Nojoto: Largest Storytelling Platform

Girl quotes in Hindi ఎగరాలనే కొరికలో పుట్టిందేమో త

Girl quotes in Hindi ఎగరాలనే కొరికలో పుట్టిందేమో తను..,
అన్నీ వున్నా ఆమె ఎవరో...
గిరి గీసిన మనుషులదో,కట్టుబడాలన్న ఆమె ఆలోచనదో కానీ
ఎగరలేక ఆగిపోయినా ఒక్కో అడుగు,
కాలాన్ని చూసి కన్నీళ్లు పెట్టింది
ఎన్ని త్యాగాలో..,
ఏకాంత ప్రయాణంలో...,
ఆమె ఎవరో తెలుసా...!
పది సంవత్సరాల నీ చిట్టితల్లి,
నువ్వు గిరిగీసిన నీ చెల్లి..,
ఆడపిల్ల అని చులకన చేసిన ఆ సమాజపు వంటింటి పాత్ర...
చదువొక్కటే తనని,తన జీవితాన్ని,
మార్చగలదని నమ్మిన ఓ నిస్సహాయ బాలిక...
అలల సంద్రంలో ఆడుకోలేకపోయినా,
అతికిన అల్లరుల మధ్య ఆమె నవ్వెంతో కుసుమం❤️‍🩹

©Reddy Awesome 
  #story_of_the_day