Nojoto: Largest Storytelling Platform

Best నవకెరటం Shayari, Status, Quotes, Stories

Find the Best నవకెరటం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 4 Followers
  • 11 Stories

Mouni Kanna✍

మాత్రాలు నాకు అంతగా తెలీవు .,కానీ నేర్చుకోవాలని... తెలుసుకుని ఏదో ట్రై చేశ . తప్పులుంటే క్షమించండి #సమస్యాపూరణ75 #నవకెరటం #నాభావాలు_మౌనీకన్న #teluguquotes #truefeelings #yqkavi

read more
-: నవకెరటం :- 
🔥ఉడుకురక్త మురకలేస్తే అసాధ్యమను మాటుండదు 
అలసటలను అధిగమిస్తు అనునిత్యం కృషిచేయగ 
🔥ఉత్సాహం నడుముకట్టె కొత్తమలుపు కోరుకుంటు 
కులబేధం వలదంటూ మూసుకున్న తెరనుతుంచి 
🔥కనికరమే కనుమరుగై డబ్బుమోజు నిన్నుకమ్మి 
నిన్నునువ్వు చంపుకోని కూడుకుంది ఏమున్నది
🔥యువకెరటం తలుచుకుంటె కట్టుబాట్లు కావుకంచె
ఎగసిపడును అధినేతగ నిస్వార్థ గెలుపుజండ
🔥దారిద్రం ఎవరిచ్చిరి నీతిలేని మనుజుడేగ... 
దేశవృధ్ధి ఎక్కడుంది ( యవ)నవకెరటం చేతుల్లో మాత్రాలు నాకు అంతగా తెలీవు .,కానీ నేర్చుకోవాలని...
తెలుసుకుని ఏదో ట్రై చేశ .
తప్పులుంటే క్షమించండి 

#సమస్యాపూరణ75
#నవకెరటం 
#నాభావాలు_మౌనీకన్న
#teluguquotes

srilatha lion

Vinay,bhargavi chinnu,shravs,laxman Anna,Sony,Shashi,nenunene, Ravi,Giri,Chandhu,Sandhya sissy,adhi thammudu thank u for ur pokes... #నవకెరటం

read more
కనులు తడవనిదే ఆమె పెదవి పెగిలిందీ లేదు
మనసు విరగనిదే తనకు మమత దొరికింది లేదు

తాను ఒంటరవ్వనిదే జంట కుదిరిందీ లేదు 
తనలో సమాధవనిదే మనుగడ సాగింది లేదు

తను చీకటి తాగనిదే ఆకలి తీరింది లేదు
తను చింతను చేరనిదే అడుగు కదిలిందీ లేదు

ఎంత గొప్ప రాతో మరి ఏరికోరి రాసెనేమొ
ఎండుటాకు వలే తాను కొలవబడని రోజె లేదు

ఏదెంతగ వేదించిన మరిచిపోగ వీలు లేదు
మరేదంత సులువుగా లత ఊపిరిని వదల లేదు Vinay,bhargavi chinnu,shravs,laxman Anna,Sony,Shashi,nenunene,
Ravi,Giri,Chandhu,Sandhya sissy,adhi thammudu thank u for ur pokes...

#నవకెరటం

srilatha lion

శివాజీ బొడ్డు గురు గారు ధన్యవాదాలు మీకు.. మీరు ఆ రోజు నన్ను రాయమని ఒట్టు వేస్కోవడం వల్లే మీకోసం‌ ప్రయత్నించా నేనివాళ.. తప్పులుంటే చెప్పగలరు సరిదిద్దుతా.. ఈ నవకెరటం మీకే అంకితం 🌹 Definitely bad attempt 😑 BT try chesa 😁 #yqbaba #Telugu #teluguquotes #teluguvelugu #yqkavi

read more
దూదిపింజ వలె దేహము గలదానివె చిన్నదాన
అందమునే నీ తొడుగుగ తొడిగాడే ఆ బ్రహ్మా!

సోలిపోవు సోగ కనులు గలదానివె చిన్నదాన
సొగసంతా నీ సొత్తును జేసాడే ఆ బ్రహ్మా!

అమృతాన్ని చిలుకు పెదవి గలదానివె చిన్నదాన
నిను చవి చూడగ మరణం లేదనెనే ఆ బ్రహ్మా!

ఉష్ణోగ్రత పెంచె నడుము గలదానివె చిన్నదాన
విశ్వంలొని వన్నె యంత నీలొ దాచె ఆ బ్రహ్మా!

పసిడిమయం చెయు పదములు గలదానివె చిన్నదాన
ఇంద్రజాల కిటుకు నీలొ నిల్పాడే ఆ బ్రహ్మా! శివాజీ బొడ్డు గురు గారు ధన్యవాదాలు మీకు..  మీరు ఆ రోజు నన్ను రాయమని ఒట్టు వేస్కోవడం వల్లే మీకోసం‌ ప్రయత్నించా నేనివాళ.. 
తప్పులుంటే చెప్పగలరు సరిదిద్దుతా..

ఈ నవకెరటం మీకే అంకితం 🌹

Definitely bad attempt 😑
BT try chesa 😁

Aswartha Lakshmi Mitta

#సమస్యాపూరణ75 #నవకెరటం #భావసుమాలు #వైక్యూకవి తల పైనే భారంగా తలకుమించిఉందిగా తలపులోన లేదుగ బడి మార్గమేలేదుబడికి తక్షణమే కావాలీ ధనరాబడి బ్రదుకు నడువ

read more
1తల పైనే భారంగా తలకుమించి ఉందిగా
తలపులోన లేదుగ బడి మార్గమే లేదు బడికి 

2తక్షణమే కావాలీ  ధనరాబడిబ్రదుకు నడువ 
అందుకనే  ఆశపడిన    వెళ్ళలేము చదువులబడి


3తప్పనిఆకలిపస్తులు తప్పనిసరియైనపనులు    
 అందుకనే కనలేము చదువులబడి

4.పనులుచేయ వెళ్ళినారు తల్లితండ్రులవెంబడి
పసితనమే బలా రాళ్ళపాలబడి!

5.పలుకులైన సరిగపలుక లేనివారు పసిబాలలు
పలకాబలపములుపట్టవీలులేక పనివారై

 #సమస్యాపూరణ75
#నవకెరటం
#భావసుమాలు
#వైక్యూకవి  
తల పైనే భారంగా తలకుమించిఉందిగా
తలపులోన లేదుగ బడి మార్గమేలేదుబడికి 
తక్షణమే కావాలీ  ధనరాబడి
బ్రదుకు నడువ

Aswartha Lakshmi Mitta

#సమస్యాపురణ75 #నవకెరటం #భావసుమాలు #వైక్యూకవి

read more
మేధావుల నిశ్శబ్దము జాతికంత నష్టములే
మనపడతుల నిశ్శబ్దము జీవితాల కష్టములే

ఇంటి పెద్ద వెళ్లి పోతే కుటుంబమే నిశ్శబ్దము
మనిషిలోన  మనసేమో  స్థంభింతే నిశ్శబ్దము

భంగమవని నిశ్శబ్దము మంచిమాట చెప్పినాక
భంగపడకు నిశ్శబ్దము దరిచేరకూ నిరాశతో

నిశ్శబ్దము అవ్నివేళలలోకాదు సరియైనది
నిశ్శబ్దము అవసరమే రణగొణసడులమద్యలో
 
నిశ్శబ్దము బలమైనది పదునైనది అనువైనది
నిశ్శబ్దంను ఉపయోగించు సరిగానూ  లక్షీనీవు

 #సమస్యాపురణ75
#నవకెరటం 
#భావసుమాలు 
#వైక్యూకవి

Naresh Reddy Aleti

#సమస్యాపూరణ75 #నవకెరటం Congratulations sumana pranav ji💐💐💐🌹🌹🌹

read more




సమస్యాపూరణ-75 లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ
నా ధన్యవాదాలు.
కొత్తవాళ్లు కూడా నేర్చుకుని ప్రయత్నించినందుకు
వారిని అభనందిస్తున్నాను.

'నవకెరటం' విజేతగా
శ్రీమతి                         గారిని ప్రకటిస్తూ,
తదుపరి ఛాలెంజ్ ఇవ్వవలసింందిగా
వారిని కోరుతూ,
వారికి నా అభినందనలు తెలుపుతున్నాను.
💐💐💐 #సమస్యాపూరణ75 #నవకెరటం

