Nojoto: Largest Storytelling Platform

నీకేం నువ్వు తారలా ప్రకాశిస్తుంటావు ఎక్కడో సుదూరం

నీకేం నువ్వు తారలా ప్రకాశిస్తుంటావు 
ఎక్కడో సుదూరంగా 
నిన్ను చూడడమే తప్ప దగ్గరగా నీ కాంతిని హృదయమంత నింపుకోవడానికి 
ఎన్ని వేల కాంతి సంవత్సరాలు పడుతుందో అని భయం 
నిత్యం నా ఎదురుగానే ఉంటావు 
ప్రతి రోజు పలకరిస్తూనే ఉంటావు 
నిను చూసుకుని మురిసిపోయే మనసు 
మౌనంగా నాక్కూడా తెలియకుండా వేల భావాలను పేర్చుకుని 
కొత్త కొత్త కథనాలు అల్లుకుంటుంది 
నీ పలకరింపుకే పులకరించే పద్ధతి అలవాటు చేసుకుంది హృదయం 
నీ అక్షరాల్లోంచి వచ్చే సౌరభం నా శ్వాశకు ఊపిరి పోస్తుంది 
నా జీవితంలో వెలుగు కోసం 
వెలుతురున్నంతసేపు చీకటి పడాలని కోరుకుంటున్నాను 
అప్పుడేగా ఆకాశం నిన్ను నాకు ప్రదర్శించేది 
అప్పుడేగా చుక్కల్లే నువ్వు సాక్షాత్కరించేది

©gopi kiran
  #Poetry #Telugu #kavita #telugupoetry
gopikiran7359

gopi kiran

Bronze Star
New Creator
streak icon447

Poetry #Telugu #kavita #telugupoetry

27 Views