Nojoto: Largest Storytelling Platform

వస్తున్నా, వస్తున్నా... -ఎవరి కోసం వస్తున్నావ్? దే

వస్తున్నా, వస్తున్నా...
-ఎవరి కోసం వస్తున్నావ్?
దేశం కోసం వస్తున్నా.
భరతమాత జన్మనిచ్చిన నా ప్రతి తోబుట్టువు జాగృతి కోసం వస్తున్నా.
సహస్రాబ్దాల ఘనచరిత్ర గల నా దేశాన్ని తిరిగి అగ్రపీఠం పై నిలపడానికి వస్తున్నా.
మన గతాన్ని గురించి గొప్పలు చెప్పుకునే రోజుల నుంచి
మన వర్తమానాన్ని ప్రపంచం స్తుతించే రోజులు తేవడానికి వస్తున్నా.
ఈ గణతంత్ర దేశంలో జనతంత్రానికి క్రొత్త నిర్వచనం ఇవ్వడానికి వస్తున్నా.
స్వార్థం, అవినీతి అనే ఆక్రమణశక్తులను పారద్రోలి 
సరికొత్త స్వతంత్రాన్ని సాధించడానికి వస్తున్నా.
కానరాని అడ్డుగోడలతో వేర్పడిన సమాజపు ముక్కలను అతికించి
ఐక్యభారత పౌరసమూహంగా మార్చడానికి వస్తున్నా.
దేశం అభ్యున్నతి కోసం త్రికరణశుద్ధితో శ్రమించడానికి వస్తున్నా.
నా దేశం కోసం వస్తున్నా. భారత దేశానికి నా ప్రతిజ్ఞ

My #pledge to Bharat.

Country has true #freedom when it is free of all evils. And true #patriotism is when every step you take is towards eradicating those evils.

#telugu #telugupoetry #the_lions_version