Nojoto: Largest Storytelling Platform

అడుగులు తడబడుతున్నాయి .... అగమ్యంగా సాగుతున్న దారు

అడుగులు తడబడుతున్నాయి ....
అగమ్యంగా సాగుతున్న దారుల్లో
ఆలోచనలు అణగారిపోతున్నాయి ...
అస్తవ్యస్తముగా వ్యవహరిస్తున్న కాలంలో 
నాకు నేనే అనామకుడినైపోతున్నాను ...
నాలోని ఏ భావానికీ గుర్తింపు లేదు..
నాలోని ఏ చర్యకు ప్రతిస్పందన లేదు ...
నాతో నేనే మాట్లాడుకుంటున్న అస్తిపంజరాన్ని ...
నాలో నేను మిగిలిపోయిన జీవచ్ఛవాన్ని ....
చిరునవ్వులు చిందించలేక పెదవులు చిట్లిపోయాయి ..
కన్నీళ్లు జార్చుకోలేక చెక్కిళ్ళు చితికిపోయాయి ...
నేనిప్పుడో సంపూర్ణ పరిశుద్ధ అనామకుడ్ని 
నా భావానికి అర్ధం ప్రకటనల్లో తప్ప .. బంధాల్లో లేదు...
బాధ శరీరమంతా ఉందీ , అనుబంధాల్లో లేదు ..
వర్తమానాన్ని చంపేసుకున్న గతాన్ని నేను 
భవిష్యత్తుని బెదిరిస్తున్న వర్తమానాన్నీ నేనే ....
మొత్తానికి నాలోని ప్రశ్నలకు నేనే జవాబుదారుడ్ని ...
అయినా నాలో సమాధానం లేనే లేదు ....
నన్ను నేను సమర్ధించుకోలేని అసమర్దుడిని 
నాకు నేను సహాయం చేసుకోలేని నిస్సహాయుడిని 
అందుకే నేనిప్పుడో ప్రముఖ అనామకుడికి

©gopi kiran
  #Quotes #poetry #telugu #telugupoetry #kavitha #films