Congratulations sumana pranav ji💐💐💐🌹🌹🌹

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నవకెరటం #నవకెరటం #సంసారం #సమస్యాపూరణ75

read more
సాగరాన చిక్కినావ తీరాన్నే చూడలేవు
సంసారిగ మారావా పారాన్నే చేరలేవు

సాగరాన అగాధమున ఏముండెనొ ఎవరికెరుక
ఎప్పుడేమి పంచునో సంసారం తెలియనెటుల

సంసారం సంద్రమైతె సుడియేగా భార్యంటే
లాగేసే మకరములు నిన్నొదలని సంతానం

ఆకర్షణ చేయదుగా పరిదిమించి భూగ్రహము
అదిగమిస్తె లాగదుగా నిన్నుకూడ మోహగజము

చెంతచేరి ప్రతీఒకటి పంచెనుగా దుఃఖాలే
వన్నెలయ్య నవకెరటం తెలిపెనుగా సత్యాలే

"దారావర్తే తనయ సహజ గ్రాహ సంఘాకులేచ
సంసారాఖ్యే మహతి జలదౌ మజ్జతాం న" —'ముకుందమాల' #వన్నెలయ్య_నవకెరటం #నవకెరటం #సంసారం #సమస్యాపూరణ75

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 03 #వన్నెలయ్య_నవకెరటం #నవకెరటం #వసంతం #సమస్యాపూరణ75 కదలలేని బండబతుకు కదిలిందా వసంతమే మదివీడని చెడుగుణాలు వదిలిందా వసంతమే #గజల్ #గజల్స్

read more
గజల్

కదలలేని బండబతుకు కదిలిందా వసంతమే
మదివీడని చెడుగుణాలు వదిలిందా వసంతమే

తేలికయ్యి వాడిపోయి దూరమైన బంధాలు
మారిపోయి కరిగిపోయి కలిసిందా వసంతమే

శరీరాన్ని పీడిస్తూ బాధించిన వ్యాధి మంట
ఆరోగ్యం కానుకిచ్చి వీడిందా వసంతమే

నిరాశతో మరణాన్నే ప్రేమించిన వ్యక్తిలోన
చిన్ని ఆశ మొలకలేసి పూసిందా వసంతమే

వన్నెలయ్య మనంలోన భావసిరులు పొంగిపొరలి
జనంవనం చూస్తుండగ ఆడిందా వసంతమే #వన్నెలయ్య_గజల్ 03
#వన్నెలయ్య_నవకెరటం #నవకెరటం #వసంతం #సమస్యాపూరణ75

కదలలేని బండబతుకు కదిలిందా వసంతమే
మదివీడని చెడుగుణాలు వదిలిందా వసంతమే
 #గజల్ #గజల్స్

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నవకెరటం #నవకెరటం #సమస్యాపూరణ75

read more

నిరంతరం మనసునూపు కోరికలే నరకసీమ
వదిలి చూడు ఒక్కమారు ముందు ఉంచు స్వర్గసీమ

కనుల పడక కట్టేయును మమతలతో బంధాలే
వీడిపోతె చిందించును కలతలతో కన్నీల్లే

లేనిదైన కానిదైన చూపుతుంది అది మోహం
ఉన్నదేదొ ఉనికేదో తెలుపుతుంది అది శ్లోకం

బ్రతుకు బాట కదిపినదీ అనుభవాల తేనెమూట
మెతుకు వేట తెలిపినదీ అనుభూతుల మధుర పాట

హితము తలచి బోధలనే చాటలేద కృష్ణయ్య
గతము మరిచి తత్వములే పాడలేద వన్నెలయ్య #వన్నెలయ్య_నవకెరటం #నవకెరటం #సమస్యాపూరణ75

Naresh Reddy Aleti

#సమస్యాపూరణ75 #నవకెరటం #వన్నెలయ్య_నవకెరటం Exనవకెరటంం #exనవకెరటంం

read more
కాలంలో కాంతులతో లేచిందో నవ కెరటం
కలంలోన కళ్లలోన నిలిచిందో నవ కెరటం

మనసులోన బ్రతుకులోన ఆడిందో నవ కెరటం
బాధలలో బోధలుగా పలికిందో నవ కెరటం

సమస్యలనే సాగరాలు చిలికిందో నవ కెరటం
చిలికి చిలికి సుధాక్షరం ఒలికిందో నవ కెరటం

భావాలే ప్రాణంగా మోగిందో నవ కెరటం
ఓంకారం నాదంగా పాండిందో నవ కెరటం

తేట తెలుగు నా కవనం పడిలేచే నవ కెరటం
వన్నెలయ్య వెన్నలన్ని పంచిందో నవ కెరటం #సమస్యాపూరణ75 #నవకెరటం #వన్నెలయ్య_నవకెరటం #Exనవకెరటంం
loader
Home
Explore
Events
Notification
Profile