Nojoto: Largest Storytelling Platform

Best దాదా Shayari, Status, Quotes, Stories

Find the Best దాదా Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about దాదా pani puri wala, దాదా police wala, దాదా cycle wala, దాదా రిక్షావాలా, దాదా ట్రాక్టర్ వాలా,

  • 1 Followers
  • 4 Stories

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 333 #గజల్ #దాదా #పాండురంగశాస్త్రి #pandurangshastri #gazal మనసు మనసు కలసిపోతె గోడలు ఉండవు.! అందరమొకటని మొలిచిపోతె నీడలు ఉండవు.! శ్వేతవస్త్ర సన్యాసిని చూస్తే చాలు తత్వజ్ఞానం చేరని మూలలు ఉండవు.!

read more
మనసు మనసు కలసి నడిచితె గోడలు ఉండవు.!
అందరమొకటని తెలిసి మొలిచితె నీడలు ఉండవు.!

శ్వేతవస్త్ర   సన్యాసిని చూస్తే చాలును జన్మకు
తత్వజ్ఞానం చేరకపోయే వాడలు ఉండవు.!

శక్తిని చూడని వ్యక్తిని చూసే చూపులు నీకుంటే
గీతామృతమును పంచే చేతుల ధారలు ఉండవు.!

గురువే వంగుతు ముందుకు నడిపిన దారులు చూడరా
బడే బాయి నేననుకుని మురిసే తోకలు ఉండవు!

గమ్యం చేరే వేళలు కఠినం 'ఋషి' మార్గం తప్పకురా
వన్నెల కన్నులు కోరే సత్యం రూకలు ఉండవు.! #వన్నెలయ్య_గజల్ 333 #గజల్ #దాదా #పాండురంగశాస్త్రి #pandurangshastri #gazal

మనసు మనసు కలసిపోతె గోడలు ఉండవు.!
అందరమొకటని మొలిచిపోతె నీడలు ఉండవు.!

శ్వేతవస్త్ర సన్యాసిని చూస్తే చాలు
తత్వజ్ఞానం చేరని మూలలు ఉండవు.!

Naresh Reddy Aleti

Oct 19 పూజ్య పాండురంగ శాస్త్రి గారు పుట్టిన రోజు. Oct 25 పూజ్య పాండురంగ శాస్త్రి గారు పరమపదించిన రోజు, అనగా శివైక్యం చెందిన రోజు. ఓం . #వన్నెలయ్య_స్మృతి #దాదా

read more
సుందరం తన గాథ
సుమధురం తన బోధ
సురూపం మా దాద
ఓ కూనలమ్మ! Oct 19 పూజ్య పాండురంగ శాస్త్రి గారు పుట్టిన రోజు.
Oct 25 పూజ్య పాండురంగ శాస్త్రి గారు పరమపదించిన రోజు, అనగా శివైక్యం చెందిన రోజు. ఓం .
#వన్నెలయ్య_స్మృతి #దాదా

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_స్మృతి మనుష్య గౌరవదినము #దాదా అక్టోబరు19 2020

read more
సుమ పరిమళాలను మోసుకు వచ్చే సమీరాలు
కనిపించనంత మాత్రాన లేనట్టూ కాదు..
స్వాధ్యయ జ్ఞాన మకరందాలు మా ముందుంచిన మీరు మా కళ్ళకు గోచరించనంత మాత్రాన లేనట్టూ కాదు..
మా హృదయం ఎప్పటికీ మీకే కేదారం! #వన్నెలయ్య_స్మృతి 
మనుష్య గౌరవదినము
#దాదా
అక్టోబరు19
2020

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 02 1920-2003 Oct 19. The silent reformer పరమపూజనీయ "పాండురంగ శాస్త్రి ఆఠావలే" 'స్వాధ్యాయం' "భగవద్గీత పాఠశాల" "తత్వజ్ఞాన విద్యాపీఠం" వ్యవస్తాపకులు. దాదాపు 84దేశాల్లో స్వాధ్యాయ కార్యాన్ని ప్రసరింపజేసారు. దాదా గారికి జన్మదినం సందర్భంగా వారి పై ఒక గజల్. #వన్నెలయ్య_స్మృతి #మనుష్య #వన్నెలయ్య_ప్రత్యేక_రోజులు #గజల్స్

read more
మనిషిలోన మాధవున్ని చూపించే మాదాదా
మనసులోన స్వాధ్యాయం ఒలికించే మా దాదా

దేవతలే సేవించే సాగరసుధ ఒకటేగా
అష్టామృత కేంద్రాలే కురిపించే మా దాదా

కర్మ భక్తి జ్ఞాన యుక్తి శక్తి ముక్తి యోగాలే
ఇంటింటా తిరిగి తిరిగి వినిపించే మా దాదా

కులమతాలు అంతరాలు మరిపించే నడిపించే
'ప్రతి మనిషిని గౌరవించు' బోధించే మా దాదా

ఇల వన్నెల జీవనమే పడగల తల ఆడెనటా
జగమంతా నికేతనము నిర్మించే మా దాదా #వన్నెలయ్య_గజల్ 02
1920-2003 Oct 19.
The silent reformer
పరమపూజనీయ "పాండురంగ శాస్త్రి ఆఠావలే"
'స్వాధ్యాయం' "భగవద్గీత పాఠశాల" "తత్వజ్ఞాన విద్యాపీఠం" వ్యవస్తాపకులు.
దాదాపు 84దేశాల్లో స్వాధ్యాయ కార్యాన్ని ప్రసరింపజేసారు.

దాదా గారికి జన్మదినం సందర్భంగా వారి పై ఒక గజల్.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile