Nojoto: Largest Storytelling Platform

నిశి తడిమిన నిమిషం నుండి రవికిరణం వదనాన వాలి తట్టి

నిశి తడిమిన నిమిషం నుండి రవికిరణం వదనాన వాలి తట్టి లేపేంత వరకు మదికి మస్తకానికి రోజు వాగ్వాదమే...
ప్రపంచమంతా తమ నివాస తలుపులు మూస్తేనేమి?
ఇక్కడ వాగ్వాదంతో నా కనుతలుపులు మూయక మునుపే తెలవారిపోతుంది
అతి ప్రేమలు పనికి రావు నిలువెల్లా ముంచి తేలుస్తాయని మస్తకం మదికి మసులుకునే మనుగడతత్వం నేర్చుకోమని హితభోద చేయబోతే...
మది తానేమి తక్కువ తినలేదు అన్నట్టు  మర సూత్రాలు నీకు ఆపాదించుకోకు నువ్ మనిషిలో ఒక అతి ముఖ్యమైన భూమిక పోషిస్తున్నావ్ గాని మర యంత్రంలో కాదు అని బదులిచ్చింది...
వీటి వాగ్వాదాలతో చర్చలతో భావోద్వేగాల సంఘర్షణ ఒత్తిడితో నాకు మాత్రం సరదా తీరిపోతుంది...
 
 #నిశి #రవికిరణం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

#నిశి #రవికిరణం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu