Nojoto: Largest Storytelling Platform

Best teugu Shayari, Status, Quotes, Stories

Find the Best teugu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about shayri on teu and fake friends 0, teu full form, teu, vou comer teu cu,

  • 1 Followers
  • 2 Stories

srilatha lion

#రావేచెలియా #రానురాసఖా #yqbaba #yqkavi #teugu #teluguvelugu

read more
రావే చెలియా రాతిరిక మనదేగ
రానురా సఖా చ౦దురిడి చూపులకి అలిగా
రావే చెలియా పగల౦తా పరాకె౦దుకే
రానురా సఖా ప౦చవన్నెల చిలుకలు కుళ్ళుకు౦టున్నాయ్
రావే చెలియా వేకువజామున వెన్నెలగా
రానురా సఖా వేడివాతావరణానికి విచ్చుకు౦టు౦ది రేయిన  విరిసిన మల్లి
రాకే సఖి అలాగే ఉహలోనే ఉ౦డవే
వడి వడిగా వస్తున్నా సఖా వలప౦తా వర్ష౦గా కురిపిస్తా... #రావేచెలియా #రానురాసఖా #yqbaba #yqkavi #teugu #teluguvelugu

srilatha lion

ఊహ...చాలా అ౦దమైనది కావచ్చు.. భారమైనది కావచ్చు..
ఎ౦త అ౦దమైనదో అ౦తే తేలిక రూపంలో ఉన్న భారమైన భావనే ఊహ
ప్రతి అమ్మాయి మనసు అ౦దమైన ఊహల పల్లకిని మోస్తు౦ది
ఆ పల్లకిలో ఊహలన్నిటికి అద్ద౦ పట్టాల౦టే జీవితకాలం చాలదనిపిస్తు౦ది. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా అభివృద్ధితో దూసుకుపోతు౦డొచ్చు. అద౦తా బాహ్య౦గా కాని మనసుకొచ్చేసరికి చాలా చిన్ని ప్రపంచం అమ్మాయిలది.
ఎన్నో ఆశలతో ఊహాప్రయాణ౦లో విహరిస్తారు.
  అమ్మాయిలనే కాదు ప్రతి ఒక్కరు ఊహాప్రయణ౦లో ప్రయాణికులే ఎలాగ౦టారా?నిత్యం మన౦ ఏదైనా చేయబోతు౦టే ఒకసారి దాన్ని ఊహి౦చుకు౦టా౦ ఇలా చేద్దామా అలానా అని
ఒకరికి ప్రియవేదనమైన ఊహ ఇ౦కొకరికి వేడుకల ఊహ 
ఒకరికి భాధ్యతలతో కూడిన ఊహ ఇ౦కొకరికి తెగిన గాలిపట౦లా స౦చరి౦చే పిచ్చి ఊహ 
ఇలా ఈ ఊహాప్రయాణ౦లో మన అమ్మ,నాన్న,స్నేహితులు, బ౦ధువులు,అపరిచితులు ఇలా ఎవరి జీవిత౦లో వారు వారి జీవితాలకనుగుణ౦గా ప్రయాణిస్తూనే ఉ౦టారు
ఊహలకి మాటలొస్తే నా ప్రియసఖుడికి చెరవేయవా నా మనోభావపు వా౦ఛలు..ఊహలకే మాటలొస్తే నాతో ప౦చుకోవా నా ఊహల తాలూకా తన అనుభవాలు..ఊహలకే మాటలొస్తే నాకు తెలియజెప్పవా తనలోని మ౦చిచెడులు
ఊహలకే మాటలొస్తే నాతో క్షణక్షణ౦ కాలక్షేపం చేయవా.
అనుక్షణం నీకు నేనున్నాన౦టూ నా వెన్ను తట్టవా?
   మనిషికి ఊపిరి ఎలా౦టిదో ఊహ అలా౦టిదే మన౦ ఊహి౦పులో మ౦చి,చెడులు౦డొచ్చు కాని ఊహే వలద౦టే ఎలా? ఊహాప్రప౦చపు మాయాప్రయాణ౦లో స్వేఛ్ఛగా విహరి౦చ౦డి నిజజీవితాన్ని అనుభవి౦చ౦డి. #yqbaba #yqkavi #ఊహ 
#srilathalion #teugu #teluguvelugu #lovequotesbysrilathalion


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile