Nojoto: Largest Storytelling Platform

Best telugupoetry Shayari, Status, Quotes, Stories

Find the Best telugupoetry Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutsad love quotes with images in telugu, there is only one happiness in this life to love and be loved meaning in telugu, telugu love quotes for her in english, love quotes for him in telugu, i love you quotes in telugu,

  • 43 Followers
  • 207 Stories

Lalitha_l2

Chakradhar Lochan Sairoop

భారత దేశానికి నా ప్రతిజ్ఞ My #Pledge to Bharat. Country has true #Freedom when it is free of all evils. And true #patriotism is when every step you take is towards eradicating those evils. #Telugu #telugupoetry #the_lions_version

read more
వస్తున్నా, వస్తున్నా...
-ఎవరి కోసం వస్తున్నావ్?
దేశం కోసం వస్తున్నా.
భరతమాత జన్మనిచ్చిన నా ప్రతి తోబుట్టువు జాగృతి కోసం వస్తున్నా.
సహస్రాబ్దాల ఘనచరిత్ర గల నా దేశాన్ని తిరిగి అగ్రపీఠం పై నిలపడానికి వస్తున్నా.
మన గతాన్ని గురించి గొప్పలు చెప్పుకునే రోజుల నుంచి
మన వర్తమానాన్ని ప్రపంచం స్తుతించే రోజులు తేవడానికి వస్తున్నా.
ఈ గణతంత్ర దేశంలో జనతంత్రానికి క్రొత్త నిర్వచనం ఇవ్వడానికి వస్తున్నా.
స్వార్థం, అవినీతి అనే ఆక్రమణశక్తులను పారద్రోలి 
సరికొత్త స్వతంత్రాన్ని సాధించడానికి వస్తున్నా.
కానరాని అడ్డుగోడలతో వేర్పడిన సమాజపు ముక్కలను అతికించి
ఐక్యభారత పౌరసమూహంగా మార్చడానికి వస్తున్నా.
దేశం అభ్యున్నతి కోసం త్రికరణశుద్ధితో శ్రమించడానికి వస్తున్నా.
నా దేశం కోసం వస్తున్నా. భారత దేశానికి నా ప్రతిజ్ఞ

My #pledge to Bharat.

Country has true #freedom when it is free of all evils. And true #patriotism is when every step you take is towards eradicating those evils.

#telugu #telugupoetry #the_lions_version

Dinakar Reddy

Dinakar Reddy

Dinakar Reddy

Dinakar Reddy

lalitha sai

ప్రతి చినుకు నీ తనువుని తడుముతుంటే
నా ఒళ్ళంతా నీ పులకరింపులే..
ప్రతి చినుకు నిన్ను మైమరపిస్తుంటే..
నా ఊపిరే.. నీ ఊపిరై..
పరిమళ్లిస్తున్న వేళ.

 #yqkavi #telugupoetry #varsham #nealochanalu

lalitha sai

నా మువ్వల సవ్వడికి..
తన మనసు మంచులా కరిగిన వేళ..
తన తాళముల అలికిడికి..
నా మనసు తడిసి ముద్దయిన వేళ.
 #yqtelugu #telugukavi #telugupoetry #napowrimo

Revanth Teja

#బ్రతుకు #బ్రతుకుమెతుకు #Telugu #telugupoetry #teluguvelugu #teluguquotes #telugukavi #telugabbai

read more
బ్రతుకుమెతుకుల మధ్య పరుగుపందంలో

బరువైన బ్రతుకులు కొన్ని,
భయపడే బ్రతుకులు ఇంకొన్ని•••

చిరిగిన జీవితాలు కొన్ని,
చితికిచేరిన జీవితాలు ఇంకొన్ని•••

కడుపు నిండక కొంతమంది,
తిన్నది అరగక ఇంకొంతమంది•••

మెతుకుల కోసం వెతుకులాట,
మరణాలవైపు వలసబాట•••

ఈ పందెంలో గెలిచేది ఎవరో 
గాలిలో కలిసేది ఎవరో ??? #బ్రతుకు #బ్రతుకుమెతుకు  #telugu #telugupoetry #teluguvelugu #teluguquotes #telugukavi #telugabbai

Revanth Teja

ఈనాడు . . . . . ! ! ! ! !

ప్రాణభయంతో ప్రారంభించే రోజులు...
బ్రతకాలని ఆశలతో ప్రాణాలు...
ఆకలితో కడుపు ఆర్తనాదాలు...
జీవనాధారం కోల్పోయిన జీవితాలు...
ఇళ్ళకు చేరడానికి అలిసిన అరికాళ్ళు...
కడుపు నింపే రైతుల కడుపుకోతలు...
స్మశాన వటికలు చాలని దేశాలు...

ఇలాంటి సమయంలో కంటికి కునుకు కరువైన,
కడుపుకి ఆహారం దూరమైన, 
బ్రతుక్కీ మరణభయం ఎదురైన 
మన కోసం కష్టపడే రైతులకు,డాక్టర్లకు, పోలిసులకు,
పారిశుధ్య కార్మికులకు,ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు. #caronavirus #stayhome_staysafe #telugu #teluguquotes #thankyou #telugupoetry #pain #struggles
loader
Home
Explore
Events
Notification
Profile