Nojoto: Largest Storytelling Platform
anaganagaa4774
  • 250Stories
  • 0Followers
  • 0Love
    0Views

Anaganagaa

  • Popular
  • Latest
  • Video
81fd912f53c680eb6a6e23dbe2ab71cb

Anaganagaa

గుండెనానుకొని ఒక కొత్త గోడను నిర్మించాలి.గుండెకి ఉన్న సహజతత్వాన్ని తట్టుకోవడానికి మనిషి కూలిపోతూ కనుగొన్న కన్నీళ్లను ఆ సిమెంటు కట్టడానికి అతిగా పట్టించాలి లేదా ఒక్క గాలి తుంపరకి నేల రాలుతుంది. ఆ తరువాత నువ్వూ,నీ బలం ఒక జడపదార్థం అని అందరూ ఎండగట్టడం మొదలవుతుంది.నెమ్మదిగా అది కూడా అలవాటు అవుతుంది..
గెలవడం అంటేనే గట్టిగా నిలబడడం.పదే పదే నిన్ను కూల్చడానికి సిద్ధంగా ఉన్న ప్రపంచంలో నిలబడడానికి అర్హత చిత్తుగా కూలిపోవడం.

81fd912f53c680eb6a6e23dbe2ab71cb

Anaganagaa

ప్రశాంతతకు అతి ముఖ్యమైనది దూరం.దూరం ఉద్వేగ,ఉద్రిక్త పరిస్థితులను  సరిచేస్తుంది. స్నేహాలు,ప్రేమలు,బంధాలు దూరంపైన చూడడానికి బలంగా నిలబడతాయి. మనకు సరిచూసుకునే సమయం,సరిచేసుకునే ఉద్దేశ్యం ఎలాగూ ఉండవు కాబట్టి బలంగా ఉంది అనే భ్రమను సెల్ఫీ తీసి పెట్టుకోవడమే. మరణించిన ప్రేమలు,స్నేహాలు,బంధాలు కూడా దూరం వల్ల జీవం ఉన్నట్టు అన్పించినా తట్టిలేపే తీరిక ఉండదు కాబట్టి బతికి ఉన్నాయి అనే అనుకోవాలి.దూరం గెలుస్తుంది.దానిని ఓడించాలి అంటే ఇద్దరూ కావాలి,ఇద్దరు ఒక్కటిగా కలవాలి.ఆ స్థైర్యం,కోరిక అహం ఉన్న మనిషికి లేదు కాబట్టే  'నేను 'అనే తత్వాన్ని బలిష్టంగా మేపుతున్నాడు.

81fd912f53c680eb6a6e23dbe2ab71cb

Anaganagaa

ఆకాశం అతడు..
మెరుపుతెలుపులతో నలుపు అంధకారం గెలిచిన నక్షత్ర సమూహం అతడు..
అనంత నీలం కన్న కన్నీటి సంద్రం అతడు..
ఘీంకరింస్తూ విరుచుకుపడే మేఘం అతడు..
హోరుగాలిని వెంటబెట్టుకు రాలే  పెనుతుఫాను అతడు..
గ్రహాల నడుమ పల్టీలు కొట్టే  తోకచుక్క అతడు..
ఎంత వెతికినా అంతు చిక్కని విశ్వరహస్యం అతడు..
ఆకాశం అతడు.

81fd912f53c680eb6a6e23dbe2ab71cb

Anaganagaa

నచ్చిన భోజనం కిలోమీటర్లు ప్రయాణించి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.మెచ్చిన మిత్రులు నిన్ను కలిసి మిణుగురుల్లా మెరిసి చీకటిలో ఊరటనిస్తుంటారు.బాధించే స్నేహలు,ప్రేమలు నీకు తెలియకుండానే నిన్ను విముక్తున్ని చేస్తాయి.కలలు,కాసులు ఒకదానికొకటి ముందుగానో ఆలస్యంగానో నిన్ను చేరతాయి.అవమానాలు గుండెలో భద్రంగా ఉండి,ఆనందాలు వెన్నులో నిలబడడానికి సత్తువని చిలుకుతుంటాయి.కనీస మర్యాదకు నోచుకోని వ్యక్తులు కూడా మనిషీ,వ్యవస్థ,సమాజం పై గౌరవంతో ముందుకు వెళతారు. మాటల తూటాలన్నీ ఛాతిపై పరుచుకొని మరింత బలమైన కవచంలా మారుతుంది మనసుకి.బతుకులో ప్రతి ఘట్టం దీపాల పండుగే. లోన అగ్ని రగులుతున్నా సరే మెరుపుల కోసం నింగికెగసే తారాజువ్వ వ్యక్తిత్వ పయనమే దీపావళీ.

81fd912f53c680eb6a6e23dbe2ab71cb

Anaganagaa

గుండెల్లో యేళ్లుగా రగులుతున్న అగ్నిగుండాన్ని  గెలవకుండానే శాంతపరచాలి.గెలుపుమీద ఆశలేకున్నా గర్వంగా సాగించిన పవిత్ర క్రియలన్నిటిని మసి చేయాలి.ఇన్నేళ్ల శ్రమలు,ప్రయత్నాలు,పద్ధతులు మార్చుకుని అసలు ప్రపంచంలో తొలి అడుగు వేయాలి.ఆ ప్రపంచంలో వారుండరు  వారికి చెందిన ఏది తారసపడదు.తెలియని ఆనందాలు పలకరిస్తూ ఉంటాయి.నువ్వు లేకపోవడమే ఆనందం అని ఎప్పుడయినా కలగన్నావా? ఇదిగో ఈ నిజాన్ని చూడూ..ఇది కల కాదు అని మనసు పాడుతుంది.రెప్పపాటు వేగంతో వెళ్లి ఆ తలుపులకి తాళం వేసి వచ్చింది తాను మళ్లీ వచ్చి ఈ తలపులని చెరచకూడదని..నిదానంగా తెలుస్తుంది చెరచలేడని.. #మగత
81fd912f53c680eb6a6e23dbe2ab71cb

Anaganagaa

బతుకులకి వెనకడుగువేయడం అలవాటు అయిపోతుంది. తనదని ముందుకు వెళ్లడం కంటే తగాదా ఎందుకు అని తప్పుకోవడానికే మనసు ఓటేస్తుంది. నిజాలు నిప్పు గుణం కోల్పోతున్నాయి.స్నేహాలు,ప్రేమలు పదాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి.దాటేయడం,దాచేయడం మరింత మనశ్శాంతి ఇస్తుంది అనుకుంటా.నింగికి అతుక్కున్న చుక్కలకంటే తనని చూసే కళ్లకోసం రాలిపడే తార ఎక్కడో ఒక్కటి ఉంటుంది.గుండె గ్రహించేలోపే మాయం అవుతుంది.

81fd912f53c680eb6a6e23dbe2ab71cb

Anaganagaa

తగలబడే తెగువ ఉన్నవాడికి నిశ్శబ్ధం ఎప్పుడూ అభరణమే..అంచనా వేసి పరిణామాలను ముందుగానే పలకరించే వాడికి ప్రశాంతత ఎప్పుడూ చుట్టమే..తన కర్తవ్య నిర్వహణ ఏమిటో తెలిసి కూడా ధర్మం కోసం మరో అడుగు వేసేవాడు ఉత్తముడైనా గెలుచుకునేది నిందే.
జ్ఞాపకాలు గా మిగిలేవి ఏవిటి,గాయాలుగా మారేవి ఏవిటి,గాలిలొ కలిసేవి ఏవిటి అని ఏరి ప్రవర్తించడమే పరిణితి..

81fd912f53c680eb6a6e23dbe2ab71cb

Anaganagaa

ఉన్న ఇద్దరు,ముగ్గురు ప్రాణ మిత్రులలో  అగ్రగామివి నువ్వు
ఏదో ఒకటి రెండు రోజులు కనపడకుండా పోతావు కానీ ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటావు.నా బతుకుని చూస్తూ, కనువిందు చేస్తూ, నా మాటలు, ఊసులు పంచుకుంటావు మామ...

81fd912f53c680eb6a6e23dbe2ab71cb

Anaganagaa

ఐరావతం ఆమె..ప్రతి శునకం దగ్గర ఆగాలి అనే నియమం పెట్టుకోలేదు ఎందుకంటే సమయం,భావోద్వేగాల విలువ ప్రతీ క్షణం తన నాడీ వ్యవస్థలో మినుకుమినుకుమంటునే ఉంటుంది.తన తలలో ఎన్నో నీతిమాలిన టక్కరి నక్కలకు తలకొరివిలు పెట్టింది.మళ్లీ శవాల వద్ద ఆగి ఏమని మాట్లాడాలి.రాబోయే కథల్లో చరిత్రల్లో మన ఘన' ఉనికి కంటే మంచి అంటేనే భూతుగా పరిగణిస్తున్న ఈ కాలంలో ఇప్పుడు ప్రపంచాన్ని నడిపే ఆ ఒక్క శాతం మంచి'లో తానుండాలి అనుకుంది.వ్యవస్థ,వ్యక్తులు ఆమె  గురించి రాసే కూసే వ్యర్థం కంటే ఆమె బతికే తీరు ఆమెకి ఆహ్లాదాన్ని ఇస్తుంది. అందుకే ఆమె ఐరావతం.కంటికి భారీ తలపోగరు,బలుపు,అహంకారంలా కనిపించినా సమాజంలో కనిపించని నీతి,విలువల అతి భారీ సమూహం ఆమె. ఐరావతం ఆమె.

81fd912f53c680eb6a6e23dbe2ab71cb

Anaganagaa

ఎందుకొచ్చావు ఇక్కడికి.. ఒక నలభై,అరవై ఏళ్ల కిందట పడాల్సింది ఈ పాట్లన్నీ నిజం అనుకునేవారు.. ఏ ఈష్ట్మాన్ రంగుల మాయకి ముందు మేదిలితే అయినా అవునేమొ అనుకునేవారు..పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నా అప్పట్లో అంత పవిత్రం అని సర్దిచెప్పుకుని ఊరుకునేవారు.కథల్లో,నవలల్లో ఉన్నా చదివి ఔరా అనుకునేవారు..ఈ కాలంలో ఎక్కడుంది నీ దగ్గరున్నది? కాబట్టీ అది ఖచ్చితంగా నకిలీదే ఒకవేళ నకిలీది కాకున్నా నకిలీదే.. కాబట్టి మనిషి వెతికే ఆ నకిలీ అనబడే అసలుని మరిచి  అసలైన నకిలీని నరనరాన ప్రవహింపచేయి..కథలు,పుస్తకాలు, పూర్వీకులు ఎలానూ ఉన్నారు కదా ఉన్నాయి అని చెప్పుకోడానికి..

loader
Home
Explore
Events
Notification
Profile