Nojoto: Largest Storytelling Platform
venkateshdupati7391
  • 8Stories
  • 33Followers
  • 33Love
    18Views

Venkatesh Dupati

Poet cum writer Way to positive life

  • Popular
  • Latest
  • Video
36ae88b6f8e861978fb0bd0ef463aefc

Venkatesh Dupati

Concept by venkatesh Dupati way to positive life....

Concept by venkatesh Dupati way to positive life.... #nojotovideo #Life_experience

36 Views

36ae88b6f8e861978fb0bd0ef463aefc

Venkatesh Dupati

మీ డాలరు విలువ మా రూపాయ విలువ కన్నా ఎక్కువే సర్.. మీ ఆర్థిక రంగం మాకన్నా మెరుగైనదే కావొచ్చు సర్.. మీకు అందుబాటులో ఉన్న సదుపాయాలతో పోల్చితే మావి ఎంతో కొంత తక్కువే ఉండొచ్చు సర్.. మీ దేశంలో భవంతులు ఆకాశాన్ని తాకుతాయి విన్నాం సర్.. ఇన్నీ భేధాలు మీరు చూపినా గానీ మీ ప్రాణాలను మా ప్రాణాలతో సమానంగా చూసే గుణంలో, త్యాగనిరతితో అవసరమైన ఔషద బలం పంచడంలో కనపరిచే విశాల సహృదయత లో మాత్రం మాదే పైచేయి సర్ నువ్వు అడిగేది హైడ్రాక్సీ క్లోరోక్విన్ అయినా, దాంతో పాటు ఇంకేది అయినా ఇచ్చేస్తాం సర్.. మేం భారతీయులం సర్ మనదంతా వసుధైక కుటుంబం.. మాపై కళ్లలో కోపం చూపించినా, పళ్లెం దగ్గరకు వచ్చేసరికి పగ, పంతాలను పక్కకుపెట్టి ఆకలి తీర్చే గుణం ఈ నేల సొంతం సర్.. మా దేశం పొరుగు దేశాలతో సరిహద్దులను మాత్రమే కాదు సహవాసాన్ని కూడా పంచుకోవాలనుకుంటుంది, సమస్యల సాధనలో సహభాగిగా నిలవాలనుకుంటుంది సర్.. మేమంతా భారతీయులం.. మాదంతా త్యాగనిరతే ప్రధాన లక్ష్యం.. Concept by venkatesh Dupati way to positive life.. Way to positive life venkatesh Dupati

Way to positive life venkatesh Dupati

5 Love

36ae88b6f8e861978fb0bd0ef463aefc

Venkatesh Dupati

మనం మాట్లాడితే అందరికీ దగ్గరౌతాం.. నిజాలు మాట్లాడనంత వరకు దగ్గరగానే ఉంటాం.. ఒకవేళ నిజం మాట్లాడామంటే మాత్రం అందరికీ దూరమవుతావు.. అదే బాటలో ముందుకు పోతే ఒంటరవుతాం.. నేను సినిమా చూపిస్తాను అంటే అందరూ ఊర్రుతలూగే వారు.. నిజాన్ని చూపిస్తా అంటున్నాను కాబట్టే అందరూ నా పై కోపంతో ఊగిపోతున్నారు.. ఐటమ్ సాంగ్ లతో,అద్భుతమైన గ్రాఫిక్స్ లతో సినిమా సినిమా లాగే చూపిస్తే ఆడియన్స్ నుంచి, సహచర మిత్రులనుంచి క్లాప్స్ కొట్టించుకునే వాడేమో.. సినిమా ద్వారానైనా నిజాన్ని కొంతవరకు జనాలకు చూపించాలనుకుంటున్నడు కాబట్టే ప్రతీ సినిమా క్లాప్ కొట్టకముందే స్టాప్ కార్డ్తో ఆగిపోతున్నయ్.. అందరూ నడిచిన బాటలలోనే తను కూడా నడిస్తే, నిజం కనుమరుగైపోయేదేమో ఈనాడు, సినిమా అంటే నిన్ను రెండున్నర ఈలలు కొట్టించేది కాదు సర్.. సినిమా అంటే ఎంతో కొంతైనా దానిని చూసి నేర్చుకోవాలనే ఉద్దేశితమైనది.. Hats of to you sir.. నీ వెనుక నీడ కూడా వచ్చేందుకు భయపడతది, ఎందుకంటే దానికి కూడా నిజం అంటే భయం కాబట్టి.. ఎవరెంత విమర్శించినా, ఎన్ని గొంతుకలు వ్యతిరేకంగా గర్జించినా నీలాగే నువ్వుండాలి సర్.. అదే అవసరం కూడా.. Fan of RGV.. Happy birthday to you sir way to positive life venkatesh Dupati.. "మనని ప్రపంచం పనిగట్టుకొని  మరీ వేధిస్తుంది తనలో బాటలోకి రానంత సేపు.. ఒక్కసారి తనబాటలోకి వెళ్లాక నీలాంటి వాళ్లను ఎందరినో చూశా, మార్చా అని సవాలు విసురుతుంది సర్.. Happy birthday to you RGV sir...

