేదని #teluguvelugu #yqkavi #Amaterasutelugu

read more
గెలుపుకు అర్థం ఓటమిలో
ఆనందానిది అశృవులో
దాచినదెవరో తెలియదుగాని
జీవితమంటే తెలిసింది

(Full Piece in Captions) **************************
గెలుపుకు అర్థం ఓటమిలో
ఆనందానిది అశృవులో
దాచినదెవరో తెలియదుగాని
జీవితమంటే తెలిసింది

కాలక పసిడికి విలువే రాదని
గాయం చేయని సాయం లేదని

amaterasu

*************************************** Each stanza represents a different theme. but all of them share almost the same meter. *************************************** #Amaterasutelugu #yqkavi #teluguvelugu

read more
1. కవితనేదో రాయమంటూ మనసు పిలిచెను చనువుగా
రాతలన్నీ ఇంకిపోగా కూర్చనేమది కొత్తగా?

2. పక్కపక్కనే కలిసిమెలిసి పోయెపదములు జంటట
కలతలెన్నో కలసి చూసిన కనుల జంటకు పేరేంటట?

3. ఎండుటాకులు రాలిపోగా  విరిసిన నవ వసంతమా!
రేపు నీవూ మరలి పోదువు! ఈ వింతలన్నీ నీ సొంతమా!

4. యేది నిజమో యేది ఊహయొ యేది నిశ్చయమో తెలుసునా?
తెలుసుకున్నా పెనవేసుకున్న మమతలను దాటుట సాధ్యమా?

5. తల్లి కౌగిట తండ్రి పంచన ఎదిగినావే బాల్యమా!
నివురుగప్పగ వెనుకనున్నది నిప్పొగాదో తెలుసునా? ***************************************
Each stanza represents a different theme.
but all of them share almost the same meter.
***************************************

#amaterasutelugu
#yqkavi #teluguvelugu

amaterasu

#Amaterasutelugu #yqkavi #teluguvelugu ******************************** Intended on making it a long form but guess I am too lazy.

read more
చూపులతోనే మదిగది తలుపుల
తాళం తీసెను తానెవరు?

ఊసుల సడిలో తలపులు తటికిట
తాళం వేసెను నేనెవరు?

మురిపెము ఇమిడిన బంగరు వెన్నెలకు
దారులు చెప్పిన తానెవరు?

మైమరపించే కన్నుల వన్నెలో
దారులు తప్పిన నేనెవరు? #amaterasutelugu 
#yqkavi
#teluguvelugu


********************************
Intended on making it a long form
but guess I am too lazy.

amaterasu

#Amaterasutelugu #yqkavi #teluguvelugu image source: https://www.etsy.com/in-en/listing/845517113/mother-and-child-line-art-grandmother

read more
కలిగినంతనేదీ కలుగవలయుననెడి
కోర్కె కలుగనట్టి పొందుయేది?

పలుకగానేది సురాసురులు చిలకిన
సుధను మించినట్టి మథురమేది?

శేషతల్పమొదలి వటపత్ర సాయియై 
ఆ దేవదేవుడు వెలయ మర్మమేది?

తీపిగన్నను తీపి తీపినిగన్న తీపి 
కన్న ప్రేమగాకనదియింకనేమి?— % & #amaterasutelugu
#yqkavi
#teluguvelugu



image source: https://www.etsy.com/in-en/listing/845517113/mother-and-child-line-art-grandmother

amaterasu

#Amaterasutelugu #yqkavi #teluguvelugu Ravivarma Akula, thank you for the suggestion :) Quote 1/?

read more
ఒక ఊహను నేను
నిదురిస్తున్న కలల జగతిలో
ఒక ఊహను నేను...

అలజడి రేపే ధ్వనులకులికిపడి
రెక్కలు కట్టుకునెగిరే పక్షిలా
ఒక్కసారిగా అగాథమ్ములో
పడిపోతూ తెరిచిన కన్నుల జంటలా

పరుగుల నదులూ వీచే తరువులు
తీరపు గవ్వలు పూచే పువ్వులు
అంతులేని ఆనందం కలిగినా
నమ్మలేక ఈ మాయల ఇలలో

ఒక ఊహను నేను
నిదురిస్తున్న కలల జగతిలో
ఒక ఊహను నేను...— % & #amaterasutelugu
#yqkavi
#teluguvelugu


Ravivarma Akula, thank you for the suggestion :)
Quote #1/?
loader
Home
Explore
Events
Notification
Profile