Nojoto: Largest Storytelling Platform

తమకంగా గాలి గమకాలను పలికించాలనుకునేవేళ రూపాలను సం

తమకంగా గాలి గమకాలను పలికించాలనుకునేవేళ 
రూపాలను సంతరించుకోని కొన్ని ఆలాపనలు 
ఆకాశం నిండా 
వయ్యారంగా ఊహలు వాస్తవాలుగా మారేవేళ 
భయాలను ముద్రించిన కొన్ని కరపత్రాలు 
ఆలోచనల నిండా 
వసంతాలు వచ్చిపోతున్నా వయసుకి వానల జాడలేదు 
వర్షాలు కురిసిపోతున్నా మనసులో చెమ్మ మిగలడం లేదు 
కాలం వేచి వేచి వేధిస్తుంటే 
కరుణే లేని కన్నీళ్లు ఆగి ఆగి ప్రవహిస్తుంటే 
సమయాలన్నీ భావాలను సర్దిచెప్పుకోవడానికే సరిపెడుతుంటే 
సంతోషాల జాడలను ఏ నీడలలో వెతుక్కోను ..?
అనుబంధాల ఆశలను ఎవరితో పెనవేయను..?

©gopi kiran
  #Telugu #pietry #poem #Love #kavi
gopikiran7359

gopi kiran

Bronze Star
New Creator
streak icon131