Find the Best సాయిరాం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about సాయిరాం, సాయిరాం సాయిరాం సాయి à°à°—వానà±, సాయిరాం ఫొటోసà±, సాయిరాం సాయిరాం సాయిరాం, సాయిరాం సాయిరాం సాంగà±à°¸à±,
Narahari Rao
🌹 సాయి పలుకులు 🌹 నేను ఎవరినీ మధ్యలో వదలను. చివరిదాకా తోడునీడగా ఉంటాను. నీవు కూడా జీవితాంతం నీ జతగా ఉండే స్నేహితులను ఎంచుకో. 16 జూలై 2021. ✍️ బాపురం నరహరి రావు. అనంతపురము. #తెలుగు #సాయిబాబా #సాయిరాం #telugu #yqtelugu #yqsaibaba #saibaba #saibabaquotes
Narahari Rao
🌹 సాయి పలుకులు 🌹 అహంకారాన్ని వీడి నా శరణు కోరావంటే నేను నీ హృదయంలోనే కొలువుంటాను. 15 జూలై 2021. ✍️ బాపురం నరహరి రావు. అనంతపురము. #తెలుగు #సాయిరాం #సాయిబాబా #ఓంసాయిరాం #telugu #yqtelugu #yqsaibaba #saibaba
Narahari Rao
🌹 సాయి పలుకులు 🌹 నీ కర్తవ్యాన్ని నీవు నిభాయించు. మిగతావన్నీ ఈశ్వరార్పణ కావించు. ఆ దేవదేవుడే అన్ని చూసుకుంటాడు. 14 జూలై 2021. ✍️ బాపురం నరహరి రావు. అనంతపురము. #తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #telugu #saibaba #saibabaquotes #saibabamessages
Narahari Rao
🌹 సాయి పలుకులు 🌹 మామిడి చెట్లలాంటి పండ్లచెట్లు ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి. ప్రతి చెట్టుకు ఎన్నో పూలు కాస్తాయి. కానీ అన్ని పూలు పండ్లుగా మారకుండా కొన్ని పూలు రాలిపోతుంటాయి. సృష్టిలో ఏదైనా సరే అవసరమైనంత మేరానే ఫలవంతమయ్యేదని గ్రహించు. 13 జూలై 2021. ✍️ బాపురం నరహరి రావు. అనంతపురము. #తెలుగు #సాయిరాం #సాయిబాబా #ఓంసాయిరాం #telugu #saibaba #saibabaquotes #saibabamessages
Narahari Rao
🌹 సాయి పలుకులు 🌹 నిన్ను ఎవరైనా ఎంతగా నిందించినా నీవు వారికి పరుషపు మాటలతో జవాబివ్వకు. నువ్వసలు వారిపై కోపాన్ని చూపకు. కోపగించడం నీ ఆరోగ్యానికే మంచిది కాదు. 12 జూలై 2021. ✍️ బాపురం నరహరి రావు. అనంతపురము. #తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #telugu #yqtelugu #saibaba #saibabaquotes
Narahari Rao
🌹 సాయి పలుకులు 🌹 ప్రపంచమంతా ఏకమై లేనిపోని డాంబికాలు ప్రదర్శించినా నీవు మాత్రం మారకు. ప్రశాంతంగా నవ్వుతూ నవ్విస్తూ ఎప్పటిలా నీవలెనే నీవుండు. 11 జూలై 2021. ✍️ బాపురం నరహరి రావు. అనంతపురము. #తెలుగు #సాయిబాబా #సాయిరాం #telugu #yqtelugu #saibaba #saibabaquotes #saibabamessages
Narahari Rao
🌹 సాయి పలుకులు 🌹 నేను నిత్యము సత్యమే పలికెదను. సత్యం తప్ప వేరే ఏదీ పలుకను. మీరు కూడా సత్యాన్నే పలుకండి. సత్యాన్నే ఆచరణగా తీసుకోండి. 10 జూలై 2021. ✍️ బాపురం నరహరి రావు. అనంతపురము. #తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #telugu #saibaba #saibabaquotes #yqsaibaba
Narahari Rao
🌹 సాయి పలుకులు 🌹 సంతోషాలు... దుఃఖాలు... ఇవన్నీ నీవు పేర్చుకున్న భ్రమలే! వీలైనంత త్వరలో వాటి ప్రభావాల నుండి బయట పడు. 09 జూలై 2021. ✍️ బాపురం నరహరి రావు. అనంతపురము. #తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #telugu #yqtelugu #saibaba #saibabaquotes
Narahari Rao
🌹 సాయి పలుకులు 🌹 మనసుతో పాటు సర్వేంద్రియాలను ఈశ్వరునిపై నిమగ్నం చేయి. అంతులేని సంతృప్తి... ప్రశాంతతను పొందడమే కాక పనికిరాని అన్య విషయాలపై అనాసక్తిని పొందగలవు. 08 జూలై 2021. ✍️ బాపురం నరహరి రావు. అనంతపురము. #తెలుగు #సాయిబాబా #సాయిరాం #ఓంసాయిరాం #telugu #sailove #saibaba #saibabaquotes
Narahari Rao
🌹 సాయి పలుకులు 🌹 అన్నార్తుల ఆకలిదప్పులు తీర్చి మానవసేవలో తరించేవారే నాకు దగ్గరైనవారు. వారే నాకు ఇష్టులు. ఇది సత్యం. 07 జూలై 2021. ✍️ బాపురం నరహరి రావు. అనంతపురము. #తెలుగు #సాయిరాం #సాయిబాబా #telugu #yqtelugu #sailove #saibabaquotes #saibabamessages