Nojoto: Largest Storytelling Platform

జీవితాన్ని కథలా రాయడం మొదలెడితె.. కన్నీళ్లు సీరాచు

జీవితాన్ని కథలా రాయడం మొదలెడితె..
కన్నీళ్లు సీరాచుక్కలై పరిగెడతాయెమో..
అనుభవాల అల్లికల మధ్య,
గుణపాఠాల గుణకాలు ఎక్కువయ్యెకొద్ది..
ఆశయాలు పెంచిన మనసే,
అవకాశాలను తగ్గిస్తూ..,
ప్రతీ పేజీ చివరిపేజినేమో అనెలా..!
ఉదయం ఊపిరిపోస్తూంటే,
చీకటి చిదిమేసే కలల మధ్య రోజు పోరాటం 
అయినా..,
మంచిరోజులోస్తయిలే అనే ఆరాటం 
ఇంకా మనిషిని బతికిస్తూనే వుంటుంది....💫

©Reddy Awesome 
  #reasonforlife,#learntobe#life