Nojoto: Largest Storytelling Platform

వెలుగుల పండుగ చీకటిలో కోలాహలమే పిల్లలలో లక్ష్మీ దే

వెలుగుల పండుగ చీకటిలో
కోలాహలమే పిల్లలలో
లక్ష్మీ దేవికి హారతులు
బొజ్జ నిండుగా ఆవడలు

దిబ్బు దిబ్బు దీపావళి
నాగులచవితి వచ్చె మళ్ళీ
అంటారంట అందరు పిల్లలు
మొదలాయ్యేనిక టపాసుమోతలు


చిచ్చరపిడుగుకి చిచ్చుబుడ్డిలు
ముద్దుల పాపకు వెన్నముద్దలు
దూరం దూరం పెద్ద ఔట్లు
ఇక రివ్వుననెగిరెను రాకెట్లు

నీలాకాశపు చీకటి రేడు
రాలేదేమని చూడకు నేడు
దీపపు వెలుగులు-పిల్లల మోములు
దాగెను చూడు వెన్నెల వెలుగులు 
వెలుగుల పండుగ చీకటిలో
కోలాహలమే పిల్లలలో
లక్ష్మీ దేవికి హారతులు
బొజ్జ నిండుగా ఆవడలు

దిబ్బు దిబ్బు దీపావళి
నాగులచవితి వచ్చె మళ్ళీ
వెలుగుల పండుగ చీకటిలో
కోలాహలమే పిల్లలలో
లక్ష్మీ దేవికి హారతులు
బొజ్జ నిండుగా ఆవడలు

దిబ్బు దిబ్బు దీపావళి
నాగులచవితి వచ్చె మళ్ళీ
అంటారంట అందరు పిల్లలు
మొదలాయ్యేనిక టపాసుమోతలు


చిచ్చరపిడుగుకి చిచ్చుబుడ్డిలు
ముద్దుల పాపకు వెన్నముద్దలు
దూరం దూరం పెద్ద ఔట్లు
ఇక రివ్వుననెగిరెను రాకెట్లు

నీలాకాశపు చీకటి రేడు
రాలేదేమని చూడకు నేడు
దీపపు వెలుగులు-పిల్లల మోములు
దాగెను చూడు వెన్నెల వెలుగులు 
వెలుగుల పండుగ చీకటిలో
కోలాహలమే పిల్లలలో
లక్ష్మీ దేవికి హారతులు
బొజ్జ నిండుగా ఆవడలు

దిబ్బు దిబ్బు దీపావళి
నాగులచవితి వచ్చె మళ్ళీ
amaterasu9739

amaterasu

New Creator

వెలుగుల పండుగ చీకటిలో కోలాహలమే పిల్లలలో లక్ష్మీ దేవికి హారతులు బొజ్జ నిండుగా ఆవడలు దిబ్బు దిబ్బు దీపావళి నాగులచవితి వచ్చె మళ్ళీ #ప్రహేళిక #పద్యసరళి #Amaterasutelugu #బాలసాహిత్యం