Nojoto: Largest Storytelling Platform

కట్టలు తెంచుకొచ్చే ఆవేశం లోన కలకలం సృష్టిస్తున్నా

కట్టలు తెంచుకొచ్చే ఆవేశం 
లోన కలకలం సృష్టిస్తున్నా 
నరం లేని నాలుకను తెగ్గోసుకుని‌ 
నోరు ముడుచుక్కూర్చోవాలి
ఎందుకంటావా?‌‌ 
హ హ హ నువు ఆడదానివి కదా

ఓపలేనంతగ రుధిరం 
లోన సలసల మరుగుతున్నా
కిక్కురుమనక జన్మతహ అవిటిదానల్లే 
చేతులు కట్టుక్కూర్చోవాలి 
ఎందుకంటావా? 
హ హ హ నువు ఆడదానివి కదా 

రగులుతున్న కోపపు కొలొమి కాలి కాలి 
నువ్వే కాలం చేసేలా నడుం బిగిస్తున్నా 
నీ జీవితం కాదన్నట్టు గిరిగీసుక్కూర్చోవాలి
ఎందుకంటావా? 
హ హ హ నువు ఆడదానివి కదా #ఆడది #ఆవేశం #కోపం #yqbaba #yqkavi #telugu 
#teluguvelugu #teluguquotes
కట్టలు తెంచుకొచ్చే ఆవేశం 
లోన కలకలం సృష్టిస్తున్నా 
నరం లేని నాలుకను తెగ్గోసుకుని‌ 
నోరు ముడుచుక్కూర్చోవాలి
ఎందుకంటావా?‌‌ 
హ హ హ నువు ఆడదానివి కదా

ఓపలేనంతగ రుధిరం 
లోన సలసల మరుగుతున్నా
కిక్కురుమనక జన్మతహ అవిటిదానల్లే 
చేతులు కట్టుక్కూర్చోవాలి 
ఎందుకంటావా? 
హ హ హ నువు ఆడదానివి కదా 

రగులుతున్న కోపపు కొలొమి కాలి కాలి 
నువ్వే కాలం చేసేలా నడుం బిగిస్తున్నా 
నీ జీవితం కాదన్నట్టు గిరిగీసుక్కూర్చోవాలి
ఎందుకంటావా? 
హ హ హ నువు ఆడదానివి కదా #ఆడది #ఆవేశం #కోపం #yqbaba #yqkavi #telugu 
#teluguvelugu #teluguquotes

#ఆడది #ఆవేశం #కోపం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes