Nojoto: Largest Storytelling Platform

Best చెట్టు Shayari, Status, Quotes, Stories

Find the Best చెట్టు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about చెట్టు dada, చెట్టులెక్కగలవా à°“ నరహరి పుట్టలెక్కగలవా, చెట్టు గురించి, చెట్టు à°•à°¿à°‚à°¦ పోసి, చెట్టు à°•à°¥,

  • 1 Followers
  • 7 Stories
    PopularLatestVideo

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #చెట్టు దాచబడిన సమాధిలో గుండె స్వప్నం ఒక్కటే కట్టబడిన గోడలలో బండ స్వప్నం ఒక్కటే చుట్టూరా వీడిపోని పచ్చదనం కావాలని.. కటిన రాళ్ళ గుట్టలలో కొండ స్వప్నం ఒక్కటే

read more
పూడ్చబడిన సమాధిలో గుండె స్వప్నిస్తున్నది
కట్టబడిన గోడలలో బండ స్వప్నిస్తున్నది
చుట్టూరా వీడిపోని పచ్చదనం కావాలని..
కటిన రాళ్ళ గుట్టలలో కొండ స్వప్నిస్తున్నది #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #చెట్టు

దాచబడిన సమాధిలో గుండె స్వప్నం ఒక్కటే
కట్టబడిన గోడలలో బండ స్వప్నం ఒక్కటే
చుట్టూరా వీడిపోని పచ్చదనం కావాలని..
కటిన రాళ్ళ గుట్టలలో కొండ స్వప్నం ఒక్కటే

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_వచన_కవిత #వచనకవిత #చెట్టు

read more
శీర్షిక: తానింకా పొల్యుట్ కాలేదు

పంచన చేరిన వారికి
తన మన అని చూడదు
నీడ ఇస్తుంది
తన మనసంత చల్లగా...

పసివాడు ఆకలిగా చూస్తే తట్టుకోలేదు
కడుపూ నింపుతుంది
జేబులు చేతులు కూడా నింపుతుంది
అమ్మ హృదయమంత హాయిగా..

కన్నీళ్ళ వర్షం కురిసినా
కష్టాల గాలులు వీచినా
కూలిపోదు, కుమిలిపోదు
నిలిచే ఉంటుంది
నిలవడమే నేర్పుతుంది
గురువు నల్లబల్ల పాఠంగా..
"ఆగమాపాయినోనిత్య" భ.గీ #వన్నెలయ్య_వచన_కవిత  #వచనకవిత #చెట్టు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_వచన_కవిత #వచనకవిత #కవిత #చెట్టు

read more
శీర్షిక: ఆ చెట్టు

ప్రయాణంలో..
బస్సు కిటికీలోంచి
కొమ్మలు చాచి
కరచాలనం చేసింది.!

సూర్యుడు రాగానే
నేను పనికెళ్ళి అలసిపోతే,
సూర్యుడిని ఓడించి, గిర్రున తిరిగే ఛత్రంలా మారి
నల్లని నీడై పోయింది.!

ఎముకలే
ఎండిపోయిన కొమ్మలు తన దేహంలో..
కట్టెల మోపై నెత్తినెక్కి
పొయ్యిలో దిగి ఆహుతై
కడుపు మంట చల్లార్చింది.!
"పరోపకారాయ ఫలంతి వృక్షాః" #వన్నెలయ్య_వచన_కవిత #వచనకవిత #కవిత #చెట్టు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #చెట్టు

read more
బీడు భూమి కోరింది
గొంతు తడుప రమ్మంది 
వన కాంత కనిపించక..
మబ్బేమొ అలిగింది.!

కఠినరాతి కొండమీద
ఆదివాసి తండ మీద
మొయిలెందుకు కరిగింది..
ఋషి వాటిక జెండ మీద.!

నీరేమో ప్రాణమాయె
మనిషికి నిర్లక్ష్యమాయె
మనుగడ పై దృష్టి లేక..
చెట్లన్నీ నరకబోయె.! #వన్నెలయ్య_మణిపూసలు #మణిపూసలు #చెట్టు

Naresh Reddy Aleti

#పంచరత్నాలు #వన్నెలయ్య_పంచరత్నాలు #చెట్టు #మొక్క

read more
మొక్క పెంచ లేని మనసు పెంచి 
చిక్కినావు కరువు చేతి లోన
ముందు చూపు చూసి మొక్క నాటు
వన్నెలయ్య పలుకు వెలుగు లొలుకు #పంచరత్నాలు #వన్నెలయ్య_పంచరత్నాలు #చెట్టు #మొక్క

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_గజల్ 37 #గజల్ #చెట్టు

read more
మట్టి ఇంత అంటొద్దని రాతిబాట నడిచినావు
చెట్టు నీడ ఇంత కూడ లేక ఎండ నిలిచినావు

చినుకు పంట తడపాలని ఆకాశం చూసినావు
వాన తెచ్చు చెట్టు ఒకటి పెంచాలని మరిచినావు

ఐసీయూ గాలిపీల్చి వేలు వేలు కట్టినావు
పైసడగక గాలినిచ్చు చెట్టులన్ని నరికినావు

మానవుడా నీస్వార్థం గగనానికి ఎగిరె చూడు
మనసు లేక మాను కూల్చి మనుగడనే తొలిచినావు

కాళేశ్వర జలములతో కల్వకుంట్ల నిండె చూడు
ఆ నీటితొ వసుదమ్మకు హరిత మాల వేయు నీవు

వన్నెల్లో 'స్వాతి' చినుకు కురిసి యేరు పారినపుడు
జగతి హితము తలచి నీవు మొక్కలెన్నొ పెట్టు నీవు #వన్నెలయ్య_గజల్ 37
#గజల్ #చెట్టు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రెక్కలు #తరువు #తనువు #గాలి #చెట్టు #తత్వం

read more
గాలితో కూడి ఆడింది
గాలి వదులుతూ బ్రతికింది
గాలితో ఆడి ఓడింది
గాలి వదిలి చచ్చింది


తనువు
తరువు #వన్నెలయ్య_రెక్కలు #తరువు #తనువు #గాలి #చెట్టు #తత్వం


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile