Find the Latest Status about small quotations on life from top creators only on Nojoto App. Also find trending photos & videos.
Sivaramaprasad.vakkalagadda
ఎవరూ లేని చోట ఒక్క అడుగు కూడా వేయి ప్రశ్నలకు కారణమవుతుంది . అందరూ ఉన్న చోట వేయి అడుగులు ఉన్నా గుర్తింపుకు నోచుకోవు ... ఇక్కడ అడుగు ముఖ్యం కాదు .. ఆ అడుగు ఎక్కడ పడింది అనేది ముఖ్యం . life quotations
Sivaramaprasad.vakkalagadda
silence is thebest motivation for me ... life quotations
Sivaramaprasad.vakkalagadda
నీ నవ్వుల ముత్యాలను నక్షత్రాలుగా చేసి , ఆకాశంలో వెదజల్లినట్లున్నావ్ ... నీ చూపుల చురకత్తుల బాణాలై నన్ను ఉరిమి చూస్తున్నాయ్ .. నీ చెక్కిలి సుట్టలేవో మిణుగురులై చీకటిలో విసిరినట్లున్నావ్ ... నా కనులకు నీ వైపు దారి చూపుతున్నాయ్ ... అందమైన నా ప్రపంచంలో ... ఏ జడి ,అలజడి చేయని మౌనాన్ని వదిలి ఎగతాళి చేస్తున్నావ్ ... నా మనసు ఒక ప్రశ్నార్థకంగా మార్చేశావ్ .. life quotations
Sivaramaprasad.vakkalagadda
ప్రపంచంలో చాలా దేశాలను జయించిన అలెగ్జాండర్ . అంతుచిక్కని వ్యాధితో మరణించాడు . తన చివరి కోరికగా వైద్యులను తను చనిపోయాక తన అరచేతులను తెరచి ఆకాశం వైపు చూపిస్తూ పూడ్చిపెట్టమని చెప్పాడు .. రాజ వైద్యులకు అర్థం కాక ఎందుకు ? అని అడిగారు. అలెగ్జాండర్ చిన్నగా ఒక నవ్వు నవ్వి .... ఒంటిచేతితో ఎన్నో యుద్దాలు గెలిచిన రాజు , లక్షల మంది సైన్యం , లెక్కించలేనంత సంపద , ఇంత మంది గొప్ప రాజ వైద్యులు , తనతో ఉన్నా ఆఖరికి ఒక అంతుచిక్కని వ్యాధితో ఖాళీ చేతులతో అలెగ్జాండర్ నిస్సహాయుడుగా ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాడు . అని ప్రజలకు తెలియడానికి అని చెప్పాడు . life motivational quotations
Sivaramaprasad.vakkalagadda
మనుషులు గుర్తు చేస్తే గానీ గుర్తుకు రానంత దూరం జరిగినప్పుడు ఆ మనుషులకు గుర్తులు చెప్పి విసిగించేకన్నా , వారి జ్ఞాపక శక్తిని గౌరవించి , మౌనంగా మనం దూరమవ్వటమే మంచిది. life motivational quotations
Sivaramaprasad.vakkalagadda
ధైర్యం కవచం లాంటిది . నీలోని నిన్ను ఇతరులకు చూపిస్తుంది. మనసు ముసుగు లాంటిది. నీలోని ఇతరులను నీకు చూపిస్తుంది. ధైర్యాన్ని దత్తత తీసుకున్న వాడు ... జీవితంలో అన్ని సుఖాలను అనుభవిస్తాడు . మనసుతో ముచ్చట్లు పెట్టేవాడు .. జ్ఞాపకాల సంధ్రంలో పడి ఊపిరాడక బయటకు తీసే వారి కోసం వేచి చూస్తుంటాడు . life motivational quotations
Sivaramaprasad.vakkalagadda
నిన్నెవరు విమర్శించటం లేదంటే , వాళ్ళు కుళ్ళుకుని అసూయ పడేంత గొప్పగా నువ్వేమీ చేయలేదని అర్థం . అందుకే ఒకందుకు విమర్శ కూడా మంచిదే ..! So Be Cool ... and Be Positive. life motivational quotations
Sivaramaprasad.vakkalagadda
శ్రీకృష్ణుడు తపోవనంలో ఉండగా తండ్రి వసుదేవుడు ద్వారకలో దేహం వదిలి పెట్టాడు . సమయానికి బలరాముడు కూడా ద్వారకలో లేకపోవడంతో అన్ని కార్యక్రమాలు అర్జునుడు దగ్గరుండి జరిపించాడు . శ్రీకృష్ణుడికి ఈ విషయం చెబుదామని అర్జునుడు వెళ్ళే సరికి తపోవనంలో అప్పటికే బోయవాడి బాణం తగిలి శ్రీకృష్ణుడు దేహం వదిలిపెట్టి 4 , 5 రోజులవుతుంది . అర్జునుడు చాలా సేపు నమ్మలేక పోయాడు . ఆఖరికి తేరుకుని తనతో పాటు ఉన్న వారి సహాయంతో అరగంటలో అంతా పూర్తిచేశాడు . అఖండ కీర్తి ,ప్రతిష్ఠలు , రాజ్యం , భార్యలు , పిల్లలు , సంపద , బంధుగణం అన్నీ ఉన్నా ఆఖరికి , ఆ పరిస్థితులలో అర్జునుడు తప్పించి ఎవరూ లేరు . చరిత్ర మనకు ప్రతి సందర్భంలో ఏదో ఒక చిన్న ధైర్యం అందిస్తుంది . ఈ రోజు కరోనా వల్ల చనిపోయిన కొంతమంది చుట్టూ అందరూ ఉన్నా , వారు నిజంగా ఏ తప్పు చేయకపోయినా , ఎవరూ లేని వారిలా వెళ్లిపోవలసి వస్తుంది . కానీ మీ త్యాగాలను ఈ భూమి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది .. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు . జైహింద్ .. life motivational quotations
Sivaramaprasad.vakkalagadda
కనుబొమ్మలు కబుర్లు చెప్తాయి ... వాటిని అర్థం చేసుకునే మనసుంటే ... కంటి కనుపాపలు కథలు చెప్తాయి .. మనసులో రూపం ముద్రిస్తే .. కమనీయ కావ్యాలు క్యూ కడతాయి .. ప్రేమ లోని మాధుర్యం రుచి చూస్తే .. కానీ మనసెరిగిన మనిషి తనతో జీవితాంతం ఉండే అదృష్టం ... ఏ ఒక్కరికో దక్కుతుంది ... life motivational quotations
Sivaramaprasad.vakkalagadda
నేనొక అంతర్ముఖుడుని , నాకు తేనెలొలుకు తియ్యటి పలుకుల తీపి తెలియదు . పై పై మెరుగులతో ఆకట్టుకునే తెలివి లేదు , మాటల గారడీల కచేరీలు రానే రావు , నాకు నేనే ఓ ప్రశ్న , నాలో నేనే ఓ జవాబు , నా అంతరంగంలోని ఆలోచనలే ఓ ప్రపంచం , నా మౌనం లోని ఆవేదనే నా అక్షరం , కవిత్వమైనా , కల్లోలమైనా అర్థం చేసుకునే వారికి అది గెలిచిన కలం , అర్థం కాని వారికి ఓడిన గళం .. life motivational quotations