Nojoto: Largest Storytelling Platform

White మహాకవి ఖలీల్ జిబ్రాన్ తన "ప్రవక్త" కావ్యంలో

White మహాకవి ఖలీల్ జిబ్రాన్ తన "ప్రవక్త" కావ్యంలో తల్లి దండ్రుల  భాంధ్వ్యాన్ని గురించి ఎంత తాత్వికంగా చెప్పాడో చూడండి....

✓మీ పిల్లలు మీపిల్లలు కారు.
✓స్వీయ కాంక్ష జీవితపు సంతతివారు.
✓వారు మీద్వారా వస్తారు కానీ మీ నుంచి కాదు.
✓వారు మీతో ఉంటారు గానీ మీకు చెందిన వారు కాదు.
✓వారికి మీప్రేమను పంచగలరు గానీ,మీభావాలను కాదు.
✓వారి భౌతిక దేహాలకు మీరు ఆశ్రయమివ్వగలరు గానీ వారి ఆత్మలకు కాదు...ఎందుకంటే వారి ఆత్మలు రేపటి ఆవాసంలో నివసిస్తాయి గనుక.కనీసం మీ కలల్లో కూడా అక్కడకు వెళ్ళలేరు.
✓వారిలా ఉండేందుకు మీరు ప్రయత్నించవచ్చు కానీ వారిని మీలా మార్చాలనుకోకండి...
✓ఎందుకంటే జీవితం తిరోగమించదు;నిన్నటి తోనూ మమేకం కాదు.
✓పిల్లలనే సజీవభాణాలను సంధించే విల్లులు మీరు.అనంతమార్గాన గల ఆ గురిని వీలుకాడు వీక్షిస్తాడు.
✓తన భాణాలు సుదూరంగా దుసుకుపోయేలా తన అఖండ శక్తితో వంచుతారు.
✓ఆ విలుకాని చేతిలో అలా మీరు వంగిపోవడం "ముదిమును"కూర్చేది కావాలి.
✓ఎగిరివెళ్ళే భాణాలను ఎంతగా ప్రేమిస్తాడో, స్థిరంగా నిలిచిన వింటిని అంతగా అభిమానిస్తాడు.

©VADRA KRISHNA
  *ఖలీల్ జిబ్రాన్(స్వాతి 14/9/2007)

*ఖలీల్ జిబ్రాన్(స్వాతి 14/9/2007) #మోటివేషన్

126 Views