మనసంటే ఒక శక్తి.అందులో జ్ఞానేంద్రియాల ద్వారా అలవాట్లు, భావోద్వేగాలకు అనుగుణంగా ఆలోచనా తరంగాలు ఉత్పత్తి అవుతాయి.అవి మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తూ,అంతర్గత రొదకు కారణమై మాటలు,చర్యల రూపంలో బయటపడేలా చేస్తాయి. ఏమాత్రం శిక్షణ లేని మనసు తక్కువ శక్తి వ్యాప్తికే కంపిస్తుంది.సాధన మనసుకు శిక్షణను ఇవ్వడానికే. సాధకుడు క్రమం తప్పకుండా పాటించే మౌనం,ధ్యానం, అంచేలంచలుగా లోతుల్లోకి చేరుకున్నాక ప్రశాంతత స్థితిని చేరుకుంటాడు. సంకల్పం వల్ల సంక్లిష్ట పరిస్థితుల్లో సైతం ప్రశాంతంగా,స్థిమితంగా ఉండటం సాధ్యమౌతుంది. ©VADRA KRISHNA #yogaday