Happy birthday to you RGV sir... #poem

4 Love

36ae88b6f8e861978fb0bd0ef463aefc

Venkatesh Dupati

నువ్వు invite చేసిన ప్రతీ relative నువ్వు చేయబోయే కార్యానికి వస్తాడనుకోవడం, నువ్వు invite link పంపి ప్రతీ friend నువ్వు create చేయబోయే గ్రూప్ లోని వస్తాడనుకోవడం రెండూ ఒక్కలాంటివే సర్.. వాడికి రావాలనిపిస్తేనే వస్తడు.. వాడికి రావడం ఇష్టం లేనప్పుడు నువ్వు పోయి invite, ఇంకొకరితో రాయబారం పంపించి invite చేయించినా వాడు రాడు సర్.. ఎందుకు రాలేదని నువ్వు వాడిని అడగడం వాడు అదీ ఇదీ అంటూ ఏదో ఒక కారణం చెప్పడం షరామామూలే సర్.. "మిత్రులందరికీ చెప్పేది ఒక్కటే సర్.. Invite చేయడం, invite link పంపడం మాత్రమే నీ చేతుల్లో ఉంటది.. నీ విధిని నువ్వు నిర్వర్తించావు.. బంధాలను చేరువచేసుకోవాలని చూసినవం.. నువ్వు చేసిన invite, పంపిన invite link ని click చేసి, relation లో add కావడం, group లో one of participant గా మారడం అనేది వాడికే వదిలేయాల్సిన responsibility.. Way to positive life venkatesh Dupati Way to positive life venkatesh Dupati

Way to positive life venkatesh Dupati

4 Love

36ae88b6f8e861978fb0bd0ef463aefc

Venkatesh Dupati

Way to positive life venkatesh Dupati..

Way to positive life venkatesh Dupati.. #nojotovideo #Life_experience

30 Views

36ae88b6f8e861978fb0bd0ef463aefc

Venkatesh Dupati

సముద్రంలోని అలలకు, తీరానికి మధ్య ఉన్న సంబంధం లాంటిది నీది నాది.. సంద్రంలో ఆటుపోట్లు వచ్చిన ప్రతీసారి తీరాన్ని తాకడానికి ప్రయత్నించే అలల మాదిరిగా.. కష్టాలు కన్నీళ్లు బాధించిన ప్రతీసారి నాకు చెప్పుకోవడానికి దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తవు.. ప్చ్ పాపం అలలాగా నీకు నేను సమస్యను తీర్చే తీరంలా అనిపించలేదేమో.. అందుకే వస్తున్నవు వెళ్తున్నవు.. వచ్చేది కూడా నాకు చెప్పకుండా దాస్తూన్నవు.. నీ కోసం అలలకే సంకెళ్లు వేయాలనే ప్రయత్నం చేశా.. నువ్వొచ్చిన సంగతే తెలుసుకోలేనోడిని అలలు వచ్చే సమయం ఎలా తెలుసుకోగలను?.. నువ్వు తీరం దాకా వచ్చే సంగతి నాక్కూడా తెలుసు, పిలిస్తే అలిగి ఎక్కడ రావడం మానేస్తావో అన్న భయంతో పిలవలేకపోతున్నా.. ఓహో విశాల సంద్రమా!! నీదే ఈ కావ్యమా!!.. Way to positive life venkatesh Dupati

Way to positive life venkatesh Dupati

4 Love

36ae88b6f8e861978fb0bd0ef463aefc

Venkatesh Dupati

Bank balance - life balance concept by way to positive life venkatesh Dupati...

Bank balance - life balance concept by way to positive life venkatesh Dupati... #Comedy #nojotovideo

33 Views

36ae88b6f8e861978fb0bd0ef463aefc

Venkatesh Dupati

జీవితానికి ఎత్తు, పొడవు, వెడల్పు ఉంటే గుణించడం ద్వారా  ఘ(గు)ణపరిమాణం కనుక్కోవడం ద్వారా ఖచ్చితమైన స్వభావాన్ని నిర్థారించేవాడిని, పోనీ పొడవు, వెడల్పు లు ఉన్నా ఆ రెండింటి multiplication ద్వారా జీవితం వైశాల్యం ఎంతో, calculation చేయడం ద్వారా నిరూపించేవాడిని.. గానీ జీవితానికి పొడవు లేదు, వెడల్పు లేదు, ఎత్తు కూడా లేదు..ఇవన్నీ లేకున్నా ఎదుటి వారిపై మనం చూపే వైఖరి ఆధారంగా గుణపరిమాణం, ఆక్రమించబోయే వైశాల్యం ఆధారపడి ఉంటాయన్నది మాత్రం నిజం.. Way to positive life venkatesh Dupati నీ కథే.. ఈ కథ..
నీ గాథే.. ఈ గాథ.. నీ గెలుపునే కాంక్షిస్తుంది ఈ way to positive life సదా.. Way to positive life venkatesh Dupati

Way to positive life venkatesh Dupati #poem

6 Love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile