Nojoto: Largest Storytelling Platform

నేను ఇక్కడెక్కడో నీ ఆలోచనల్లో ఉన్నానని అనుక్షణం నీ

నేను ఇక్కడెక్కడో నీ ఆలోచనల్లో ఉన్నానని అనుక్షణం నీకు గుర్తు చేసే ప్రయత్నం
మనసు విలాసాలను మరిచి వివాదాల పాలవుతుంది
ఆలోచనలన్నీ నీకోసం విహారానికి బయలుదేరాయి
నీ మరుపుల్లో నేను మరకలా మారకూదదనుకుంటాను
నీ స్మ్రుతులన్నిటినీ నేనే చేధించాలనుకుంటాను
ఎంత స్వార్థం
నిన్ను నివురులా కప్పుకున్న గుండె
నువ్వు పలకరించకుంటే కొట్టుకోవడం మానేస్తుంది
నా వేదన అంతటికీ నిన్ను జవాబుదారుని చేయాలనీ నాకు లేదు
ఎందుకంటే నిన్ను దాచుకున్న నాదే కష్టం నష్టం
క్షణాలు నీవు పలకరించని కాలాన్ని నాది కాకుండా చేస్తున్నాయి
నీవి కాని వేటినీ అనుభూతులే కాదని భావాలూ ప్రకటిస్తున్నాయి
అందుకే ఇంత ఎదురుచూపు
నీ పలుకుల్లో నా ఆనందాలని వెతుక్కోవడానికి

©gopi kiran
  #Telugu #telugupoetry #Love #motivate #pyaar #love❤️ #Precious #teluguwriter #telugukavithalu  #films