Nojoto: Largest Storytelling Platform
dwarakamaibathul5627
  • 5Stories
  • 37Followers
  • 21Love
    0Views

Dwarakamai Bathula

Poetess creative photographer mancherial. India.

myzibapp.com

  • Popular
  • Latest
  • Video
6224b16192d2a167ed78822e9d4546d7

Dwarakamai Bathula

వాకిలే దాటని వనిత 
నేడు వైవిధ్యాల వేలుపట్టి
విదేశాల వంతెనెక్కెను.
వంటింటికే పరిమితం అనుకున్న
పడతికి,
ఈ పొద్దు,
ప్రపంచ కంచెలు తెంచి
అంచుకి అంచు తిరిగి వచ్చే 
అవకాశం ఇచ్చింది.
ఇంత సాధించిన ఇంతికి 
నెలకోసారి నెలసరి నరకం
నడి బజారులో నరుల అరాచకం
చీకటి ముసురుకున్న
చేదు అనుభవాలే 
నారి నడిచే ప్రతిదారిలో
ప్రత్యేకదినం జరుపుకోవాల్సొచ్చిందంటేనే 
దాని అర్ధం.... 
మనకి సమాన హక్కులు మునుపు లేవని.
ఏ విషయాన్ని పరిగణించి నిర్ధారించుకున్నారో... 
ఆడది అనిగి ఉండాలని.
కాదు మేము నిప్పు కనికలమని
ఎలుగెత్తి చాటిన మహామణులెందరో...!!
వారిననుసరించి నడుద్దాం ....వెలుగు బాటలో.
__ద్వారకామాయి.బి #womens day 
#womensday
#womenwriter
6224b16192d2a167ed78822e9d4546d7

Dwarakamai Bathula

రూటు మార్చి
రైటనిపించుకో 
మాట నేర్చి
మేటివనిపించుకో 

_ద్వారకామాయి.బి #lifequotes
6224b16192d2a167ed78822e9d4546d7

Dwarakamai Bathula

ఆధ్యాత్మికత అంటే తెలియదు,
కాని, నా అంతరాత్మలో అన్నీ నీ చిత్రపటాలే .
తనివితీరని ముఖారవిందము కదా!! 
మనసు గదుల్లో ఖాళీ లేక మరేబాబాకీ అద్దె ఇవ్వనంది.
అడిగితే, అనుకున్నదాని కంటే ఎక్కువే 
నాకందిస్తుంటావు కదా...
అందుకేనేమో దేవాలయాల మీద 
ధ్యాస తక్కువ.
ఈ పండుగకి ఇలా చేయి, ఇవి సమర్పించు
అని ఎవరైనా చెప్పినా, 
నా ఎదలో ఓ గదిలో ప్రశాంతంగా రెండు నిమిషాలైనా 
కూర్చొని జపించినా, తపించినా
మనసుకి షిరిడీ వెళ్ళినంత సంతృప్తి.
కాదా?
నాలో నేను మాట్లాడుకుంటున్నా అంటే ,
నువ్వు వింటున్నావని, నేను చెబితే 
అలసట లేకుండా వినేది నువ్వేగా !
గొడవలు రాని, మనస్పర్ధాలు లేని
నిశ్చలమైన స్నేహితుడివి.
నా ఆలోచనల ఊయల ఊగుతూ 
నీ ప్రతిమ రెప్పవాల్చకుండా నన్నే చూస్తున్నట్టు....
ఆ నవ్వుతో, ఎన్నో మాటలు, సూక్తులు 
నా మనసుకి వినిపించేలా చెప్పినట్టు....
ఇక నేత్రబాషా గానమైతే, 
'నువు ఏది కోరితే అది నీదంతే, 
ఎక్కడున్నా తెచ్చి ఇచ్చే పూచి నాది', 
అని ప్రగాఢ నమ్మకాన్ని ఇస్తునట్టు....
ఇంకెన్నెన్నో ముఖ కవలికలు...నాకవి, సందేశాన్నిచ్చే పరమార్ధాలు.

__ద్వారకామాయి.బి devotional
saibaba
shiridi saibaba

devotional saibaba shiridi saibaba #poem

6224b16192d2a167ed78822e9d4546d7

Dwarakamai Bathula

చూస్తే రాదనుకున్నప్పుడు
చేస్తే రావొచ్చని తెలిసినప్పుడు
చేసేదేదైనా 
చస్తూ చేయకు
నిరాశని ఛేదిస్తూ 
కొంత కష్టాన్ని చేరుస్తే ....
ఏరకంగా అయినా
వచ్చేయొచ్చు ....
నీదగ్గరికే , వచ్చి ఇయ్యొచ్చు.
ప్రయత్నం వీడబోకు.
ప్రతిఫలం అనుభవించలేవు.

__ద్వారకామాయి.బి hard work quotes 
motivational quotes

hard work quotes motivational quotes

6224b16192d2a167ed78822e9d4546d7

Dwarakamai Bathula

నడిపించే నావ ఉన్నా ,
నది ఒడ్డున బాటసారులను
సరైన గట్టుకు చేర్చే
సంచాలకులు ఉండాల్సిందే.
మా గమ్యం వైపు సరైన 
సమయానికి నడిపిస్తూ 
మాకెప్పుడూ
స్పూర్తిదాయకంగా
నిలిచే మీ వ్యక్తిత్వానికి
సదా కృతజ్ఞతలు. student thanking his/her teacher

student thanking his/her teacher #Quote


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile