Nojoto: Largest Storytelling Platform

Autumn భయమే భయానక వ్యాది:- ***********************

Autumn భయమే భయానక వ్యాది:-
***********************
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం.ప్రతి మనిషిలోనూ ఏదో ఒక కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది.మనిషికి మరణం ఒక్కసారే వస్తుంది.భయం అనుక్షణం చావును చవిచూపిస్తూనే ఉంటుంది.ఈ భయం అనే బహీనత,ఆనందానికి అవరోధం.ఆదర్శవంతమైన జీవన ప్రస్థానానికి అడ్డుకట్ట.
✓బోగాలను అనుభవిద్దామంటే,అవి అతిగా పరణిమించి, వ్యాదిగ్రస్తున్ని చేస్తాయేమోనేమోనని భయం.
✓ఇంటి గుట్టు రట్టయితే అపఖ్యాతి పాలవవుతానేమోనని భయం.
✓దొంగలదృష్టి పడితే సంపదనంతా పోతుందేమోనని భయం.
✓దొడ్డిదారిన పదవి పొందితే,ఆ పదవికి ఏవాడైనా ఎసరు పెడతాదడేమోనని భయం.
✓సత్కారాలు, పురస్కారాలు పొందుతుంటే ఎవడైనా కళంకం ఆపాదిస్తాడేమోనని భయం.
✓బలపరాక్రమంతో విజయం పొందగానే ఏవిశ్వాస ఘాతకుడైనా దొంగదెబ్బ తీస్తాడేమోనని భయం.
✓వయసు మీరిన కొద్దీ యవ్వనం సౌందర్యం కోల్పోయి,ముడతలు పడ్డ శరీరం ఎంత వికృతమైపోతుందోనని భయం.
ఇలా ఎదోవిడమైన భయం మనిషిని అనుక్షణం కుంగదీస్తూనే ఉంటుంది.
*నా హృదయ కుహారంలో శంకరుడనే సింహం ఉండగా,ఇక నాకు భయం ఎందుకు?

©VADRA KRISHNA #autumn *భర్తృహరి, ఆది శంకరా చార్యులు
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon4

#autumn *భర్తృహరి, ఆది శంకరా చార్యులు

135 Views