Nojoto: Largest Storytelling Platform

లింగ నిర్ధారణ చేస్తున్నారు ఆడపిల్ల అయితే ఆదిలోనే

లింగ నిర్ధారణ చేస్తున్నారు 
ఆడపిల్ల అయితే ఆదిలోనే తుంచేస్తున్నారు 
మగ పిల్లాడే కావాలంటూ పట్టుపడుతున్నారు 
వంశోద్ధారకుడు అంటూ మురిసిపోతున్నారు 
ధనం కోసం లక్ష్మీదేవికి పూజ చేస్తున్నారు 
విద్య కోసం సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నారు 
దేవతల రూపంలో ఉన్న వాళ్ళని కొలుస్తున్నారు
మొక్కులు చెల్లించుకుంటున్నారు 
జన్మనిచ్చిన తల్లిని చూసుకుంటున్నారు  
తనతో పాటు పెరిగిన వారిని హక్కున చేర్చుకుంటున్నారు  
జీవితాన్ని పంచుకున్న భార్య తో జీవనం సాగిస్తున్నారు 
పుట్టబోయేది ఆడపిల్ల అయితే వద్దు అనుకుంటున్నారు 
నలుసుగా దాన్ని చూస్తున్నారు 
నలకగా దాన్ని తీసి పడేస్తున్నారు   
మగపిల్లాడి కోసం యజ్ఞ హోమాలు చేసేస్తున్నారు 
గుళ్ళు గోపురాలు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు  
ఆడపిల్ల అనగానే అంతు చూస్తున్నారు 
బాహ్య ప్రపంచాన్ని చూడకుండా చేస్తున్నారు 
అంతలోనే పరలోకానికి పంపిస్తున్నారు
భ్రూణ హత్యలు చేస్తున్నారు  #స్త్రీ #భ్రూణహత్య #తెలుగుకవి #yqkavi