Nojoto: Largest Storytelling Platform

ఒకరిని ఒకరు ఎన్నడుతాకని నింగినేలల బంధమే అందం ఒకరి

ఒకరిని ఒకరు ఎన్నడుతాకని 
నింగినేలల బంధమే అందం
ఒకరికైనొకరు అవిశ్రమమ్ముగా
వెతికే నిశిప్రభలు మొరొక్క అందం

కడలిని చూడగ తొలి సందియలో
చూడకనేమో మలి సందియలో
ఆనందములో అంతే బాధలో
ఎరుపెక్కిన ఇన బింబమే అందం

చీకటికో చిరుదివ్వే అందం
వెలుతురులో కారడవే అందం
చంద్రునికో ఆ మచ్చే అందం
చల్లని రేయిన చలిమంటొక అందం
లోటుల లోతుల మాటున దాగిన
జీవితమే ఒక చక్కటి అందం #amaterasutelugu
#yqkavi
#teluguvelugu
ఒకరిని ఒకరు ఎన్నడుతాకని 
నింగినేలల బంధమే అందం
ఒకరికైనొకరు అవిశ్రమమ్ముగా
వెతికే నిశిప్రభలు మొరొక్క అందం

కడలిని చూడగ తొలి సందియలో
చూడకనేమో మలి సందియలో
ఆనందములో అంతే బాధలో
ఎరుపెక్కిన ఇన బింబమే అందం

చీకటికో చిరుదివ్వే అందం
వెలుతురులో కారడవే అందం
చంద్రునికో ఆ మచ్చే అందం
చల్లని రేయిన చలిమంటొక అందం
లోటుల లోతుల మాటున దాగిన
జీవితమే ఒక చక్కటి అందం #amaterasutelugu
#yqkavi
#teluguvelugu