इज़हार నీతో నా కథకి రాస్తున్న మొదటి ప్రేమలేఖ..!💗 తెలియని మనస్సుల మధ్య ఊహలు పెంచే నీ స్నేహం🥰 విడువని వలపుల మధ్య నీతో నా సాన్నిత్యం🤗 పరవశించే పరిమళాలు,నీతో నా అనుభవాలు..🔷️ పరిమళించే కుసుమాలు,నీతో నే గడిపిన క్షణాలు..💠 అణువై సగమై ఆలోచనవై,నిలిచిన రూపమై అల్లే కథల మధ్య అణువణువై పోయాక తెలిసింది ఇది ప్రేమే అని, ఆ కథ మనదే అని,💌 గతమేదైనా,భవిష్యత్ లో నీతో నేను రాసుకునే కథ ప్రేమే...💟 కాదని అంటావా నా కవిత్వం ఐనా పూర్తవక మునుపే... లేదని అబద్ధమైతే చెప్పకు,క్షణ కాలము నా గుండె ఆగునేమో..💔 ఆవునని మాత్రామే ఆలకించు నా మాటల మూటలు💝💘 అప్పుడైనా వినబడునేమో నీకై రాసుకున్న నా హృదయ లేఖలు🙂 ©Reddy awesome #dilkibaat ,#ప్రేమలేఖ,#loveletter