Nojoto: Largest Storytelling Platform

నువు అర్ధరాత్రి సూర్యుడివెందుకయ్యావంటే ఏం చెప్పగల

నువు అర్ధరాత్రి సూర్యుడివెందుకయ్యావంటే 
ఏం చెప్పగలను?
పగలంతా తప్పక తనువు వెనక వెంపర్లాడతా!
రాత్రైతే ఆత్మతో అంతర్గత చర్చలు జరుపుతా! తప్పని పగటి నటన కన్నా
ఆత్మతో మమేకమయే రాత్రే నాకిష్టం.

అపుడే భూమికలన్నీ ముగించుకుని 
ఆ రాత్రి ఒడిలో కూనలా ఒదిగిపోతూ అస్తమిస్తా.
అపుడే జ్వలించే సూర్యుడిలా ధగధగమంటూ వెలిగిపోతూ ఉదయిస్తా.

మదిని అక్షయపాత్రను జేస్తా
నువు అర్ధరాత్రి సూర్యుడివెందుకయ్యావంటే 
ఏం చెప్పగలను?
పగలంతా తప్పక తనువు వెనక వెంపర్లాడతా!
రాత్రైతే ఆత్మతో అంతర్గత చర్చలు జరుపుతా! తప్పని పగటి నటన కన్నా
ఆత్మతో మమేకమయే రాత్రే నాకిష్టం.

అపుడే భూమికలన్నీ ముగించుకుని 
ఆ రాత్రి ఒడిలో కూనలా ఒదిగిపోతూ అస్తమిస్తా.
అపుడే జ్వలించే సూర్యుడిలా ధగధగమంటూ వెలిగిపోతూ ఉదయిస్తా.

మదిని అక్షయపాత్రను జేస్తా

తప్పని పగటి నటన కన్నా ఆత్మతో మమేకమయే రాత్రే నాకిష్టం. అపుడే భూమికలన్నీ ముగించుకుని ఆ రాత్రి ఒడిలో కూనలా ఒదిగిపోతూ అస్తమిస్తా. అపుడే జ్వలించే సూర్యుడిలా ధగధగమంటూ వెలిగిపోతూ ఉదయిస్తా. మదిని అక్షయపాత్రను జేస్తా #yqbaba #Telugu #writingresolution #నేను #teluguvelugu #yqkavi #అర్ధరాత్రి #అర్ధరాత్రి_సూర్యుడు