Nojoto: Largest Storytelling Platform
kaligatlavineela9591
  • 187Stories
  • 84Followers
  • 2.0KLove
    1.3KViews

vineelasubramanyam

believe in you'r self ✊️✊️✊️

  • Popular
  • Latest
  • Video
62c0d005bedf3793909bb19e9f9a4d39

vineelasubramanyam

sunset nature ఎన్నో సాయంత్రాలు 
నీ మాటల మధురిమలో 
మరెన్నో సాయంత్రాలు 
నీ నవ్వుల హరివిల్లులో 
రోజులు ఎన్ని అస్తమించినా 
దిగులుండదు నీ జతలో 
మరో కొత్త ఉదయం
 గురించి గుబులుండదు నీ ఒడిలో 
కలిసి వేసే ఒక్కో అడుగు 
గడిచే ఒక్కో నిమిషం
నిత్యం ఉదయించే మన ప్రేమకి 
నేడు పలికే చిరునవ్వుల వీడ్కోలు కనుక

©vineelasubramanyam 
  #sunsetnature #Love #Life
62c0d005bedf3793909bb19e9f9a4d39

vineelasubramanyam

White మనసనేది దేవుడిచ్చిన తెల్లకాగితం 
దానిపై ఆనందపు అక్షరాలను అందంగా రాస్తావో?
విసర్జించాల్సిన వ్యర్ధాలను వరుసలో రాస్తావో?
నీ విచక్షణకి మాత్రమే వదిలేస్తాడు....
కానీ 
నువ్వేది రాసినా నేనంటే ఏంటి?
 అని ఆలోచించి
 రాసినవి తిరిగి చదివినప్పుడు 
చిన్న చిరునవ్వు వచ్చేలా మాత్రం రాసుకో....

✍🏻Vineelasubramanyam ❤️

©vineelasubramanyam #Night #motivatation #Inspiration #Life #Memories #lesson
62c0d005bedf3793909bb19e9f9a4d39

vineelasubramanyam

ప్రేమలేఖ

నిన్ను ప్రేమించే కాలం పెరిగేకొద్ది
పదాలు చాలట్లేదు నీపై నా ప్రేమని తెలుప
నిన్నలోని మధుర జ్ఞాపకాలని రాయనా?
నేటిలోని తీపి ముచ్చట్లని రాయనా?
రేపటిలోని అందమైన కలల ప్రపంచం గురించి రాయనా?
ఎమని రాయను ఎన్నని రాయను?
వాడుక బాష వెనకబడిపోయింది
తెలిసిన బాష తెలివి తప్పింది
నేర్చుకున్న బాష నా ప్రేమని చెప్ప చాలా చిన్నదై పోయింది
మన మధ్య ఉంది ఒక్క బంధమంటే
గుక్కతిప్పకుండా వ్యక్తపరచ గలను
అవసరముంటే అమ్మ వి అవుతావు
నా వళ్ళ కానపుడు నాన్నలా తెలివి నేర్పుతావు
ఆపదవస్తే తోబుట్టువులా తోడుగా ఉంటావు
ఒంటరిగా అనిపించకుండా స్నేహితుడిలా సరదాగా ఉంటావు
కష్టమంటూ వస్తే నన్ను కాపు కాచే కంచె లా నా ముందు నిలుస్తావు
ఇన్ని బంధాలను కలబోసుకున్న నీ ప్రేమకి ఎం పేరు పెట్టను
ఏ బాష వాడి నా భావాలను ప్రేమ లేఖగా రాయను చెప్పు......

©vineelasubramanyam #Love #ValentinesDay #loveletter #Pyar #prema
62c0d005bedf3793909bb19e9f9a4d39

vineelasubramanyam

మకరందం ఉన్నంత వరకే సీతకోకచిలుక పువ్వు చుట్టూ తిరుగుతుంది, కడుపునిండినా, కోరిక తీరినా ఎగిరిపోతుంది, కొందరు మనుషులు కూడా అంతే ఆకర్షణ, అవసరం ఉన్నంత వరకే వెంట ఉంటారు  ఆపదలో ఉంటే అందకుండా వెళ్ళిపోతారు అలాంటి కీటకాల్లాంటి మనుషులతో జాగ్రత్త

©vineelasubramanyam #Telugu #teluguquotes #treanding #Life #MoralStories #Butterfly
62c0d005bedf3793909bb19e9f9a4d39

vineelasubramanyam

మాటలన్నీ మూటకట్టి తేనా?
 మదిలోని భావాలు తెలుప.
సిగ్గుల మొగ్గలన్నీ సిగను చుట్టి రానా?
 సడిచేయక నీ సరసన చేర.
దారితప్పిన ధ్యాసని మందలించి పంపనా?
నీ దరిచేరే వేళ ధైర్యంగా మెలగమని.
చిన్ని ఆశలన్నీ రాసులుగా పోయనా?
శ్వాసన నిండిన నీకు ప్రతిబింబమై మారనా?
రాఘవుడంటి నీ జతన జానకిగా నిలవనా?
జీవితమంతా నీ నీడన నీ సగమై బ్రతుకనా?

 నా హృదయ సామ్రాజ్యానికి
చక్రవర్తి గా ప్రకటిస్తున్నా
పదవి స్వీకరించి పదిలంగా కాచుకుంటావా?
 నా ప్రేమని ప్రాణాన్ని నైవేద్యంగా సమర్పిస్తాను.......
"Happy Love Anniversary My Love ❤️❤️❤️"

©vineelasubramanyam #Love #life #soulmate
62c0d005bedf3793909bb19e9f9a4d39

vineelasubramanyam

కలిసి నడిచినంత కాలం నీ కల్మషం లేని మనసెరగక
అకారణంగా నిన్ను అవమానించాను
నేడు నువ్వు ఈ అవని మీద కనుమరుగయ్యి పోయాక
 నీ కడచూపుకి  నోచుకోక
కన్నీళ్ళు ఇంకిపోయేలా ఏడ్చినా,
ఈ గుండె మంట ఆరడం లేదు 
 నీ పట్ల అమానుషంగా ఉన్న నా ప్రవర్తనకి
 ఆ దేవుడు నాకు విధించిన శిక్ష నీ మరణం
🥲🥲🥲

కాలంచేసానని జనులనుకున్నా
నే ఎప్పడు నీ వెంటే
ఈ కట్టే మాత్రమే కాలింది
 నీ మీద ప్రేమ పదిలంగా అలాగే ఉంది
కష్టమొస్తే నీ వెనక 
భయమనిపిస్తే నీ ముందు
ఆకలంటే మునుపటిలా కొసరి కొసరి పెట్టలేను
కానీ
ఆపదంటూ వస్తే 
 నిను కాపు కాచే కంచె లా  ఉండగలను
కరిగిపోయింది నా రూపమే నీపై నా ప్రేమ కాదు❤️❤️❤️

©vineelasubramanyam #doori #Love #pyar
62c0d005bedf3793909bb19e9f9a4d39

vineelasubramanyam

తీరం కనపడని తరుణంలో
మదిలో మెదిలే ఎన్నో ప్రశ్నలు?
దిక్కుతోచని గమనంలో
ఏ దిశన పయనం సాగించాలి?
వచ్చి పడే అడ్డంకులకు
 అండగా నడిచే తోడు లేని
 ఒంటరి ప్రయాణంలో,
చివరి పేజీ సుఖాంతం అని ఆశ పడటం అవివేకమా?
వెన్నంటి నడిచే నీడ లేనిదే
 వెనుదిరగక ముందుకు సాగలేమా?
భుజం తట్టి ఓదార్చే వారు లేకుంటే,
జీవితం కన్నీళ్ళ కడలిలో పడి కొట్టుకుపోవడమేనా?
ఎన్నాళ్ళో తెలియని దేహానికి,
ఇంకెన్నాళ్లు ఈ మనోవేదన 😔

©vineelasubramanyam 
  #Sawera #lonely #Failure #dipression #saad
62c0d005bedf3793909bb19e9f9a4d39

vineelasubramanyam

ఏ జన్మది ఈ బంధమంటే చెప్పలేను,
ఎన్ని జన్మల వరకు అంటే సమాధానం లేదు,
కానీ నీ చేయి పట్టి నడిచిన ఆ మొదటి క్షణం
 నూరేళ్ళ నా జీవితానికి ధర్పణమై నిలిచింది,
ఆ క్షణం కలిగిన ఆనందం నూరేళ్ళూ శాశ్వతం అని
నే తెలుసుకున్న ఆ నిమిషమే అర్ధమైంది 
 నా ఈ దేహం ప్రాణం రెండూ నీ సొంతమని,
ఏ కష్టమైన నీ అనుమతి లేనిది నా దరి చేరలేదని,
ఏమంత ఇష్టమంటే పేజీల కొద్దీ రాయగలను
 కానీ ఎందుకు నేనే అని అడిగితే మాత్రం
నా చిన్న చిరునవ్వు చాలు.
Happy Anniversary My Love ❤️

©vineelasubramanyam #Love #anniversary #husband
62c0d005bedf3793909bb19e9f9a4d39

vineelasubramanyam

మాటిస్తావా నా సంతోషంలో స్నేహితునిలా,
సమస్యల్లో సాయమొచ్చే సోదరునిలా,
భయంలో ధైర్యం నింపే నాన్నలా,
అలిగి గోలచేస్తే బుజ్జగించే అమ్మలా,
ఆటలాడి అల్లరి చేయడానికి నా తోటి పాపలా,
నా ప్రతి పొరపాటును సరిచేసే గురువులా,
నా ప్రతి అడుగులో నా వెంట నడిచే తోడులా,
దుఃఖంలో అక్కున చేర్చుకుని ఓదార్చే వాడిలా,
ఆయువు ముగిసే వరకు నా వెన్నంటి ఉండే నీడలా,
 మరుజన్మకు కూడా నా కోసం పుట్టే ప్రేమలా.....

©vineelasubramanyam 
  #Love #husband #Life #Soul
62c0d005bedf3793909bb19e9f9a4d39

vineelasubramanyam

నిండు జాబిల్లి తన అక్కసు చూపి
మబ్బుల మాటున నక్కి చూస్తుంది,
తనకంటే చల్లని నీడన నేనున్నానని,
రోజూ కురిసే మంచు
నేడు ఆగి ఆలోచించ సాగింది,
 వెచ్చని కౌగిలి చాటున నేనుండగా
చలితో నాకు గిలిగింతలు పుట్టించలేదేమోనని
కాంతులు చిమ్ముతూ
 కనులవిందుగా తిరిగే మినుగురులు
నేడు మౌనంగా ఉండిపోయాయి,
కబురుల ఊయలలో కమ్మని కధలు చెప్పే
నా చెలికాడికి సరితూగలేమెమోనని 
తన పక్కనుంటే పరవశం నా వశం,
నా ప్రపంచం తన పాదాక్రాంతం.

©vineelasubramanyam #Hum #ValentinesDay #Love
loader
Home
Explore
Events
Notification
Profile